Ticker

7/recent/ticker-posts

Motivational Quotes In Telugu|మంచి మాటలు తెలుగులో|sayloudtelugu

మంచి మాటలతో మీ మనసు మరునా?

మంచి చెప్పి మందలించు తప్పు లేదు కానీ... మంచి మాటల మాటన ఇతరులను హేళన చెయ్యకు అది నీలో నిండిన అసూయకు నీ మనసుకు పట్టిన మురికి అద్దం పడుతుందని మరవకు. 

రూపమైన  రూపాయి అయినా శాశ్వతం కాదు. మనసులో ఉండే ప్రేమాభిమానాలే శాశ్వతం. 

జింక గంటకు తొంబ్బై కిలోమీటర్ల వేగం తో, పులి గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో పరుగెత్తుతాయి,అయినా పులి జింకను పట్టుకొని చంపి తినేస్తుంది.ఎందుకంటే జింకకు పులి కంటే తాను బలహీనమని  జింక కు ఖర్చితంగా తెలుసు. ఈ భయం కారణంగా జింక మళ్ళి మళ్ళి వెనక్కి చూస్తుంది. ఈ సమయం లో జింక తన వేగాన్ని మరియు ధైర్యాన్ని  కూడా కోల్పోతుంది. ఈ కారణం వలన జింక పులి చేతులో ఓడిపోయి చంపబడుతుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి ధైర్యాన్ని వదులుకోకండి.

నీ తప్పులను పొరపాట్లను నీ ముందే చెప్పి, నీ గొప్పతనాన్ని ఇతరుల ముందు చెప్పేవాడే అసలైన మిత్రుడు.

ఆకలితో ఉన్న కడుపు,ఖాలీగా ఉన్న జేబు,ముక్కలైన మనసు ఈ మూడూ జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి. 

అందమైనది ఎప్పుడూ ఆశ పెడుతుంది. ఇష్టమైనది ఎప్పుడు కష్ట  పెడుతుంది. 

పొదుపును ప్రోత్చహించనిదే ఐశ్వర్యం రాదు. 

ఒక నిమిషం నిర్లక్ష్యం చేయడం వల్ల కోల్పోయిన అవకాశం జీవితాంతం ఎదురుచూసిన రాకపోవచ్చు.

వివేకులు మాట్లాడుతారు, మూర్ఖులు వాదిస్తారు.

ప్రతి సామాన్యుడికి ఒక రోజు వస్తుంది. ఐతే ఆ సమయం వచ్చే వరకు మౌనంగా ఎదురుచూడాలి.

నువ్వు పడుకొనే పరుపు నిన్ను చీదరించుకోక ముందే బద్దకాన్ని వదిలేయ్.--శ్రీ శ్రీ 

శత్రువులో నైనా మంచి గుణాలు ఉంటే ప్రశంసించాలి.---చాణుక్యుడు

మన జీవితంలో ఎదురయ్యే వారంతా మన గురువులే. మంచివాళ్ళు పాఠం నేర్పుతారు. చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు.

మన మాటల్లో ఇష్టాన్ని మన కళ్ళలో కష్టాన్ని తెలుసుకొన్న వారే నిజమైన ఆత్మీయులు.

ప్రేమలో స్నేహం ఉండకపోవచ్చు,కానీ నిజమైన స్నేహంలో ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది.

నీవు నిరుపేదవని అనుకోవద్దు. శక్తినిచ్చేది ధనం కాదు. శక్తినిచ్చేది మీ పవిత్రత,మీ మంచితనం,మీ దృఢచిత్తం.

సముద్రం ఎదురుగా నిలబడి చూస్తే ఎటు చూసినా నీరే కనిపిస్తుంది. కానీ గుక్కెడు నీళ్ళు కూడా త్రాగడానికి పనికిరావు.అలాగే చుట్టూతా ఎన్ని బంధాలు ఉన్నా మన అనుకున్న భావం ఎదుటివారిలో లేకుంటే నువ్వు ఎంత తాపత్రయపడినా అది వృధా ప్రయాసమాత్రమే అవుతుంది.

నిన్ను విమర్శించేవారు విమర్శిస్తూనే ఉంటారు తప్ప నీకు విస్తరేసి వడ్డించారు. 

ఈ సమాజంలో బతకాలంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి లేదా  పరిగెత్తే గుర్రం లా అయినా ఉండాలి. 

గాలివానకు గొడుగు వాడినా ఫలితం ఉండదు.ముళ్లకంపను మంచినీళ్ళతో పెంచినా ప్రయోజనం ఉండదు.

తమకేం కావాలో అది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వారు జీవితంలో పైకి వస్తారు.

మనుషులలో మార్పు అనేది చాలా సహజమైనది.ఎలా మారాలి అనేది వివేకం చెబుతుంది. ఎప్పుడు మారాలి అనేది అనుభవం చెబుతుంది. అసలు ఎందుకు మారాలి అనేది అవసరం చెబుతుంది. 

బంధం కంటే భాద్యతే గొప్పది. ఎందుకంటే బంధం మనకు మాత్రమే సంబంధించినది.కానీ బాధ్యత కొన్ని జీవితాలకు సంబంధించినది. మన సంతోషం కంటే మన వాళ్ళ సంతోషమే మన బాధ్యత కదా...!!!

మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్నే,మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచిగుణాన్నే,మనమెంత మంచి కులం లో పుట్టినా అందరూ చూసేది మంచితనాన్నే,మనదెంత మంచి మతమైనా అందరూ చూసేది మనవత్వాన్నే. 

మనిషిది చాలా విచిత్రమైన స్వభావం ఇసుకలో సౌధం చూస్తాడు.రాయి లో శిల్పం చూస్తాడు,లోహం లో ఆభరణం చూస్తాడు,ఆకులో ఔషధం చూస్తాడు,అద్దంలో అందం చూస్తాడు,వ్యసనంలో ఆనందం చూస్తాడు,కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడలేకపోయాడు ఎందుకో ... !!!!!????

ప్రపంచములో బలమైనది ఇనుము ఇది అన్నింటిని కట్ చేస్తుంది,ఇనుము కంటే బలమైనది అగ్గి ఇది ఇనుమును కరిగింప చేస్తుంది,అగ్గికంటే బలమైనది నీరు ఇది అగ్గిని ఆర్పివేస్తుంది,నీరుకంటే బలమైన వాడు మనిషి - నీటినే తాగేస్తాడు,మనిషి కంటే బలమైనది మరణం-ఇది మనిషి ప్రాణాన్నే తీసేస్తుంది. 

దెబ్బలు తిన్న రాయే  విగ్రహంగా మారుతుంది,కానీ దెబ్బలు కొట్టిన సుత్తే ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది. ఎదురుదెబ్బలు తిన్నవాడు,నొప్పివిలువ తెలుసుకున్నవాడు మహనీయుడు అవుతాడు.ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్నదగ్గరే ఉంటాడు. 

అదృష్టం అంటే ధనం వస్తువులు ఉండడం మాత్రమే కాదు-చేతినిండా పని,కడుపునిండా తిండి,కంటినిండా  నిద్ర,అవసరానికి ఆదుకొనే ఆప్తులను కలిగి ఉండడం అసలైన అదృష్టం.

ఒకరి సంస్కారం తెలియాలంటే వారి మాట వినాలి, ఒకరి ఆప్యాయత తెలియాలంటే వారు వడ్డిస్తే తినాలి, ఒకరి మనసులో మన స్థానం తెలియాలంటే వారికి కోపం తెప్పించాలి,ఒకరి స్నేహం తెలియాలంటే వారికి మన కష్టం ఇచ్చేయాలి,ఒకరి దేశభక్తి తెలియాలంటే జాతీయగీతం వినిపించాలి,ఒకరు మనిషో కాదో తెలియాలంటే ఎవరికైనా సాయం చేశారో లేదో తెలుసుకోవాలి.

అడిగి అడిగి అలిసిపోవడం కన్నా అర్ధం చేసుకొని ఆగిపోవడమే మంచిది.

జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు ఒకటి మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు,రెండవది ఇతరుల సమస్యల్లో మనం తల దూర్చకూడదు.

ఎదుటివారిలో నీకునచ్చని గుణాలున్నాయని ద్వేషించే ముందు నీలో అలంటి గుణాలు ఉన్నాయో లేవో చూసుకో.... 

motivationalquotes_telugu_sayloudtelugu
motivational quotes in sayloudtelugu 


ఎవరికో నువ్వు నచ్చలేదని భాదపడొద్దు, బట్టలషాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి చాలా బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే. 

తులం బంగారం అక్కాచెల్లెళ్లను విడదీస్తుంది,గజం స్థలం అన్నదమ్ములను విడదీస్తుంది,మూడంగుళాల నోటు ఆరడుగుల మనిషిని ఆడిస్తుంది,అరంగుళం నాలుక ఆరడుగుల మనిషిని గాయపరుస్తుంది. 

జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో,కొందరి నిజస్వరూపం మనస్తత్వామ్ బయటపడుతాయి. మొదట అవి భాదపెట్టినా జీవితాంతం పడాల్సిన భాదను దూరం చేస్తాయి.

యువతకు కావలసింది సోమరితనం కాదు పనితనం,నీ భవిషత్తు గురించి ఈ క్షణం ఆలోచించు,నీ స్వశక్తిని ఉపయోగించు. 

ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ మోసం చేయరు,భయపడవలసింది తీయగా మాట్లాడేవారితోనే. మనసులో అసూయ పెంచుకొంటారు,సమయమొచ్చినపుడు మారిపోతారు.అద్దం బలహీనమైనదే కానీ నిజాన్ని చూపడంలో ఎప్పుడూ భయపడదు. 

మూత మూసిన పాత్రలోకి ఎంత పోసినా పాలు లోపలికి వెళ్లవు, అలాగే అహంకారం నిండిన మెదడులో జ్ఞానం వెళ్ళదు. 

బెంజి కార్లలో తిరిగితేనేమి,గంజి చొక్కాలు తొడిగితేనేమి, కన్నవారికి పిడికెడు అన్నం పెట్టలేని వాడు ఒక కొడుకేనా??ఆలోచించండి!!

స్త్రీ వజ్రం లాంటిది విలువతెలిసిన వాడికి  ఇస్తే కిరీటంలో పెట్టుకొని నెత్తిన పెట్టుకొంటాడు,అదే విలువ తెలియని వాడికిస్తే రంగురాయి అనుకోని వీధిలో పడేస్తాడు. 

జీవితంలో మనకు నచ్చని క్షణాలు చాలా వస్తాయి. మోసపోయామనో,కోల్పోయామనో మధ్యలో వదిలేయకూడదు.తోటి ప్రయాణికుడు నచ్చకపోతే రైలు నుండి దూకేస్తామా!!!?గొడుగు రంగు నచ్చకపోతే వర్షంలో తడుస్తూవెళ్తామా!!!? ఏదైనా సరే గమ్యం చేరుకోవాలి.మన ప్రయాణమే మన కధ. 

ధనం,యవ్వనం,పాండిత్యం వీటి కారణంగా ఏ మానవుడు గర్వించకూడదు.ఎందుకంటే కాలం సర్వాన్ని హరిస్తుంది.

ఇంతనేర్చుకొన్నాను అన్న గర్వం విద్యకు ఉంటుంది.ఇంతకుమించి నేర్చుకోలేదు అన్న వినయం వివేకానికి ఉంటుంది.విద్యనుండి వినయం పుట్టాలి-గర్వం కాదు.

ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే అందరికన్నా ముందు మేకలే జ్ఞానులు కావలి.స్నానాల తోనే పాపాలు పొతే ముందు చేపలే  పాప విముక్తులు కావలి.తలకిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు గబ్బిళాలెకే ఆ వరం దక్కాలి.ఈ విశ్వము అంతా ఆత్మలో ఉంది. నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనమేమీ లేదు.నీలో లేనిది బయటయేమీ లేదు.బయట ఉన్నదంతా నీలోనూ ఉంది. 

ఆశించి జీవించే వ్యక్తిలో  నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది.

పిల్ల వేరులన్ని తల్లి వేరుకి చుట్టిఉంటాయి,బంధాలుఅన్నీ  బంధకాలు కాదు భాద్యతలు. కొన్నేమో ధర్మానుసారం, మరికొన్నేమో అనుబంధానుసారం,ఇదే జీవిత సత్యం.

రెండు విషయాలు నీవెవరో తెలుపుతాయి.ఒకటి నీ దగ్గర ఏమీ లేనపుడు నీకు ఉండే ఓపిక,రెండు నీ దగ్గర అన్నీ ఉన్నపుడు నీ ప్రవర్తన.

డబ్బు నుండి వచ్చే ప్రేమ దీపం లాంటిది అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది.మనసులోనుండి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది అది సృష్టి ఉన్నంత వరకూ వెలుగుతూనే ఉంటుంది.

జ్ఞానం,ధనం,విశ్వాసం అనే ముగ్గురు స్నేహితులు. వాళ్ళది చాలా గాఢమైన స్నేహం.అనుకోకుండా ఒకసారి వాళ్ళు విడిపోవలసి వచ్చింది.తిరిగి ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలి అనే ప్రశ్న వచ్చింది.ఇంతలో జ్ఞానం అంటుంది "దేవాలయాలు,విద్యాలయాలలో నేను కలుస్తా",ధనం - "నేను ధనవంతుల దగ్గర కలుస్తా"అన్నది. విశ్వాసం మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది.కారణం ఏంటని జ్ఞానం,ధనం అడిగాయి అప్పుడు విశ్వాసం ఇలా చెప్పింది మీరిద్దరూ విడిపోయినా, వెళ్ళిపోయినా ఎక్కడో ఒక చోట కలుసుకునే వీలుంటుంది. కానీ నేను ఒక్కసారి వెళ్ళిపోతే తిరిగి రావడమనేది కుదరని పని.ఎట్టి పరిస్థితులలోను సాధ్యపడదు. విశ్వాసం మాటలను విని,జ్ఞానం ధనం ఆర్చర్యపోయాయి. స్నేహం పట్ల, విడిపోవడం పట్ల విశ్వాసానికి ఉన్న గొప్ప అభిప్రాయాన్ని మెచ్చుకొన్నాయి. దీని నుండి మనం తెలుసుకోవాల్సింన విషయం ఏమిటీ అంటే ధనం,జ్ఞానం ఎప్పుడైనా వస్తాయి,కానీ విశ్వాసం ఒక్కసారి పొతే మళ్ళీ రాదు.కనుక మనల్ని నమ్మిన వారి పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించాలి. 

ఒకరికి మంచివాళ్ళం,ఇంకొకరికి చెడ్డవాళ్ళం.  ఒకరికి ఏమీ కాము,మరొకరికి అన్నీ మనమే అదే జీవితం.

ఎంత వజ్రాల గని అయినా అక్కడ అన్నీ వజ్రాలే ఉండవు.బొగ్గు,రాయి అన్నీ కలిసే ఉంటాయి. మంచిగానీ-చెడుగానీ,ఒంటరిగా దొరకవు. మంచి చెడ్డల మిశ్రమమే ప్రపంచం. ప్రపంచమనే గనిలో మనమే కావలసిన దానిని ఏరుకోవాలి.

నువ్వు ఒక బండరాయిని పగలగొట్టే సమయంలో వెంటనే పగలకపోవచ్చు,తొంభైతొమ్మిది దెబ్బలు నువ్వు కొట్టావు కానీ అది పగల్లేదు వందోదెబ్బ కు అది పగిలింది. అంటే దాని అర్ధం అంతకుముందు నువ్వు కొట్టిన తొంభైతొమ్మిది దెబ్బలు వృధా అనికాదు. వాస్తవానికి ఆ తొంభైతొమ్మిది దెబ్బలు నీకు వందోదెబ్బ కొట్టడానికి కావలసిన బలాన్ని,అనుభవాన్ని,కసిని కలిగిస్తాయి. అలాగే జీవితం కూడా అంతే జీవితంలో ఏదైనా సాదించాలి అంటే ప్రయత్నం ఆపకూడదు. 

ఒకసారి కుండను ఎవరో అడిగారట "నువ్వు ఎలాంటి పరిస్థితులలో అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా!!?"అది ఎలా సాధ్యం అని ? అప్పుడు కుండ ఇలా సమాధాన ఇచ్చిందట నేను ఎప్పుడూ ఒకటి గుర్తు పెట్టుకొంటాను నేను వచ్చింది మట్టిలో నుండి,వెళ్ళేది కూడా మట్టిలోకే మధ్యలో ఆవేశం,గర్వం అవసరమా అని. మన జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలు,పరిస్థితులను ఎదుర్కొన వలసి వస్తుంది.ఎవ్వరూ వీటినుండి తప్పించుకోలేరు అయినా ఇవన్నీ తాత్కాలికమే అన్న విషయాన్నీ గ్రహించి కుండలాగా ప్రశాంతంగా  ఉండాలి.

మనవి  కాని బంధాలను దగ్గరచేసి పరీక్ష పెడుతుంది కాలం. పరీక్షలో గెలిస్తే ఆ బంధం ఇచ్చే తీపి జ్ఞాపకాలతో జీవితం ఆనందంగా గడచిపోతుంది.పరీక్షలో ఓడిపోతే ఆ బంధం ఇచ్చే గాయాలతో భారంగా గడిచిపోతుంది జీవితం. కర్చితంగా  ప్రతీ పరిచయం,ప్రతీ బంధం ఏదో ఒక జ్ఞాపకాన్ని ఇచ్చే వెళ్తుంది. 


Post a Comment

0 Comments