Gowtam Buddaha Inspirational quotes In sayloudtelugu |
👉జీవితంలో విజయాన్ని పొందాలంటే నీ పని పట్ల నీవు నిజాయితీగా ఉండాలి.
👉నువ్వు ఎంత గొప్పవాడివి అనేదానికంటే ఎంత దయగల వాడివి అనేదే ముఖ్యమైన విషయం. చాలా సార్లు నీ డబ్బు,తెలివి కంటే నీ దయే ఎదుట వారి హృదయం నింపగలదు.
👉సూర్యుని వెలుగు,చంద్రుని కాంతి ,నిజానికి ఉన్న శక్తి ఈ మూడు దాచాలన్నా దాగవు.
👉ప్రేమను అడిగేవానిగా ఉండకు ప్రేమను ఇచ్చేవానిగా ఉండు.
👉విజయాన్ని పొందే వారి పెదవులపై ఎప్పుడూ రెండు విషయాలు ఉంటాయి ఒకటి మౌనం రెండవది చిరునవ్వు .
👉అందమైన వారు ఎప్పుడూ మంచిగా ఉండకపోవచ్చు కానీ మంచివారు ఎప్పుడూ అందమైన వారే.
👉బంధాలకు మరణం అంటూ ఉండదు మనమే మన అహంతో,అవివేకంతో బలవంతంగా చంపేస్తాం.
👉నమ్మకం,ప్రార్థన... ఈ రెండూ అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యం చేయగలవు.
👉నీవు మాట్లాడే మాట నిజమైందిగా ... అవసరమైనదిగా .. మృదువుగా... ఉండాలి.
👉గతం దేన్నయినా కోల్పోయేలా చేయవచ్చు.. కానీ తిరిగి మొదలుపెట్టే అవకాశం ఎప్పటికీ మన చేతుల్లోనే ఉంది.
👉నీ ఆనందం కోసం ఇతరులపై ఆధారపడకు. అది నిన్ను ఒంటరిగా మిగల్చవచ్చు. నిన్ను నిరుత్సాహపరచవచ్చు. కానీ అదే ఆనందాన్ని నీ లోనే వెతుక్కోంటే అపుడు ఒంటరిగా ఉన్నా ఆనందంగా ఉండగలవు.
👉ప్రతిరోజూ మనం సరికొత్తగా పుడతాం ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అనేదే అతిముఖ్యమైన విషయం.
👉నీవు ఇతరులకోసం దీపం వెలిగిస్తే అది నీకు కూడా దారిచూపిస్తుంది.
👉నీవు మౌనంగా ఉన్నపుడు మాత్రమే దేన్నయినా బాగా వినగలవు.
👉మీకు లభించినదానికి కృతజ్ఞత కలిగి ఉండండి. ఎందుకంటే ఇవి కూడా దొరకని వారు చాలా మంది ఉంటారు.
👉చిరునవ్వు.. నువ్వు హాయిగా ఉండేలా చేస్తుంది,ప్రార్ధన... నువ్వు దృఢంగా ఉండేలా చేస్తుంది, ప్రేమ.. నువ్వు ఆనందంగా ఉండేలా చేస్తుంది.
👉ఒక నిమిషం-రోజునే మార్చగలదు ,ఒక రోజు - జీవితాన్నే మార్చగలదు,ఒక జీవితం ప్రపంచాన్నే మార్చివేయగలదు.
👉మౌనం నవ్వు ఈ రెండూ అద్భుతమైన సాధనాలు. నవ్వు సమస్యలు సులువుగా దాటేలా చేస్తుంది.మౌనం సమస్యలే లేకుండా చేయగలుగుతుంది.
👉నీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకు... సూర్యుడు,చంద్రుడు పూర్తిగా వేరు ఎవరి సమయం వచ్చినపుడు వారు ప్రకాశిస్తారు. ఎవ్వరి విలువ వారిదే
👉శరీరానికి మరణం ఒక్కసారే కాని మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే.
👉సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది.
👉ఆశ దుఃఖానికి హేతువు,ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతం అవుతుంది.
👉శాంతంగా ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు.
👉వేలాది వ్యర్ధ మాటలు వినడం కన్నా శాంతిని,కాంతిని ప్రసాదించే ఒక్క మంచి మాట చాలు.
👉నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు,కాని ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు.
👉ప్రతి ఒక్కరిలో మంచి చెడు రెండూ ఉంటాయి,మనం మంచే చూడాలి,ఆ మంచిని అలవాటు చేసుకోవాలి.
👉ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నాడని గురించి ఆలోచిస్తే,ఆనందంగా లేనివారు తమ దగ్గర లేనిదాని గురించి ఆలోచిస్తారు.
👉ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమ మాత్రమే...!
👉కాలాన్ని వృధా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే.
👉జీవితం అంటే పోరాటం, అలాంటప్పుడు స్వార్థం కోసమో,అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు. ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు.
👉ముందు నువ్వు సంస్కరించుకో,ఆ తరువాత సమాజాన్ని సంస్కరించు...!
👉అదుపులేని ఆలోచనలు శత్రువుకన్నా ప్రమాదకరం.
👉ప్రియమైన వారి వలన సంతోషమే కాదు, దుఃఖం,బాధ,కష్టాలు కూడా కలుగుతాయి.
👉గతాన్ని తలచటం మానుకో,భవిష్యత్తు గురించి కలలు కనకు,ప్రస్తుతం మనసు పై లగ్నం చేయి
👉కులాన్ని బట్టి కాక,గుణాన్ని బట్టి మనిషిని గౌరవించాలి.
👉సాయం చేసేవాడు దేవుడు,మంచిగా మాటలు చెప్పేవాడు గురువు,నీతిగా బ్రతికేవాడు మనిషి.
👉చదువు కన్నా మంచి నడవడిక ముఖ్యం.
👉ఏదైనా చేయడం విలువైనది ఐతే, మీ హృదయం తో చేయండి.
👉నాలుక పదునైన కత్తి లాంటిది... రక్తం తీయకుండానే చంపేస్తుంది.
👉ఏదీ శాశ్వతం కాదు.
👉మీరు ఎవ్వరికైనా దీపం వెలిగిస్తే,అది మీ మార్గాన్ని కూడా ప్రకాశవంతం చేస్తుంది.
👉వివేకంతో జీవించిన వ్యక్తి మరణానికి కూడా భయపడకూడదు.
👉మీ అహాన్ని వదులుగా ఉండే వస్త్రంలా ధరించండి.
👉అభిప్రాయాలు ఉన్న వ్యక్తులు ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకొంటారు.
👉ఆవేశపూరిత ఆలోచనలు లేని వారు ఖచ్చితంగా శాంతిని పొందుతారు.
👉బాధలకు మూలం అనుబంధం.
👉నిజమైన ప్రేమ అవగాహన నుండి పుడుతుంది.
👉ఒక పువ్వు యొక్క అద్భుతాన్ని మనం స్పష్టంగా చూడగలిగితే, మన జీవితమంతా మారిపోతుంది.
👉ప్రతి ఉదయం మనం మళ్లీ పుడతాం. ఈరోజు మనం చేసేది చాలా ముఖ్యమైనది.
👉మనస్సు మరియు శరీరం రెంటికీ ఆరోగ్య రహస్యం ఏమిటంటే,గతం గురించి దుఃఖించడం,భవిష్యత్తు గురించి చింతించడం లేదా ఇబ్బందులను అంచనా వేయడం కాదు,కానీ ప్రస్తుత క్షణంలో తెలివిగా మరియు శ్రద్దగా జీవించడం.
👉అన్ని తప్పులు మనస్సు వల్లనే పుడుతాయి. మనస్సు మారితే తప్పులు మిగిలిపోతాయా?
👉మార్పు లేకుండా ఏదీ ఉండదు.
👉ఆరోగ్యం గొప్ప బహుమతి,సంతృప్తి గొప్ప సంపద.
👉మనలోని ఆలోచనలతో మనం ప్రపంచాన్ని తయారుచేస్తున్నాము.
👉మీ పని మరియు మాటలు ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటే ఆనందం వస్తుంది.
👉మీరు ముళ్ళు విసురుతారు,నా మౌనంలో పడి అవి పువ్వులుగా మారతాయి.
ఇంకా sayloudtelugu లో మరిన్ని మంచిమాటలకొరకు క్లిక్ చేయండి
2 Comments
Good information
ReplyDeleteThank you🙏
ReplyDeleteమీరిచ్చే ప్రతి కమెంట్ ప్రోత్సాహమే మన సే లౌడ్ తెలుగు కు ఉత్సాహం ......అందుకే కమెంట్ చేయండి మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.