ఇంట్లోనే మనం సున్నిపిండి తయారుచేసుకునే పద్ధతులు 👇
👉మీరు ప్రతిరోజూ సున్నిపిండి వాడాలి అనుకున్నపుడు దానిని నీటితో కానీ ,పాలతో కానీ,టొమాటొరసం తో కానీ ,ఆరంజ్ జ్యూస్ తో కానీ నానబెట్టుకొని వాడడం మంచిది నేరుగా మీ చర్మము పైన రుద్దకండి.కళ్ళ 👀 కింద అస్సలు వాడకూడదు.మరి పాత రోజుల్లో వాడేవారు అనుకుంటారేమో .........?పాత రోజుల్లో మనపెద్దవాళ్లు సున్ని పిండి వాడేవారు ఎలాగంటే ముందు ఆయిల్ తో కానీ మీగడ తో కానీ నలుగు పెట్టుకొని,తర్వాత సున్నిపిండి ఉపయెగించేవారు కానీ నేరుగా మాత్రం చర్మానికి అప్లై చేసేవారు కాదు.ముఖం పైన మొటిమలున్నవారు సున్నిపిండి వాడకపోతే మంచిది,ఎందుకంటే పింపుల్స్ rupture ఐయి పది ఉండేవి యాబై అవుతాయి.పసుపును కూడా ఎక్కువ వాడకండి నల్లబడే అవకాశాలు కూడా ఉన్నాయి.ఈ రోజుల్లో సున్నిపిండి వాడాలంటే బాత్రూమ్ టైల్స్ పడిపోతాయి అనుకుంటారు.మీరు పసుపును కొంచెం తగ్గించుకొని వాడుకోవడం వల్ల కొంచెం బాత్రూమ్ టైల్స్ పై మరకలను తగ్గించవచ్చు.క్రింద తెలిపిన ఈ మూడు సున్నిపిండి విధానాలను చూడండి....
1)మొదటి పద్దతి :
కావలసిన పదార్దాలు:
- పెసరపిండి 250 గ్రామ్
- సెనగపిండి 150 గ్రామ్
- బియ్యపుపిండి -150 గ్రామ్
- రోస్ పెటల్స్ -50-100గ్రామ్స్
- ముల్టానా మట్టి -100గ్రామ్స్
- బావంచాలు -25-30 గ్రామ్స్
- కచోరాలు -50గ్రామ్స్
- పసుపు -25గ్రామ్స్
- ఆరెంజ్ పీల్ పౌడర్-50గ్రామ్స్
- వేపాకు పొడి -25 నుండి 50గ్రామ్స్
- మినప్పప్పు -50గ్రామ్స్
- మెంతులు -50గ్రామ్స్
వీటన్నిటిని బయట పిండి మిల్లు లో కానీ ఇంట్లోనే కానీ పిండి పట్టించుకోని గాజుసీసాలో బద్రపరుచుకోండి.బావంచాలు అనే మొక్క యొక్క గింజలను బావంచాలు అంటారు.బావంచాలు శాస్త్రీయనామం సొరెలియా కోరిఫొరియా (psoralea corylifolia).దీనిని సంస్కృతం లో బాకూచి అంటారు. ఇది చర్మానికి ఆంటీ బాక్టీరియాల్ గా పనిచేసి చర్మం నుండి చమట వాసనను పోగొడుతుంది.కచోరాలు అంటే తెలుగులో దీనిని గంధ కచోరాలు లేదా కాచారాలు అంటారు దీని శాస్తీయనామం హెడీచియం స్పైకాటుమ్ (Hedychium spicatum).దీని ఎండిన వేర్లను మనం ఈ సున్నిపిండి తయారీకి ఉపయోగించాలి.కచోరాలు వేర్లరూపంలో మనకి ఆయుర్వేద షాపులలో కానీ పచారీ కోట్ల లో కానీ ఆన్లైన్ లో కానీ దొరుకుతాయి.కచోరాలు పొడి రూపం లో కన్నా వేర్లరూపంలో కొని మనమే పొడి చెడుకొంటే మంచి సుగంధ భరితంగా ఉంటుంది. మినప్పప్పు మెంతులు జిగురు స్వభావం వలన చేర్మానికి నునుపునిచ్చి గరుకు స్వభావం లేకుండా చేస్తాయి.ఈ పద్దతి లో మాకు తయారుచేసుకోవడం కష్టం అనుకొంటే క్రింద మరో విధానం కూడా ఉంది చూడండి.
2)రెండవ పద్దతి:
కావలసిన పదార్దాలు:
- సెనగపప్పు-100గ్రామ్స్
- పెసరపప్పు-300గ్రామ్స్
- బియ్యం -200గ్రామ్స్
- మినప్పప్పు -100గ్రామ్స్
- కస్తూరి పసుపు-25 నుండి 50గ్రామ్స్
- కచోరాలు -20గ్రామ్స్
వీటన్నింటినీ పొడి చేసుకొని నిల్వ చేసుకోండి.కాఫీ ప్లేవర్ ఇష్టం ఉన్నవారు సున్నిపిండి ని కలుపుకొని వాడేముందు మూడు స్పూన్ల సెనగపిండి అరస్పూన్ కాఫీ పౌడర్ని కలుపుకొని అప్లై చేసుకోవచ్చు.కొంతమంది బయటకొన్న సెనగపిండి నేరుగా వాడుతుంటారు అలా వాడకండి వీలుంటే ఇంట్లోనే సెనగపప్పు,పెసరపప్పు ,మినప్పప్పు మిశ్రమాన్ని వాడండి కానీ డైరెక్ట్ గా సెనగ పిండి వాడకండి.ఈ మినప్పప్పు మరియు పెసరపప్పు జిగురు చర్మానికి మృదుత్వాన్ని ఇస్తాయి.సున్నిపిండిలో కొంచెం ఒక స్పూన్ బాదం నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ వేసుకొని కొంచెం నీటిని వేసుకొని ఉపయోగించవచ్చు.
3)మూడవ పద్దతి :
కావలసిన పదార్దాలు:
- చందనం
- బియ్యపుపిండి
- సెనగపిండి
ఈ మూడింటిని సమపాళ్లలో కలుపుకొని అందులో కొంచెం పాలు మరియు తేనే కలుపుకొని చిక్కటి పేస్ట్ లా తయారుచేసుకొని ముఖానికి అప్లై చేసుకొని ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని తర్వాత బాగా స్కర్బ్ చేస్తూ కడిగేసుకోండి.
4)నాల్గవపద్ధతి:
👉తులసి ఆకులపొడి /Holy Basil (Ocimum sanctum)-100గ్రాములు
👉తుంగముస్తలు/తుంగ/తుంగ గడ్డలపొడి Nut Grass/Nut sedge(Cyperus roundus) - 100గ్రాములు (తుంగ గడ్డలు ఆయుర్వేద షాపులలో పొడిరూపంలోను విడిగా కూడా దొరుకుతాయి )
👉ఉసిరికాయల పొడి /Indian gooseberry/ (Phyllanthus emblica)/amla-100 గ్రాములు
👉బావంచాలు పొడి /Babchi (psoralea corylifolia)-100గ్రాములు (గింజలు కూడా దొరుకుతాయి)
👉మారేడు ఆకులపొడి /Bael/(Aegle marmelos) -100గ్రాములు (మారేడు పండు గుజ్జును ఎండబెట్టినది లేదా మారేడు ఆకులను ఎండబెట్టినవి తీసుకోవాలి.
👉మెంతుల పొడి /Fenugreek/Methi-100గ్రాములు
👉 పచ్చ పెసల పొడి /Green gram/Mung beans -700grams :పచ్చ పెసలను కొంచెం నేతిలో (ghee ) మాడిపోకుండా వేయించి పొడి చేసుకోవాలి.(మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా లేదా గరుకుగా ఉండేటట్లు పొడిచేసుకోండి)
మీరు ఇంట్లో సున్నిపిండి తయారుచేయుటకు ముందుగా ఏం చేయాలి?
మీరు సున్నిపిండి ఇంట్లో తయారుచేసుకోవాలంటే ముందునుంచే మీరు ప్రణాళిక ప్రకారం లేదా మన సీసన్ ను బట్టి వేపాకులను,ఆరెంజ్ తొక్కలను, రోజారెక్కలను,తులసి ఆకులను ,మారేడు ఆకులను,ఉసిరి కాయలను నీడలో ఎండబెట్టుకోవడం చేసుకోవాలి.కావలసిన ముడిసరుకులను ముందుగానే తెప్పున్చుకుపెట్టుకొని అన్నీ సమకూరిన తరువాత తయారు చేసుకోవడం సులభం.సున్నిపిండిని ఏపద్ధతిలో చేసుకొన్నా ముందు మీగడ తో కానీ ఆయిల్ తో కానీ మర్దన (massage ) చేసుకొని తర్వాత సున్నిపిండితో బాగా రుద్దడం ద్వారా చర్మం పై ఉన్న మృతకణాలు(డెడ్ స్కిన్ ) పోతాయి మరియు చర్మానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఇక మీ ఇంట్లోనే సున్నిపిండిని తయారుచేసుకోండి.
ఎలా వాడాలి:
ప్రతిరోజూ శరీరం మొత్తానికి వాడవచ్చు మన ముఖచర్మం చాలా మృదువుగా ఉంటుంది కాబట్టి ఒక్క ముఖానికి మాత్రం వారానికి రెండుసార్లు వాడండి.
👉స్ట్రెచ్ మార్క్స్ ఉండేవారికి ఒకసారి ఏర్పడితే అవి పోవు సున్నిపిండి వాడడం పరిస్కారం కాదు వారు చెర్మం ముడతలుపడక ముందునుంచే విటమిన్ E ఎక్కువ ఉండే ఆహారపదార్దాలు తీసుకోవడం మంచిది. విటమిన్ E పోషకాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్దాలను మీరు మా తర్వాతి శీర్షికలలో చూస్తారు.
మరిన్ని సులువైన సహజ పద్ధతులకు ఇక్కడ క్లిక్ చేయండి 👈
0 Comments
మీరిచ్చే ప్రతి కమెంట్ ప్రోత్సాహమే మన సే లౌడ్ తెలుగు కు ఉత్సాహం ......అందుకే కమెంట్ చేయండి మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.