రాగులతో ఆహారం మరియు ఆరోగ్యం
రాగులను శాస్త్రీయంగా ఎళుసైన్ కోరకానా (Eleusine coracana) అని పిలుస్తారు. ఇంగ్లీష్ లో ఫింగర్ మిల్లెట్స్ (finger millets) అంటారు. మన తెలుగులో చాలా ప్రాంతాలలో రాగులనే అంటారు కానీ కొన్ని చోట్ల చోడి (చొడ్లు) అని మరికొన్ని చోట్ల తైదలు ఇంకొన్ని చోట్ల మల్లటి అని పిలుస్తారు.
రాగులు మంచి పోషకవిలువలను కలిగిఉండడమేకాక మంచి ఔషధగుణాలను కూడా కలిగి ఉన్నాయి అందుకే రాగులను పిల్లలకే కాదు ఎవయసు వారికైనా మంచి పౌష్టికాహారం అని చెప్పవచ్చు.దక్షిణాది లో అంటే కర్ణాటక,తెలంగాణ,రాయలసీమ ప్రాంతాలలో ఎక్కువగా ఈ రాగులను సంగటి లేదా రొట్టెల మరియు జావ రూపం లో తినటం మనం ఎక్కువగా చూస్తుంటాం.రాగులకు ఆయుర్వేదపరంగా చెప్పాలంటే శీతల గుణకర్మలు ఉన్నాయ్ అంటే చలవచేసే లక్షణం ఉంది.వేసవితాపానికి రాగులను అంబలి రూపంలో తాగడం మంచి పరిస్కారం.
రాగులతో ఆరోగ్యం :
ఎముకల పెరుగుదల మరియు దృఢత్వం కొరకు :
క్యాల్షియం(ca )అన్ని ధాన్యాలకన్నా రాగులలో ఎక్కువ ఉంటుంది.100గ్రాముల రాగులలో 340మిల్లీగ్రాముల క్యాల్షియం (ca )ఉంటుంది.క్యాల్షియం తో పాటు విటమిన్ D ఉన్నపుడే మన శరీరానికి క్యాల్షియం యొక్క శోషణ బాగా జరుగుతుంది.అందువలన రాగులను తీసుకొంటూ కొంచెం ఎండ ప్రదేశాలలో నడవడం వల్ల క్యాల్షియం మీకు పూర్తి స్థాయిలో అందుతుంది.పిల్లల దశ లోను వృద్ధాప్య దశ లోను ఈ క్యాల్షియం ఎక్కువ మోతాదులో ఉండాల్సిన అవసరం ఉంది.ఎలా అంటే పెరిగే పిల్లల్లో ఎముకలు పెరుగుదలకు క్యాల్షియం చాలా అవసరం.వృద్దాప్యంలో ఈ ఎముకల నుండి క్యాల్షియం వేగంగా వెళ్ళిపోతూ ఆకస్మికంగా ఎముకలు విరుగుతుంటాయి(spontaneous fractures ) ఉంటుంది, ఈ క్యాల్షియం ను రాగుల రూపం లో తింటూ ఎముకలు విరగకుండా జాగ్రత్తపడాలి.
అధికబరువును తగ్గించుటకొరకు :
అధిక బరువును మరియు స్థూలకాయాన్ని తగ్గించుట లో రాగులు ఎలా తగ్గిస్తాయో తెల్సా ?రాగులలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లము ఉండడం వలన ఆకలిని తగ్గిస్తుంది.ఇతర గింజ ధాన్యాలతో పోలిస్తే రాగులలో పీచుపదార్థం(ఫైబర్) ఎక్కువగా ఉంటుంది.ఫైబర్ ఉండడం వలన తిన్న తర్వాత బాగా నీటిని పీల్చుకొని ముద్దలాగా ఏర్పడి పొట్టలో బాగా నీటిని పీల్చుకొని ముద్దలాగా ఏర్పడి చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది.ఆకలి వేయదు తిన్న తరవాత ఇంకేమన్నా తినాలనే ఫీలింగ్ ఉండదు.ఏ గింజలలో ఐనా కొంతశాతం కొవ్వు ఉంటుంది.ఈ రాగులలో అన్సాచురేట్ కొవ్వులు ఎక్కువగా ఉండడం వలన రక్తనాళాల్లో కొవ్వులను గడ్డకట్టకుండా చేస్తాయి.రాగులలో ఉండే ట్రిప్టోఫాన్ ,ఫైబర్ మరియు unsaturated కొవ్వులు అధికబరువును తగ్గించుటకు సహాయపడుతాయి.
కొలెస్ట్రాల్ నియంత్రణ లో రాగుల పాత్ర :
రాగులలో ఉండే లెసిథిన్(Lecithin),మిథియోనిన్ (Methionine)అనే అమైనో ఆమ్లాలు రక్తం లో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.శరీరంలోని అధిక స్థాయిలో ఉన్న కొవ్వులను లివర్ ద్వారా బయటకు పంపిస్తాయి.రక్తహీనతను నియంత్రణ లో రాగుల పాత్ర:
ఎర్రగా ఉండే ఆహారపదార్దాల్లో ఎక్కువ మోతాదులో ఐరన్ ఉంటుంది. ఐరన్ మన శరీరం లో శోషణం చెందుటకు విటమిన్ సి ఉండాలి కనుక విటమిన్ సి కూడా రాగులలో ఉండడం వలన ఐరన్ ను శరీరం బాగా శోషించుకొనేటట్లు చేస్తుంది.
మధుమేహ నియంత్రణ లో రాగుల పాత్ర :
రాగులు షుగర్ వ్యాధి రానివ్వకుండా అడ్డుకోవడానికి సహాయపడుతాయి.గ్లయిసీమిక్ index తక్కువ ఉండడం వలన షుగర్ రాకుండా నివారిస్తుంది.రాగులతో ఆహరం:
మన ఆహారపద్దతులలో రాగులను ఎలా కలిపి ఆహారం ద్వారా తీసుకోవచ్చు ?
రాగులతో పిండిరూపంలో తీసుకొని రొట్టెలు ,అంబలి,సంగటి తయారుచేసుకొంటాం ఇది మనందరికీ తెలిసిందే ఇవికాక రాగులతో ఉప్మా ,బిస్కెట్లు ,కేకులు,లడ్లు కూడా తయారుచేసుకోవచ్చు.ఇంకా ఇడ్లీలు,దోసెలు కూడా తయారుచేసుకోవచ్చు.👉కేరళ లో "పుట్టు " ను ఎక్కువగా ఉదయం అల్పాహారం గా తీసుకొంటుంటారు.ఈ పుట్టు తయారుచేయుటకు ఒక సిలిండర్ ఆకారం లోని పాత్ర ఉంటుంది దీనిలో బియ్యపు పిండి మరియు కొబ్బరితురుము వేసి తయారుచేస్తారు.దీనిని బియ్యపుపిండికి బదులు రాగిపిండి తో చేసుకోవచ్చు.
👉మల్టీగ్రైన్ గోధుమపిండి తో మనం చపాతీలు కానీ రోటి కానీ చేసుకొంటుంటాం. రాగులతో చపాతీ కానీ రోటి కానీ చేయాలంటే విరిగిపోతాయని మనం చేయటానికి ఎక్కువగా ఇష్టపడము.రోటి కానీ చపాతీ కానీ బాగా రావాలంటే గోధుమలను రంగులను 7:3 కొలతలతో తీసుకోండి.అంటే ఏడుకప్పుల గోధుమలకు మూడు కప్పుల రంగులను తీసుకోండి.(లేదా ఏడు కప్పుల గోధుమపిండి కి మూడు కప్పుల రాగిపిండి )
👉రాగులను మాల్ట్ రూపం లో తీసుకొంటే ఇంకా మంచిది. అంటే రాగులను శుభ్రంగా కడిగి నానపెట్టి కొని రాత్రి పడుకునే ముందు నీళ్లు వంచేసి ఒక టవల్ ల్లో మూట కట్టి క్రింద నీరు అన్ని వడపోయేటట్లు ఒక పాత్ర లో పెట్టండి మరుసటి రోజు ఉదయాన్నే మూట కట్టిన రాగులను విప్పి ఆరబెట్టండి అవి చిన్న చిన్న మొలకలెత్తిన రాగులుగాకనిపిస్తాయి.ఈ మొలకలెత్తిన రాగులను బాగా పొడిగా ఎండేటట్లు ఒకరోజు కానీ రెండు రోజులు కానీ ఆరనివ్వండి.ఈ రంగులను కొంచెం వేగించుకొని మిక్సీ లో వేసి పిండి వేసుకోవాలి ఇదే రాగి మాల్ట్.ఎక్కువ పిండి తయారుచేసుకోవాలనుకుంటే రంగులను వేగించుకొన్న తర్వాత మిషన్ పట్టించుకోవచ్చు.
👉500గ్రాముల రాగులను మరియు 250గ్రాముల బార్లీ ని తీసుకొని పిండి పట్టించుకోని ఒక సీసా లో భద్రపరుచుకోవాలి. ప్రతినిత్యం ఇంట్లోఉన్న వారి సంఖ్యను బట్టి నీటిని మరగకాచి రెండు లేదా మూడు స్పూన్ల రాగిబార్లి పిండి మిశ్రమాన్ని వేసుకొని కలిపి బాగా గంజి లాగా తయారవుతుంది పలుచగా సూప్ లాగా కాచుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి.నిమ్మరసం పిండుకొని గోరువెచ్చగా తాగవచ్చు.ఉప్పు నిమ్మరసం ఎవరి అభిరుచులను బట్టి వారు వేసుకోవచ్చు.మూత్రసంబంధ వ్యాధుల నియంత్రణ లో బార్లీ బాగా సహాయపడుతుంది.టీ కాఫీ మానాలనుకొనే వారు కూడా ఈ సూప్ తాగడం అలవాటుచేసుకోవచ్చు.
2 Comments
Great post, very useful us.
ReplyDelete😊
ReplyDeleteమీరిచ్చే ప్రతి కమెంట్ ప్రోత్సాహమే మన సే లౌడ్ తెలుగు కు ఉత్సాహం ......అందుకే కమెంట్ చేయండి మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.