తన అనుభవాలనుండి మన మెదడుకు ప్రేరణ కల్పించే ఆల్బర్ట్ ఐన్ స్టెయిన్ చెప్పిన మంచి మాటలు
👉మీరు చేసేపని అద్భుతంగా ఉండాలంటే దానిని ప్రేమించడం నేర్చుకోండి.
👉ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువులు కూడా నిన్ను చూసి తలదించు కొంటారు.
👉జ్ఞానం కన్నా ఊహా శక్తి గొప్పది.
👉విజయం సాధించిన వ్యక్తి గా కాదు,విలువలు కలిగిన వ్యక్తిగా ఎదగడానికి ప్రయత్నించు..
👉నాకు సహాయం చేయటానికి రానివారందరికి నా కృతజ్ఞతలు ఎందుకంటే వారి వల్లనే నేను స్వంతంగా పని చేయడం నేర్చుకోగలిగాను.
👉మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం దాగి ఉంటుంది.
👉మన ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం,ఇతరుల మాటకు కూడా విలువ ఇవ్వడం అలవరుచుకొంటే జీవితం లో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు.
👉రెండు విషయాలు అనంతమైనవి ఒకటి విశ్వం..రెండోవది మానవుడి మూర్ఖత్వం .. ఐతే ఈ విశ్వం అనంతమో కాదో అన్న విషయంలో నాకు సందేహముంది. కానీ మానవ మూర్ఖత్వ విషయంలో లేదు.
👉సంతోషంగా జీవించాలంటే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి కానీ మనుషులను,వస్తువులను లక్ష్యం చేసుకోకూడదు.
👉ప్రకృతికి దగ్గరగా ఉంటే జీవిత సత్యాలు తెలుస్తాయి.
👉జీవితంలో మనం నేర్చుకున్న ప్రతిదీ ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది.
👉చూడటం మరియు గ్రహించడంలో ఉండే ఆనందం ప్రకృతి యొక్క అత్యంత అందమైన బహుమతి..
👉జీవితం అనేది ఒక సైకిల్ మీద ప్రయాణం లాంటిది మీ బాలన్స్ తప్పకుండా ఉండటానికి మీరు దానిని నడుపుతూ ఉండాలి.
👉నిన్న నుండి నేర్చుకో,నేటి కోసం జీవించు,రేపటి గురించి ఆశించు,ముఖ్యమైన విషయం ప్రశ్నించకుండా ఉండవద్దు.
👉పొరపాటు చేయకుండా ఒక వ్యక్తి ఎప్పుడూ కొత్తగా ప్రయత్నించలేడు..
👉పాఠశాలలో మనం నేర్చుకొన్నది మరచిపోయిన తర్వాతే అసలు విద్యాభ్యాసం మొదలవుతుంది. ..
👉జ్ఞానం యొక్క ఏకైక మూలం అనుభవం..
👉ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా మేధావే .. కానీ మీరు ఒక చేపను అది చెట్టు ఎక్కే సామర్ధ్యాన్ని బట్టి దాని తెలివితేటలు నిర్ణయిస్తే అది తన జీవితాంతం మూర్ఖుడిగానే ఉండిపోతుంది..
👉మూర్ఖుడు మరియు మేధావికి మధ్య వ్యత్యాసం ఏమిటంటే మేధావి వాని పరిమితులను కలిగి ఉంటాడు..
👉మతం లేకుండా సైన్స్ కుంటిది ,సైన్స్ లేకుండా మతం గుడ్డిది ..
👉చిన్న చిన్న విషయాలలో సత్యంగా ఉండని వారు ప్రముఖమైన విషయాలలో నమ్మకంగా ఉండరు..
👉ఒక మనిషి విలువ అతను ఇచ్చే దానిలో చూడాలి పొందే దానిలో కాదు.
👉వివేకం పెరుగుదల పుట్టుకతో మొదలవుతుంది.. మరియు మరణంతో ఆగిపోతుంది.
👉అమలుచేయని శాసనాలు ప్రభుత్వానికి ప్రమాదకరం.!హానికరం..!!
👉స్వార్థం నుండి విముక్తి పొందినప్పుడే మనం వెలుగులోకి వస్తాం.
👉మేధావులు సమస్యల్ని పరిష్కరిస్తారు,జ్ఞానులు అసలు సమస్యే రాకుండా నిరోధిస్తారు.
👉అందమైన అమ్మాయితో ఆనందంగా,ప్రేమగా మాట్లాడుతూ గడిపిన గంటకాలం ఒక్క సెకన్ లాగానే తోస్తుంది.మండుతున్న పెనం మీద క్షణం సేపు కూచున్నా గంటలాగా తోస్తుంది. అదే సాపేక్షత అంటే .
👉మీరు ఒక విషయాన్ని వివరించలేకపోతే,మీరు దాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేదని అర్ధం.
👉మన సాంకేతిక పరిజ్ఞానం మన మానవత్వాన్ని మించిపోయింది.
👉నాకు ప్రత్యేక ప్రతిభ లేదు. నేను కేవలం ఉద్రేకంతో ఆసక్తిగా ఉన్నాను.
👉నిన్నటి నుంచి నేర్చుకో,ఈరోజు జీవించు,రేపటిని ఆశించు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రశ్నించడం మానొద్దు.
👉 సృజనాత్మక వ్యక్తీకరణ మరియు జ్ఞానంతో సంతోషం కలిగించడం ఉపాధ్యయుడి యొక్క గొప్ప కళ .
👉జ్ఞానం యొక్క ఏకైక మూలం అనుభవం.
👉నా విజ్ఞానశాస్త్ర పరిశోధనలకు,నూతన సిద్ధాంతాలను రూపొందించడానికి భగవద్గీతను మార్గదర్శకంగా తీసుకున్నాను.
👉మేధస్సు యొక్క నిజమైన సంకేతం జ్ఞానం. కల్పన కాదు.
👉మీ వైఖరి బలహీనంగా ఉంటే మీ పాత్ర కూడా అంతే బలహీనంగా ఉంటుంది.
👉ప్రతి వ్యక్తికి తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తపరచాలి అంటే ప్రజల అందరిలో విమర్శలను భరించే సహనం ఉండాలి.
👉నేను భవిషత్తు గురించి ఆలోచించను ఎందుకంటే అది త్వరలోనే వస్తుంది కాబట్టి.
2 Comments
Nice post presentation
ReplyDeleteKeep it up Go ahead
Thank you
ReplyDeleteమీరిచ్చే ప్రతి కమెంట్ ప్రోత్సాహమే మన సే లౌడ్ తెలుగు కు ఉత్సాహం ......అందుకే కమెంట్ చేయండి మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.