"తమ జీవన ప్రయాణాలలో కొందరు ప్రముఖులు చెప్పిన జీవిత సూత్రాలు"
👉"మీరు మీ అందు ధైర్యంగా ఉంటే ఇతరులు మీ యందు ధైర్యముగా ఉంటారు."👉"మీరు ఎక్కువ ధైర్యంగా ఉంటే,ఎక్కువ సాధించవచ్చు."
👉"మనమంటే ఇష్టం లేదు అని ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పారు... వారి ప్రవర్తనని బట్టి మనమే అర్ధం చేసుకోవాలి... కష్టమైన .. ఇష్టమైనా... మనమే దూరం అవ్వాలి. విలువ లేని చోట... బాధపడుతూ ఉండడం కంటే... కష్టమైనా వదిలేసి ఉండడం మంచిది.
👉మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్ధమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే..... నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం.
👉"మీరు నియంత్రించలేని విషయాలను జీవితం మీపై విధిస్తుంది,కానీ మీరు దీని ద్వారా ఎలా జీవించబోతున్నారు అనే ఎంపిక మీకు ఇంకా ఉంది."--సెలిన్ డియోన్
👉 మంచి స్నేహితులు,మంచి పుస్తకాలు మరియు నిద్రలేని మనస్సాక్షి:ఇది ఆదర్శవంతమైన జీవితం."-- మార్క్ ట్వైన్
👉"జీవితం తమాషా గా లేకుంటే విషాదంగా ఉంటుంది."--- స్టీఫెన్ హాకింగ్
👉అందరూ మీ దగ్గర సంతోషంగా ఉన్నారంటే..... కొన్ని విషయాల దగ్గర మీరు రాజీ(compromise ) పడుతున్నట్లే..... మీరు అందరి దగ్గర సంతోషంగా ఉండగలుగుతూన్నావంటే... వారి తప్పులను మీరు పట్టించుకోకుండా బంధానికే ఎక్కువ విలువనిస్తున్నారని అర్ధం.
👉"జీవితమనే వృక్షానికి కాసే పండ్లు అధికారం,సంపద అయితే,ఆత్మీయులు,స్నేహితులు ఆ వృక్షానికి వేర్లు... పండ్లు లేకపోయినా చెట్టు బ్రతుకుతుందేమో కానీ వేర్లు లేకపోతే బ్రతకలేదు!!"
👉"ఆస్తిని చూసి "పేమించే వారి కంటే... నిన్ను 'తమ ఆస్తిగా"భావించే వారే ముఖ్యం!!
👉హంసలు తెల్లగా ఉంటాయి. కొంగలు కూడా తెల్లగా ఉంటాయి. అయితే తెల్లగా ఉన్నంత మాత్రాన కొంగలు హంసల మధ్య గౌరవం పొందలేవు. అదేవిధంగా తల్లిదండ్రులు అజ్ఞానం కారణంగా కొందరు పిల్లలు చదువు సంధ్యలు నేర్చుకోలేకపోతుంటారు. వారు నలుగురిలోనూ నవ్వులపాలయ్యే మనుషులు హంసల మధ్య కొంగల్లా రాణించలేకపోతుంటారు. -- చాణక్యుడు.
👉మనం స్వర్గం చేరుకోవాలని అభిలాషిస్తుంటే,అన్నింటికన్నా ముందుగా మనం చెయ్యవలసిన మంచిపని-కల్లాకపటం తెలియని పసిపాపాలుగా అయిపోవడం. - బైబిల్
👉ప్రార్థనలసాయంతో మనం పరమాత్ముడి సన్నిధానానికి సగం వరకూ వెళ్లగలుగుతాం.ఉపవాసాల సాయంతో మనం ముఖ్యద్వారం వరకూ వెళ్లగలుగుతాం. అయితే లోపలికి ప్రేవేశించడానికి మాత్రం మనకి దానాలే సాయపడతాయి. -- ఖొరాన్
👉 మనిషి మనసు మామూలు విషయం కాదు.అది ఎంతో శక్తివంతమైనది.స్వర్గాన్ని నరకంగానైనా,నరకాన్ని స్వర్గంగానైనా మార్చివేయగల అద్భుత శక్తులు మనిషి మనసుకే ఉంటాయి. --మిల్టన్
👉మనం చేసే పనిలో విజయాన్ని చేజిక్కించుకోవడానికి మనకి కావలసింది ముఖ్యంగా మూడు లక్షణాలు ---ధైర్యసాహసాలతో ముందడుగులు వేయడం,తక్కినవారికన్నా ముందుగా నిర్ణయాలు తీసుకోవడం,అందరూ చేసిన పనిని చేయకుండా కొత్తకోణంలో చేయడం. -- మర్చంట్
👉ప్రత్యర్థి వైభవాన్ని అసూయపడకుండా చూడగలిగినవాడు మంచిమనిషి,అలా చూసి ఆనందించగలిగే వాడు మంచి హృదయమున్న మనిషి అంతేకాక ప్రత్యర్థి వైభవానికి తానుసైతం తోడ్పాటునందించేవాడు విశ్వాత్మ అంశ గల మనిషి--మైగేల్ డీ సెర్వెంటస్.
👉జీవితంలో ముందు ముందుకి సాగే కొద్దీ మనిషి అప్పటిదాకా ఎంతో గొప్పవి అనుకున్నంత శక్తి సామర్ధ్యాలకి వుండే పరిమితులని తెలుసుకుంటుంటాడు. ---ఫ్రాయిడ్ .
👉ఓటమి,ఒంటరితనం ఈ రెండూ జీవితంలో చాలా నేర్పిస్తాయి...!ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే,మరొకటి ఎవరిని నమ్మాలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది...!
👉కళ్ళు తమని తాము నమ్ముతాయి...,చెవులే ఇతరులను నమ్ముతాయి.
👉ఒక ఆలోచన నాటితే ఒక కార్యాన్ని ఫలితంగా పొందగలరు. ఒక కార్యాన్ని నాటితే ఒక అలవాటుని ఫలితంగా పొందగలరు. ఒక అలవాటుని నాటితే మీరు ఒక వ్యక్తిత్వాన్ని సంపాదించుకుంటారు. ఒక వ్యక్తిత్వాన్ని నాటితే మీరు ఒక లక్ష్యాన్ని సాధిస్తారు. ఇవన్నీ మొదలయ్యేది ఒక ఆలోచనతోనే.
👉ఒత్తిడి లేని ఉద్యోగం లేదు.. నష్టం లేని వ్యాపారం లేదు... కష్టం లేని వ్యవసాయం లేదు... బాధలు లేని సంసారం లేదు.... సమస్య లేని మనిషి లేడు... ఇవన్నీ సాధిస్తేనే జీవితం... "!!
👉నిన్ను నిన్నుగా ఇష్టపడేవాళ్ళకు నీవంటే ఏమిటో చెప్పనవసరం లేదు. నిన్ను ఇష్టపడని వాళ్లకు నీవంటే ఏమిటో చెప్పినా అర్ధం కాదు. మనం మంచి వాళ్ళుగా జీవిస్తే చాలు... దానిని నిరూపించుకోవాలని ప్రయత్నించనవసరం లేదు..."
👉కొంచెం వెనక్కి తగ్గి చూడు చాలా దూరం వెళ్లగలవు.
👉సంబంధాలు ఎప్పుడూ మామూలుగా చంపబడవు.... అవి ఒకరి నిర్లక్ష్యం,ప్రవర్తన,అహంకార పూరిత వైఖరి వలన మాత్రమే చంపబడుతాయి."
👉ఆకలి విలువ కాలే కడుపుకి,ప్రేమ విలువ గాయపడ్డ మనసుకి,కన్నీటి విలువ నిజాయితీకి,మనిషి విలువ కష్టాల్లో ఉన్నవాడికే తెలుసు.
👉కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది అదే కోపం వెనకున్న బాధను తెలుసుకొంటే బంధం నిలబడుతుంది అలా ఉండగలగడానికి మనకు కావలసినిన ఆయుధాలు చిరు నవ్వు. మౌనం.
👉చిరు నవ్వు మౌనం రెండు గొప్ప ఆయుధాలు చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు మౌనం తో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
👉మన జీవితం శాశ్వతం కాదు!!డబ్బు శాశ్వతం కాదు!!శాశ్వతంగా నిలిచేది ఒక్కటే.... మన మంచితనం ప్రేమగా ఒక పలకరింపు!!!
👉అవసరం ఉన్నా,లేకున్నా.. ఎప్పుడూ ఒకేలా ఉండు. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు...!!
👉రూపాన్ని చూసి మోసపోకు,రూపాయిని చూసి మురిసిపోకు రూపమైనా....రూపాయైనా ఏదీ శాశ్వతం కాదు మనసులోని ప్రేమాభిమానాలే శాశ్వతం.
👉పిల్లలకు వస్తువులు ఇవ్వకపోతే కొద్దిసేపే ఏడుస్తారు.కానీ వాళ్ళకు సంస్కారాన్ని ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు.
👉సముద్రం వద్ద ఎటుచూసినా నీరే కనిపిస్తుంది. కానీ గుక్కెడు నీరు కూడా తాగడానికి పనికిరావు. అలాగే మన చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా మనం అనుకొనే భావం ఎదుటివారిలో లేకపోతే ?నువ్వు ఎంత తాపత్రయ పడినా అది వృధా ప్రయాస మాత్రమే.
👉"జీవితంలో అందరికీ ఏదో ఒక రకమైన లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని సాధించడానికి, మనం ఎల్లప్పుడూ కష్టపడి పనిచేయాలి. ఎందుకంటే, కష్టపడి పనిచేయడం అంటే, విజయానికి దారి." - సునీల్ గవస్కర్
👉"ఏదో ఒకటి సాధించాలని ఉంటే, అది సాధ్యమేనని నమ్మండి. ఆ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది." - ఎస్.ఆర్. రావు
👉"విజయం అనేది గమ్యం కాదు, ప్రయాణం. ఆ ప్రయాణంలోని ప్రతి అడుగు కూడా విజయం." - ధర్మవీరా
👉"లోకంలో ఏదైనా కావచ్చు, కానీ మీరు కష్టపడి పనిచేయాలి. అప్పుడే విజయం మీ వద్దకు వస్తుంది." - సి. నారాయణ రెడ్డి
👉"నిరాశతో కూడిన చిన్న అడుగు కంటే, ఆశతో కూడిన పెద్ద అడుగు మంచిది." - పుట్టపర్తి నారాయణాచార్యులు
👉"విజయం అంటే ఎప్పుడూ గెలవడం కాదు, ఎప్పుడూ ఓడిపోకుండా ప్రయత్నించడం." - ఎం.ఎస్. రెడ్డి(telugu poet)
మీరు మరిన్ని స్ఫూర్తిదాయక జీవన సూత్రాలను అనుసరించుటకు మా యూటూబ్ ఛానల్ ను subscribe చేసుకొని ఫాలో అవగలరని ఆశిస్తున్నాము. 👇
0 Comments
మీరిచ్చే ప్రతి కమెంట్ ప్రోత్సాహమే మన సే లౌడ్ తెలుగు కు ఉత్సాహం ......అందుకే కమెంట్ చేయండి మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.