Ticker

7/recent/ticker-posts

jandhyala joke's | sayloudtelugu


😃😃😄😄😄జంధ్యాల కామెడీ 😄😆😅😊😍


సంప్రదాయం 

"చూడమ్మా.. ముందు భోజనం నీ భర్తకు వడ్డించి అతను తిన్న తర్వాతనువ్వు తిను "చివరి జాగ్రత్త చెప్పింది. "ఓహో అందులో ఏవైనా హానికరపదార్దాలేమైనా ఉంటే మనకు తెలుస్తుంది . అంతేనా మమ్మీ "అన్నది ఆధునికతరం యువతి .అత్తగారింటికి వెళుతున్నది కూతురు . జాగ్రత్తలన్నీ చెబుతున్నది తల్లి .  

 అణకువ 

"మా వాడికి మంచి అణకువ కలిగిన అమ్మాయి కావాలి.ఎదురు మాట్లాడకూడదు . వంచింతల ఎత్తకూడదు"చెప్తాడు జగన్నాధం. "ఆలా అయితే ఓ అమ్మాయి ఉంది "చెప్పాడు జోగినాధం."ఏం చేస్తుంటుంది?"వీధుల్లో పాతపేపర్లు ఏరుకుంటుంది"

మరపు

"గొడుగు పోయిందని ఎపుడు గుర్తొచ్చింది "?
ఇంటికి రాగానే ప్రొఫెసర్ను ప్రశ్నించింది భార్య.
"వర్షం వెలిశాక ముడుద్దామని చూస్తే చేతిలో గొడుగు లేదు"
చెప్పాడా ప్రొఫెసర్ .

వడ్డీ 

రాముడు,భీముడు పార్కులో కూర్చున్నారు. ఓ బిచ్చగాడు వచ్చాడు.
అతని బొచ్చెలో వందరూపాయల నోటువేశాడు రాముడు.
"దానధర్మాలకైనా ఒక హద్దుండాలి. ముష్టివెధవకు 
వందరూపాయల వేసేది?"కోపంగా అన్నాడు భీముడు.
"దానంకాదు ధర్మంకాదు. వాడి దగ్గర ఐదువేలు అప్పు తీసుకున్నాను.
దానికి నెలనెలా వంద రూపాయలు వడ్డీ. " చెప్పాడు రాముడు 


చాలాకాలం 

"ఒరే బాబ్జీ...... నువ్వు ఆ జానకి చాలా రోజుల్నుంచీ 
ప్రేమించుకుంటున్నారు కదా . పెళ్లి చేసుకుంటే బాగుంటుంది"
సలహా ఇచ్చాడు గోపి.
"చేసుకొంటే బాగానే ఉంటుంది.కానీ నా భార్య,ఆమె భర్త 
అన్యమైపోతారు కదా"చెప్పాడు బాబ్జీ.

పీచు 

"అరెరె! ఇదేంటి చంద్రమౌళి ఈ జనపనార తింటున్నావు?
ఇదేం జబ్బు?" ఆశ్చర్యంగా అడిగాడు స్నేహితుడు.
"ఏం లేదన్న.. రోజూ పీచు పదార్ధాలు తినమని డాక్టరుగారు చెప్పారు"
చెప్పాడు చెంద్రమౌళి.

టైటిల్ 

"సినిమా చూసిన జనం మనటైటిల్ గురించే మాట్లాడుకోవాలి.
మౌత్ పబ్లిసిటీ అదిరిపోవాలి.మంచి టైటిల్ చెప్పవయ్యా థియేటరూ"
చుట్ట పీకుతూ అన్నాడు నిర్మాత.
"ఇదీ ఒక సినిమానేనా? పెడదాం"
చెప్పాడు రైటర్.

నోరు మూసుకుని 

"ఈ మధ్య మా ఆయన వంటలు ఎంతచెండాలంగాఉన్నా 
లొట్టలు వేసుకుని తింటున్నారు"
ఆనందంగా చెప్పింది అంజలి కుమారితో.
"ఏం మంత్రం వేశావేం?"
కుతూహలంగా అడిగింది కుమారి.
"ఆ వంటకాలాన్ని నువ్వు ఇచ్చావని చెబుతున్నాను.
అన్నట్లు కుమారీ.... నువ్వు వంటలు దరిద్రంగా చేస్తావని 
ఇంట్లోంచి వెళ్లగొట్టిన మీ ఆయన కబురేమైనా వచ్చిందా?"
అడిగింది అంజలి.

               నిద్రలో                  

"నగేష్ గారూ....ఈమధ్య అర్ధరాత్రుళ్ళు నాకు తెలియకుండా 
నిద్రలో నడిచి వెళ్తున్నాను.
ఆలా గంటల తరబడి ఐదారు కిలోమీటర్లు దూరం నడిచిన తర్వాత
మెలకువ వస్తున్నది. ఏమైనా మంచి వైద్యం చెయ్యండి "
అడిగాడు శివరావు హిప్నోటిస్టుని.
"ఒక పని చెయ్యండి . మీ మంచానికి కోద్ది దూరంలో
రెండడుగుల వెడల్పు,మూడడుగుల లోతు ఉండే గుంటను
నాలుగువైపులా తవ్వించండి.
మంచం దిగి రెండడుగులు వేయగానే గుంటలో పడతారు.
వెంటనే మెలకువ వస్తుంది"సలహా ఇచ్చాడు నగేష్ .

         తెలిసింది       

హిస్టరీ క్లాస్ జరుగుతున్నది.
"నీకు తెలిసిన ఇద్దరు చక్రవర్తుల పేర్లు చెప్పమ్మ "
మానసను అడిగాడు టీచర్.
"మిధున్ చక్రవర్తి,జేడీ చెక్రవర్తి సార్" చెప్పింది మానస

          విడాకులు           

"నాకెలాగైనా విడాకులిప్పించండి.
మా ఆవిడ ఆరేళ్లుగా నాతో మాట్లాడం లేదు "
లాయర్ దగ్గర మొరపెట్టుకున్నాడు సోమయాజులు.
"జాగ్రత్తగా ఆలోచించు . అలాంటి భార్యలు దొరకడం చాలా కష్టం 
నీవెంతో అదృష్టవంతుడివి"
అనుభవంతో సలహా ఇచ్చాడు లాయర్.

        తగ్గించు         

భరణి భార్య వేసిన బడ్జెట్ చూసి -
"సినిమాలు నెలలో ఎనిమిది రాసావు.ఖర్చు చాలా ఎక్కువ.
కనీసం సగమైనా తగ్గించాలి ."సలహా ఇచ్చాడు.
"పోనీ అలాగే చేద్దాం.నేనొక్కదాన్నే వెళ్ళొస్తాను సినిమాలకు"
చెప్పింది భార్య.

       ప్రమోషన్           

"ఐదు సంవత్సరాల నుండి ఇదే కోర్టులో చూస్తున్నాను,
సిగ్గులేదంటయ్యా " అన్నాడు జడ్జి జేబుదొంగను చూసి.
"మీకు  ప్రమోషన్ రాకపోతే నాకెందుకు  సార్ సిగ్గు."
ప్రశ్నించాడు జేబుదొంగ.

           కిళ్ళీ             

సినిమా హాల్లో ఇంటర్వెల్లో భర్త బయటకు వెళ్లి కిళ్ళీ తెచ్చి భార్యకిచ్చాడు 
"అబ్బో......ఏమిటి ఇంతలావు కిళ్ళీ తెచ్చారు?"
ఆనందంగా అడిగింది భార్య.
"నోటికి టేపు అంటించడం బాగుండదని"
చెప్పాడు భర్త.

           మెడ            

"డాక్టరుగారూ . నాలుగురోజులనుంచీ మెడ అసలు తిరగడంలేదు .
కొంచెం చూడండి సార్ ." బాధగా అన్నాడు శీను.
"భయపడకండి. నేను అటవైపొచ్చి మాట్లాడతాను"
లేస్తూ అన్నాడు డాక్టర్.


అంతే ఉన్నాయి 
"నిన్న నేనూ , నా గర్ల్ ఫ్రెండు బీచ్కి, పార్కులకు తిరిగాం.
వెయ్యి రూపాయలు ఖర్చుయ్యాయి"
చెప్పాడు సంపత్.
"అంతేనా ? " అర్చర్యంగా అడిగాడు రాజు.
"ఏం  చేస్తాం?ఆ అమ్మాయి దగ్గర అంతే ఉన్నాయి "
చెప్పాడు సంపత్ .

      పరిహారం      

నారాయణ నడుస్తుండగా బజార్లో డాక్టర్ ఎదురొచ్చడు.
"అదేంటి నారాయణగారు ఇంకా కుంటుతున్నారు .
మీరు హాయిగా నడవచ్చునని నాలుగు నెలల క్రితమే చెప్పానుగా?"
అన్నాడు డాక్టర్.
"ఇన్సూరెన్స్ నుంచి నష్టపరిహారం వచ్చేదాకా ఇలాగే నడవమని 
మా లాయర్ సలహా " చెప్పాడు నారాయణ.

            మూడు            

"ఏంటి రమ్యా ...మూడు కళ్లజోళ్లు వాడుతున్నావ్ ?
ఆశ్చర్యంగా అడిగింది భావ్య .
"ఒకటి దూరపు చూపుకు,ఒకటి దగ్గర చూపుకు,
మరొకటి ఆ రెంటినీ వెదకడానికి"చెప్పింది రమ్య .

           వృత్తి            

"?మీ వృత్త"
"పత్రికలకు కథలు,కవితలు,వ్యాసాలు,నవలలు రాయడం"
"?మరి హాబీ"
"ఇన్కంటాక్స్  డిపార్ట్మెంట్ లో ఉద్యోగం "


👉ఎమెస్కో బుక్స్ పబ్లిష్ చేసిన జంధ్యాల జోక్స్ నుండి ఇవి గ్రహింపబడినవి .


👇మీ అభిప్రాయాలను క్రింద కామెంట్స్ రూపం లో తెలియచేస్తూ  మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయగలరని ఆసిస్తూ....మీ సే లౌడ్ తెలుగు 👩

Post a Comment

0 Comments