Ticker

7/recent/ticker-posts

మంచి మాటలతో మన మనసు మారునా ?ఈ ఆణిముత్యాలు మీ మనసు చేరునా? Life Change Quotes In Telugu | Sayloudtelugu

మంచి మాటలతో మన మనసు మారునా ?ఈ ఆణిముత్యాలు మీ మనసు చేరునా?

motivational_quotes_Telugu_sayloudtelugu

👉నిజాయతీయే నిజమైన సంపద.
👉సమస్యను పెంచకు - ఆదిలోనే తుంచు.
👉సారము వెదుకు వారు భారమును చూడరు.
👉మనసు అలసిపోయే చిన్నపని కూడా ఎంతో శ్రమ అనిపిస్తుంది 
👉నీటి మీద రాతలు నిజమే అయినా నిలువవు.
👉మన ఖార్చులో ఖరీదైన ఖర్చు "కాలం".
👀మాటలు ఖర్చు లేనివి, కాని విలువైనవి.
👉ఆత్మానందం పొందాలంటే - ఆచారంతో పాటు ఆచరణ కూడా చేయాలి.
👉కసురుతూ మాట్లాడకు - విసుగుతో పనిచేయకు.
👀జీవన మాధుర్యం అనుభూతి కావాలంటే గతాన్ని మరవాలి.
👉బుర్రలో ఎన్ని కోరికలు ఉంటే అంత అశాంతి.
👉క్రమశిక్షణ గల వారిని విజయం తప్పకుండా వరిస్తుంది.
👉మంచి స్వభావమే మనిషికి అలంకారం.
👉మూర్ఖుని ప్రశంస కన్నా -బుద్ధిమంతుని మందలింపు మిన్న . 
👉కాలము,కెరటం ఎవరికోసము ఆగవు.
 👉గొప్పవారు కావాలి, అయితే మంచివారుగా ఉండాలి. 
👉శాంతి లేకుంటే మనసుకు విశ్రాంతి లేదు. 
👀కోరికలు పెరిగే కొలది ఆనందం తగ్గుతుంది.
👉ముఖానికి చిరునవ్వే అందం. 
👉స్నేహం చేయడం సులభమే కానీ నిలుపుకోవటమే కష్టము. 
👉సంకల్ప బలం ఉన్న వారికి సాధ్యం కానిది లేదు.
👉అంతరంగం అందంగా ఉంటే ఆచరణ అర్ధవంతంగా ఉంటుంది. 
👉వెలుగును చూసి చీకటి పారిపోతుంది,నిర్విరామంగా శ్రమించే వ్యక్తిని చూసి ఓటమి భయపడుతుంది.
👉సమయాన్ని సఫలం చేసుకొనే వారు వివేకవంతులు.
👉ఎక్కువ కోరికలే సమస్యలకు మూలం.
👉మన మనసులో లక్ష్యం లేనపుడు పనికిమాలిన పనులకు తీరిక దొరుకుతుంది. 
👉అవకాశాలు ఒకరిచ్చేవికాదు కావు, మనమే వాటికై కృషిచేయాలి.

Telugu_sooktulu_sayloudtelugu

👉మమకారం మల్లెపందిరి - అహంకారం ముళ్లపొద.
👉మంచిని వినండి, అనండి,కనండి,తలవండి,చేయండి,చేయించండి.
👉పొదుపు చేయాలనే చోట ఖర్చు చేయకు,ఖర్చు చేయవలసిన చోట పొదుపు చేయకు.
👉మనిషి మనస్సు  నుండే యుద్ధాలు పుడతాయి.
👉తెలియని దానిని తెలిసినట్లు నటించటం వలన నష్టమెక్కువ.
👉నీకు  తెలియని విషయాలు ఎవ్వరికీ తెలియవు అనుకోవద్దు,నీకు తెలుసు  కనుక అందరికీ తెలుసు అనుకోవద్దు. 
👉చిన్న ఖర్చులే అని దుబారా చేయకండి, చిల్లి చిన్నదే అయినా పెద్ద ఓడ కూడా మునిగిపోతుంది.
👉చల్లని పలుకులు కోపాన్ని దూరం చేస్తాయి, కరుకు మాటలు కోపానికి ఆజ్యం పోస్తాయి.
👉ఆశావాది గులాబిని చూస్తే,నిరాశావాది దాని క్రింది ముల్లును చూస్తాడు.
👉ప్రపంచంలోని సమస్యలు పెరుగుతూనే ఉంటాయి,వాటిని ఎదుర్కొనే శక్తి, సామర్ధ్యాలను  పెంచుకోవటమే మనం చేయవలసిన పని. 
👉మాటల వలనే స్నేహం, విరోధం,మనస్థాపం కలుగుతాయి కనుక నేర్పుగా మాట్లాడాలి. 
👉మంచి విషయాలు విని ప్రయోజనం లేదు వాటిని ఆచరణలోకి  తెస్తేనే ఉపయోగం.
👉సమస్య ఎక్కడ మొదలవుతుందో పరిష్కారం కూడా అక్కడి నుండే మొదలవుతుంది. 
👉విజయం అనేది గమ్యం కాదు, అదొక నిరంతర ప్రయాణం, విజయసాధనకి ఎందరో వేదాంతులు,సైకాలజిస్టులు, విజయం సాధించినవారు ఎన్నో మార్గాలు తెలిపారు. ఒక్కో మార్గం ఒక్కొక్కరికి సరిపడవచ్చు. 
👉పుట్టుకతోనే ఏ మనిషీ చెడ్డవాడు కాదు అన్నట్లుగా ప్రతి మనిషి యొక్క మనసు కూడా నెగెటివ్ గా ఉండదు. దానికి మనం ఇచ్చే శిక్షణను బట్టే ఉంటుంది. 
👉పరిస్థితులు మన చేతిలో ఉండవు కానీ మన ప్రవర్తన మన చేతులోనే ఉంటుంది. 
👉దేహానికి మంచి దుస్తులు అందం,మనసుకు మంచి ఆలోచనలు ఆనందం. 
👉రత్నం తనను ధరించే వాడి కోసం వెతకదు, వాడే దానికోసం వెతుక్కుంటూ వస్తాడు. 
👉ప్రతి రాయిలో ఒక శిల్పం దాగి ఉంటుంది,ఉలితో చెక్కినపుడు మాత్రమే అది బహిర్గతమవుతుంది,సుత్తి దెబ్బలతో కాదు. 


Post a Comment

0 Comments