Ticker

7/recent/ticker-posts

friendship sea స్నేహం సముద్రం


స్నేహం -- సముద్రం 

ఎగసి ఎగసి పడే సాగరకెరటామా 
దరిచేరు తీరంను మౌనంగా!!
కాలంతో సాగిపోయే స్నేహమా 
మరువక ,విడువక,కలిసుండు నేస్తంగా !!


సముద్రం లో అలలు నడుస్తుంటే ,
ఆపమని ఎవరు చెప్తారు ?తీరం  తప్ప !
మదిలో జ్ఞాపకాలు  రోజులు గడుపుతుంటే ,
ఆపమని ఎవరు చెప్తారు?నువ్వు  తప్ప! !


కడలి కెరటాల జోరుకు  అలుపుండదు ,
తీరం దూరమైనా ... !
మది లో జ్ఞాపకాలకు అలుపుండదు ,
నిన్ను ఎప్పుడు తలచినా ...... !!


అలలతో  ఎగసిపడే  సాగరమా ,
మౌనంగా  దరిచేరుతున్న తీరమదిగో  !
కాలంతో గడచిపోయే స్నేహమా  ,
మౌనంగా విడిచిపోతున్న నేస్తమిదిగో !!


సాగరకెరటంపై ఉదయించే సూర్యుడు !!
చూస్తుంటే అది ప్రకృతి అందం ...
స్నేహహృదయంతో  ఎదురుచూసే మిత్రుడు!!
పిలుస్తుంటే అది నేస్తం ఆనందం ....


సాగరం జలాన్ని రుచిస్తే ఉప్పన!!
నీ స్నేహాన్ని తలిస్తే ఉప్పెన.
ఉప్పగా ఎగసి పడే సాగరం!!
ఉప్పెన గా ఎగసిపడే స్నేహం.



కడలికి కెరటాలు ,
కనులకు కన్నీళ్లు,
నింగికి నీలి మబ్బులు,
నేలకు నీటి చినుకులు,
స్నేహానికి నేస్తాలు ....!!!!
 





Post a Comment

0 Comments