Ticker

7/recent/ticker-posts

గర్భ సంరక్షణ -Pregnancy Care And What Are The Necessities Of Scanning??



సాధారణ గర్భధారణ లో తీసుకోవలసిన ముందుజాగ్రత్తలు మరియు ప్రెగ్నెన్సీ స్కానింగ్ యొక్క ఆవశ్యకతలు 

ఎటువంటి రుగ్మతలు లేకుండా సాధారణ గర్భం దాల్చిన వారు  నెల తప్పిన తర్వాత ఒక నాలుగు రోజులకి యూరిన్ టెస్ట్ చేసుకొంటే పాజిటివ్ వచ్చిందనుకోండి.పోసిటివ్ వచ్చిన ఒక వరం తర్వాతనే స్కానింగ్ లో గర్భం అనేది కనిపిస్తుంది.చాలామంది నెలతప్పగానే స్కానింగ్ కి వెళ్తుంటారు అలా చేయకండి ఎందుకంటే ఒక వారం పది రోజులకు గాని  గర్భాశయం లో పిండం అనేది స్పష్టంగా  కనిపించదు.


pregnancy care in Telugu_women Health_sayloudtelugu

ప్రెగ్నన్సీ దశలలో ఉండే మాసాలను (months )డాక్టర్లు మూడు త్రైమాసికాలుగా పరిగణిస్తారు.ఈ త్రైమాసికాలను  మొదటి త్రైమాసికము (First trimester),రెండవ త్రైమాసికము (Second trimester)మరియు మూడవ త్రైమాసికము (Third trimester) అంటారు.
  • మొదటి త్రైమాసికము-మొదటి పదమూడు వారాలు 
  • రెండవ త్రైమాసికము-పద్నాలుగు నుండి ఇరవై ఆరు వారాలు 
  • మూడవ త్రైమాసికము -ఇరవై ఏడు వారాల నుండి శిశివు జననం వరకు 

స్కానింగ్ యెక్క ఆవశ్యకతలు?

గైనకాలోజిస్ట్స్  స్కాన్ లు రాస్తున్నారు అంటే దాని ద్వారా బిడ్డ యెక్క పూర్తి సమాచారాన్ని పొందడం కొరకే అని గ్రహించగలరు.మన చెవికి వినిపించని శబ్ద తరంగాలను (sound waves ) ఉపయోగించి చేసే పరిక్షే ఈ ఆల్ట్రాసౌండ్(ultrasound scan ).
👉పాత కాలం లో మూడో నెల వరకు స్కాన్ వద్దు అని అపోహ తో ఉంటారు అది సరికాదు.ఎందుకంటే ఖర్చితంగా 6నుండి 8వారాల మధ్య ఒక స్కాన్ అవసరం ఇది ఎందుకంటే కరెక్టుగా బేబీ వచ్చి గర్భసంచి లో కూర్చుందా లేదా ,హార్ట్ బీట్ వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి మరియు జెస్టేటషనల్ ఏజ్ ని తెసులుకోవడానికి దీనినే ఫీటల్ వయబిలిటీ స్కాన్  అంటారు.ఒకవేళ ఇర్రేగులర్ సైకిల్స్ వారు 7వారాలనుకొని స్కాన్ కి వస్తే వాళ్ళకి 5వారాలని తెలిస్తే వాళ్లకు కార్చితంగా మరలా రెండువారాలకు స్కాన్ చేయాల్సిఉంటుంది.


👉రెండొవ సారి స్కాన్  12 నుండి 13 వారాలకు అవసరం దీనినే నూకల్ ట్రాన్స్లుసెన్సీ (NUCHAL TRANSLUCENCY)స్కాన్ అంటారు.మూడో నెల పూర్తి అయి నాలుగో నెల మొదలై నపుడు చేస్తారు.దీని ద్వారా  క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్  అంటే జన్యుపరమైన లోపాలను తెలుసుకోవచ్చు.

👉ఐదో నెల చివరలో18 నుండి  20 వారాల మధ్యలో టిఫా స్కాన్ (Tiffa scan: Targetted Imaging For Fetal Anomalies)ద్వారా బేబీ యెక్క పూర్తి అవయవ వ్యవస్థ ఎలా ఏర్పడిందో తెలుగుకొనుటకు చేస్తారు .ద్వారా బేబీ యెక్క పూర్తి అవయవ వ్యవస్థ ఎలా ఏర్పడిందో తెలుగుకొనుటకు చేస్తారు .

👉తర్వాత రెండు గ్రోత్ స్కాన్ లు చేయవలసిన అవసరం ఉంటుంది ఒకటి 28 వారాలకు మరియు 34నుండి 35వారాలకు ఉంటుంది.

👉గర్భవతి ఆరోగ్య పరిస్థితులను పిండం యెక్క అభివృద్ధిని తెలుసుకొనుటకు పైన తెలిపినన్నిసార్లు కంటే డాక్టర్ సలహామేరకు ఎక్కువ సార్లు కూడా స్కానింగ్ అవసరపడొచ్చు అని గమనించగలరు.

😊వీలున్నంత వరకు సాత్వికమైన ఆహారం తీసుకోవాలి.ప్రతి స్త్రీ తను గర్భవతిగా ఉన్నప్పుడే మంచి ఆలోచనలను కలిగివుండాలి,మంచి పుస్తకాలు చదవాలి,మంచి వారితో స్నేహం చేయాలి,మంచి దృశ్యాలుచూడాలి ,మంచి మాటలు వినాలి దానితోపాటుగా పుట్టింటి వారు అత్తింటివారు కట్టుకున్న భర్త అందరూ నిరంతరం 
ప్రేమగా చూసుకోవాలి.ఇప్పుడున్న ఆధునిక పరిజ్ఞాన ప్రపంచము  లో సాధారణ పద్దతిలో ప్రెగ్నెన్సీ రాలేదు అని దిగులు పడుతూ మీ సమయాన్ని  వృధా కానివ్వకుండా  మీ వయసు పెరగక ముందే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి సంతాన లేమి సమస్యని ఎదుర్కోండి.

👉ఎటువంటి  ఇన్ఫెర్టిలిటీ  ట్రీట్మెంట్ లేకుండా సాధారణ గర్భధారణ పొందిన వారికి ఇక్కడ తెలిపిన వివరములు అవగాహన  కొరకు మాత్రమే.పూర్తి వివరముల కొరకు మీరు మీ డాక్టర్ను సంప్రదించండి.

Post a Comment

0 Comments