- తీట గలవానికి,తోట గలవానికి తీరిక ఉండదు.
- అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని !
- ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి!
- చెరువులు తెంచి చేపలు పంచినట్లు.
- జుట్టుకలి ఏడుస్తుంటే చుట్టకు నిప్పడిగినట్లు.
- కంట్లో కారం గొట్టి,నోట్లో బెల్లం పెట్టినట్లు.
- తిండికి ముందు,దండుకు వెనక.
- తినకుండా రుచులు,దిగకుండా లోతులు తెలియవు.
- చెట్టులేని లేని చేను,చుట్టము లేని ఊరు.
- ఆత్రపు పెళ్ళికొడుకు అత్తమెడలో తాళికట్టినట్లు.
- పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం.
- అప్పు చేసి పప్పు కూడు తిన్నట్లు
- కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు!
- అప్పు చేసి పప్పు కూడు తిన్నట్లు
- దమ్ము లేనోడు దుమ్ముల చేయి వెట్టిండు.
- ఉన్నదున్నట్లు అనరాదు,ఊళ్ళో ఉండరాదు
- అరచేయంత బీరకాయకు అద్దసేరు మసాలా!
- పొట్టోనికి పుట్టెడు బుద్ధులు
- తొలిచూలు పిల్లకు తొంభై అంగీలు,మరుచూలు పిల్లకు మారు అంగీ లేదు.
- వియ్యపొళ్ళూ వియ్యపోళ్ళు ఒకటుంటే దయ్యం వచ్చి కయ్యం పెట్టింది.
- అంగిట బెల్లం ఆత్మలో విషం
- శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు.
- విత్తుఒకటేస్తే చెట్టు ఒకటి మొలుస్తుందా!
- మొహమాటానికి పోయి ముండ కడుపొచ్చిందట!
- తంతే గారెల బుట్టలో పడ్డాడట ?
- పొరుగింటి పుల్లకూర రుచి.
- పిచ్చుకమీద బ్రహ్మహాస్త్రం
- పిట్ట కొంచెం కూత ఘనం
- ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ
- సంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు
- నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది.
- మెరిసేదంతా బంగారం కాదు
- కలలోని కౌగిలికి కడుపు లొస్తాయా?
- కాలితో నడిస్తే కాశీకి పోవచ్చునుగాని,తలతో నడిస్తే తన వాకిలి దాటవచ్చునా ?
- కుట్టే వాడికి కుడివైపు,చీదే వాడికి ఎడమవైపు ఉండకూడదు.
- కూతురు కనలేకపోతే ,అల్లుడి మీద పడి ఏడ్చినట్లు.
- కొండనాలికకు మందు వేస్తే ఉన్న నాలిక ఊడిపోయినట్టు
- కోళ్లను తింటారా అంటే బొచ్చు పారేస్తాము అన్నట్లు
- గంధం సమర్పయామి అంటే గొడ్డలి నూరరా అన్నాడట
- చాదస్తపు మొగుడు చెపితే వినడు,చెప్పకుంటే కరుస్తాడు
- గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే,ఒంటె ఆనందానికి గాడిద మూర్ఛపోయిందట
- తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టావే బొచ్చుముండ అన్నాడట!
- అయ్యకు కోపం సంవత్సరానికి రెండు సార్లే వస్తుంది,వచ్చింది ఆరేసి నెలలు ఉంటుంది.
- నిద్ర పోయేవాడిని నిద్ర లేపొచ్చు కానీ:నిద్ర పోయినట్లు నటించే వాడిని నిద్ర లేపలేం
- పోన్లే పాపమని పాత బట్టలిస్తే:గుడి వెనక పోయి ఉరి వేసుకొందట !
- సొమ్మొకడిది సోకు ఒకడిది
- హనుమంతుడి ముందా కుప్పి గంతులు !
- తోక తెగిన కోతిలా!
- పిచ్చెమ్మ తెలివి వెర్రెమ్మ మెచ్చుకోవాలి
- రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్లు
- నిత్య కళ్యాణం పచ్చ తోరణం
- అరటిపండు వలిచి చేతిలోపెట్టినట్లు
- పాడిందే పాడరా పాచిపళ్ళదాసరా
- పాలు నీళ్లలా కలిసిపోయారు.
- పిచ్చి పలురకాలు వెర్రి వేయి రకాలు
- సింగినాదం జీలకర్ర
- డబ్బు కోసం గడ్డి తినే రకం
- ఆకాశానికి నిచ్చెన వేయడం
- కలసి ఉంటే కలదు సుఖం
- కాలు కాలిన పిల్లిలా
- అదిగో తెల్లకాకి అంటే..... ఇదిగో పిల్లకాకి అన్నట్లు !
- కుక్కకు పెత్తనం ఇస్తే..... ఇంట్లో చెప్పులన్నీ కొరికిందట !
- చదవక ముందు కాకరకాయ,చదివిన తరువాత కీకర కాయ.
- పట్టుకోక ఇచ్చినమ్మ పీట కోడు పట్టుకు తిరిగినట్టు .....
- ఆడే కాలూ,పాడే నోరూ ఊరికే ఉండదు.
- అయిపోయిన పెళ్లికి మేళాలెందుకు?
- తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు .
- చెప్పులో రాయి చెవిలో జోరీగ
- అన్నీ ఉన్న విస్తరి అణిగి యుండును
- ఉలి దెబ్బ తిన్న శిలే శిల్పం అవుతుంది.
- అప్పులేని వాడే అధిక సంపన్నుడు.
- అదిగో తోక అంటే ... ఇదిగో పులి
- అగ్నిహోత్రంలో ఆద్యం పోసినట్లు
- ఇసుక తక్కెడ పేడ తక్కెడ
- ఇంట్లో పులి వీధిలో పిల్లి.
- అంధునకు (గుడ్డివానికి)అద్దం చూపినట్లు
- ముక్కు పిండి వసూలు చేయడం.
- ముంజేతి కంకణానికి అద్దం దేనికి?
- జిల్లెడి చెట్లకు పారిజాతాలు పూయునా ?
- చిలుక ముక్కుకు దొండపండు ఉన్నట్లు.
- ఎంతవారలైనా కాంతదాసులే !
- నవ్విన నాపచేనే పండుతుంది.
- నిప్పు ముట్టనిదే చేయి కాలదు.
- ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుకం లేదు.
- ఎగిరెగిరి దంచినా అదే కూలి ఎగరకుండా దంచినా అదే కూలి!
- కర్ర విరక్కొడుదు పాము సావకూడదు.
- తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు
- ఎడ్డెమంటే తెడ్డెం అన్నట్లు
- నీటిలో రాతలు రాసినట్టు
- గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసన
- లేడికి లేచిందే పరుగు
- అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?
- అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం
- కరవమంటే కప్పకి కోపం,విడవమంటే పాముకి కోపం
- అడుక్కుతినే వాడికి అరవైఆరు కూరలు
- ఉన్నమాటంటే ఉలుకెక్కువ
- రెక్కాడితే గాని డొక్కాడదు
- నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు ఇంత పెద్ద గాలివాన తన జీవితంలో చూడలేదన్నదట !
- అనగా అనగా రాగం తినగా తినగా రోగం ...
- గుడ్డెద్దు చేలో పడినట్లు !!
- మందెక్కువైతే,మజ్జిగ పల్చనవుతుంది
0 Comments
మీరిచ్చే ప్రతి కమెంట్ ప్రోత్సాహమే మన సే లౌడ్ తెలుగు కు ఉత్సాహం ......అందుకే కమెంట్ చేయండి మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.