Ticker

7/recent/ticker-posts

Thank You Friend Telugu Poetry స్నేహాభివందనం

telugupoetry_sayloudtelugu

స్నేహం కవితలు - Friendship Poetry

స్నేహాభివందనం 

నాలోని  భావాలను
ప్రేరేపించావ్ 
నా  ఆలోచనలకు 
ప్రాణం  పోసావ్ 
కర్త  వై  
కర్మ  వై 
క్రియ  వై 
గెలుపు పూతోట లో 
విహరింపచేసావ్ 
మిత్రమా !!
నీకు ఇదే నా  వందనం 
స్నేహాభివందనం.


ధన్యవాదాలు 

మన  జ్ఞానవికాసం తో 
కవితల పులతోటల్లో 
పువ్వుల పదాల పరిమళం గ్రహిస్తూ,
నవ్వుల కావ్యాలు సృష్టిద్దాం 
మిత్రమా !!
ఏమంటావ్ మిత్రమా ?
ఇవే నా  ధన్యవాదాలు.

వయసు

నేస్తం మనసు ఎంత చిన్నదైనా ..!!
స్నేహంతో చూస్తే అది పెద్దదే .
నేస్తం వయసు ఎంత ఎక్కువైనా ..!!
స్నేహం చేస్తే అది చిన్నదే .

ఆనందం

మనం చూసే ఆకాశం లో మెరిసే నక్షత్రాలు  
చూస్తుంటే అందం ...!!
మనం చేసే స్నేహం లో మురిసే నేస్తాలు 
తిడుతుంటే ఆనందం..!!

దీపాలు

ప్రతి ఉదయం 
నా హృదయం తలచే
ఊహలో నీవే !!!
ప్రతి నిమిషం
నా నయనం  చూసే 
చూపులో లో నీవే!!!
ఆ ఊహా రూపాలే 
మదిలో దీపాలై 
వెలిగెను స్నేహంగా!!! 
చూస్తున్నావా నేస్తమా!!


కన్నీరు

నా హృదయంలో ఊహాలుగా! 
ఉండిపోకు నేస్తమా .
నా కనులలో  కలలుగా !
నిండిపోకు నేస్తమా.
నీ హృదయంలో ఊహాగా 
ఉండనా నేస్తమా ....?
నీ కనులలో కన్నీరుగా 
మారనా  నేస్తమా .....?


వర్షపుచినుకు 

వర్షపు చినుకులు మట్టిని తాకితే 
వచ్చే పరిమళమే నీ స్నేహం ...!
వర్షపు చినుకులు సూర్యుని తాకితే 
వచ్చే హరివిల్లే నీ స్నేహం ...!
వర్షపు చినుకులు నీటిని తాకితే 
వచ్చే  చినుకులచిటపటలే  నీ స్నేహం.


కవితలు 

మన మాటల్ని మూటకట్టి 
జ్ఞాపికలా దాయనా !!
మన జ్ఞాపకాల్ని కట్టకట్టి 
కవితలా రాయనా !!
ఏమంటావ్ నేస్తమా??


కాలం 

గతించిన కాలాన్ని తీసుకోలేక ,
జరగబోయే కాలాన్ని ఊహించలేక ,
ఉండే వర్తమానం లో గతించే కాలమా ....,
నా కోసం క్షణం ఆగవా ...?
నీ చెలిమి లో ఉండి పోతా .


భవిషత్ 

కోరుకున్నది జరగట్లేదు ,
అనుకున్నది రావట్లేదు ,
నచ్చినది దరిచేరడం లేదు,
అలా అని 
ఆగిపోదు గా కాలం నీకోసం నేస్తమా...!!!
జరిగినదే  కోరుకున్నట్లుగా ...
అనుకున్నదే  జరిగినట్లుగా .....
నచ్చినదే దొరికినట్లుగా ....
ఎలా ఐనా 
ఆనందం తో అనుభవించడమే జీవితం కదా నేస్తం.
ఏమంటావ్?

పువ్వు

మదిలో నదిలా ..!!
కదిలే అలలా .....!!
కురిసే వానలా ....!!!
నడిచే  మబ్బులా..!!
మెరిసే తారలా ...!!
పచ్చని పైరులా ..!
పుత్తడి  పువ్వులా..!!
నిండిపోయావిలా  నా హృదయం లో నేస్తంగా.


గాలి

నువు వెదురు తో చేసిన మురళి లో మౌనమై,
గాలి లా నిండకు..!!
నా ఎదురు చూసే కనులకు కన్నీరై,
స్నేహం గా మారకు ..!!
నువు వెతికి చూసే మనసులో జ్ఞాపకమై,
ఉండిపోతా. 
ఏమంటావ్ నేస్తమా............!


అభిమానం 

ఆకారాన్ని బట్టి రూపం మార్చేది జలం.
ఆవేశాన్ని బట్టి ఓదార్చేది స్నేహం.
అవసరాన్ని బట్టి చేయగలిగేది ఋణం.
అభిమానాన్ని బట్టి చేయగలిగేది స్నేహం.

Post a Comment

0 Comments