Ticker

7/recent/ticker-posts

Motivational Quotes Of Famous poets and Authors In Telugu part 2 | Sayloudtelugu

motivatioanl_quotes_sayloudtelugu_great quotes
Sayloudtelugu Motivational Quotes Part-2


జీవితం నేర్పే అనుభవాల పాఠాలని ప్రపంచ పాఠశాలలో సక్రమంగా నేర్చుకోగలిగే మనిషి,తన చక్కటి జ్ఞానసముపార్జన సాయంతో ముందడుగులు వేయగల్గుతాడు. - మహాత్మాగాంధీ 

మనిషికి కావలసిందల్లా - తనకందుబాటులోనికి వచ్చిన వాటినల్లా చక్కగా చదువుకుంటూ పోవడమే,అలా అనుకునే మనిషిని కొంతకాలానికే,ఎన్నో విషయాలని నిర్ణయించే నిశ్చల జ్ఞానమూ,తాను అనుకొన్న వాటిని చేసి చూపించే అద్భుత శక్తీ ... వరిస్తాయి - విలియం గోడ్విన్ 

మనిషి ఏవేవో చేయాలని వున్నా,అందుకు తనవద్ద తగినంత సమయం లేదని ఎన్నోసార్లు దాటవేస్తుంటాడు. అది సరైన నిజం కానే కాదు. నిజంగా మనిషి తలచుకుని,నిండు మనసుతో అందుకోసం ప్రయత్నాలు చేయాలేగాని,ఎక్కడలేని సమయం తప్పకుండా లభిస్తుంది. -చార్లెస్ బక్ట్సన్ 

ప్రపంచంలో అందమైన అబద్ధాలు చెప్పే మనుషులని చూసి,మనం పాములను చూసినట్లుగా భయపడాలి. ఎందుకంటే ప్రపంచంలో సత్యాన్ని మించిన నిజమైన ధర్మం లేనేలేదు. సత్యధర్మం తో మనిషి సాధించలేనిది లేదు - వాల్మీకి.  

మనిషి జీవితంలో క్షణ క్షణం భయపడుతూ సాధించేది ఏమీ ఉండదు. పైగా అలా భయపడుతూ అడుగడుగునా వెనుకంజ వేస్తూ ఉండే మనిషి మానవత్వాన్నే కాదు,భగవంతుణ్ణి సైతం మరచిపోయే బలహీనస్థితికి దిగజారిపోతుంటాడు. - వినోబా భావే. 

ప్రపంచం అందించే పురస్కారాలకి మనిషి అద్భుతాలని సాధించే మహా మనిషి కానక్కర్లేదు. నిజానికి మనిషి తనకున్న తెలివితేటల్ని చక్కగా వాడుకుంటే చాలు, సగటు మానవులకన్నా కాస్తంత ఎక్కువగా కష్టపడగలిగితే,చేసే కృషిని ఆపకుండా చేసుకొంటూ పొతే చాలు. - డాగ్లుస్ లర్టన్. 

అనేకమంది మేధావులు అందించిన గొప్ప గొప్ప విషయాలని క్రోడీకరించి అందించేవాడు,ఎవరికీ అంతగా పనికిరాని మహాకావ్యం రచించే వాడికన్నా మిన్నైన సాహిత్యసేవలు అందించిన వాడవుతాడు. - ఎల్లా వీలర్  విల్కాక్స్.  

ఓ పనిని సాధించాలనే పట్టుదల కలిగించే ప్రేరణ,మనిషి జీవితంలోని ఎన్నో కార్యకలాపాల తాలూకు విజయ పరంపర వెనుక వుండే పరమ రహస్యం. మరి ఆ ప్రేరణని పటిష్టం చేసుకోవాలంటే మనిషికి కావలసింది దృఢమైన దీక్ష. - డబ్ల్యూ . సి . స్టోన్. 

అదృష్టం వస్తుందనీ,అది ఏదేదో చేస్తుందనీ ఎదురుచూపులతో జీవితాన్ని వ్యర్థం చేసే మనిషి,తనని ఎంతో ఎత్తుకి తీసుకు వెళ్ళడానికి తనకు తానుగా వచ్చిన అమూల్యమైన అవకాశాన్ని గుర్తించలేక పోతుంటాడు. - మోంటాక్రేన్. 

ప్రపంచంలో నూటికి తొంబై తొమ్మిది మంది చేసే పనులు విఫలమవడానికి కారణం - వారు తాము చేయవలసిన పనులు చేయకుండా, అందుకు రకరకాల నెపాలు వెతుక్కోవడం అనే అలవాటు కలిగి ఉండటమే. జి. డబ్ల్యూ . కార్వార్. 

గొప్పతనం చెప్పుకొనేదీ, చాటుకొనేదీ కాదు, మనగురించి మనమో,ఇతరులో చెప్పుకొనే దాన్ని మించిన గొప్పతనం ఒకటుంది. మన పనుల ద్వారా ఎంతో మందికి చక్కటి ప్రేరణ కలిగించడమే ఆ గొప్పతనం. అదే అసలైన గొప్పతనం. - లూయిస్ పాశ్చర్. 

మనిషికి అన్నింటికన్నా అవసరమైనదీ,అన్ని వేళలా అతడిని రక్షిస్తూ వుండేది అతను చదివిన పెద్ద పెద్ద చదువులు కాదు,అతను పెంపొందింపచేసుకొన్న అంగీకరించిన మార్పు. - హెచ్. స్పెన్సర్ 

మంచి ఆలోచనలపైన మనసుకి మనసు నిలపడమే శ్రద్ద అంటే, ఆ శ్రద్దే మనిషికి కొండంత బలాన్ని ఇస్తుంది. రకరకాల ప్రేరణలని అందిస్తుంది. జీవితాన్ని సార్ధకం చేస్తుంది. - వినోబా భావే. 

మనిషి జీవితంలో ఏనాడైతే నేర్చుకోవడం ఆపేస్తాడో, ఆనాటినుంచే  ఆ మనిషికి ముసలితనం వచ్చినట్లే లెక్క - అటువంటి,మనిషి వయసు ఇరవై అయినా అరవై అయినా, అందుకు భిన్నంగా నిరంతరం నేర్చుకోవాలనే తపన గల మనిషికి ఎంత వయస్సు వచ్చినా,ముసలితనం రానేరాదు. -హార్వే ఉల్మన్. 

ఆశావాదులు తమకు ఎదురయ్యే ప్రతి అవరోధంలోనూ అద్భుతమైన అవకాశాన్ని సృష్టించుకొని ముందుకు సాగిపోతుంటారు.కానీ, నిరాశావాదులు తమని కరుణించే ప్రతి సువర్ణావకాశంలోనూ,అడ్డుతగిలే అవరోధాన్ని ఊహించుకుని వెనుకంజవేస్తుంటారు. - ఎల్ .పి . జాక్స్ 

నాణ్యత అనేది అమాంతం వచ్చి పడేది కాదు. ఓ ఉన్నతమైన ఆదర్శం,నిజాయితీతో చేసే కృషి,ప్రతిభావంతమైన నాయకత్వం,నేర్పరితనం గల యాజమాన్యం-అన్నీ కలిస్తే వస్తుంది నాణ్యత - డబ్ల్యూ. ఏ. ఫాస్టర్. 

మనిషి జీవితంలో నడవడిక ఎంతో విలువైన ఆభరణం. అది వెలలేని  రత్నంతో సమానమైనది. దానిని పోగొట్టుకున్న మనిషికి ఎన్ని వున్నా ఏమీ లేనట్లే. అటువంటి మనిషి జీవితమే వ్యర్థమైపోతుంది.అతని వద్ద బోలెడంత బలగమున్నా,తరగని సిరులున్నా,అతనికి విలువే వుండదు. - వేదవ్యాసుడు. 

వ్యసనాలు అంటే మనిషి విడనాడలేని అలవాట్లు. సాధారణంగా వ్యసనాలు అనగానే మనకి గుర్తుకువచ్చేది - చెడ్డ అలవాట్లు. నిజానికి అలవాట్లు ఎన్నో రకాలుంటాయి. వాటిలో మంచి వ్యసనాలూ వున్నాయి. అవి - నిరంతరం మంచి విషయాలని నేర్చుకోవడమూ,నిండు మనసుతో ప్రజలకి సేవలు అందించడం. - రామకృష్ణ పరమహంస. 

పాత కొత్తల మధ్య అర్ధవంతమైన వారధి ఎలా నిర్మించాలన్నదే మనిషికి ముఖ్యమైన ఆవేదన కావాలి ఎందుకంటే అటు పాతవి ఇటు కొత్తవి గానీ పూర్తిగా వదిలివేయడం అంత సమంజసంకాదు. - జవహర్  లాల్ నెహ్రూ 

ఆత్మవిశ్వాసం,ఆత్మజ్ఞానం,ఆత్మనిగ్రహం ఈ మూడు లక్షణాలు మనిషి జీవితాన్నిఎంతో శక్తివంతంగా తయారుచేస్తాయి. - టెనీసన్ 

మనిషి మరణించాకా, ప్రతి విషయాన్నీ ఎన్నో రెట్లు పెంచుతుంది కాలం.  మనుషుల నోళ్ళు మారే కొద్దీ,ఆ మరణించిన మనిషి తాలూకూ పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తుంటాయి. -ప్రోవర్టీయస్

Post a Comment

2 Comments

మీరిచ్చే ప్రతి కమెంట్ ప్రోత్సాహమే మన సే లౌడ్ తెలుగు కు ఉత్సాహం ......అందుకే కమెంట్ చేయండి మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.