మనం స్క్రబ్ ను ఇంట్లోనే తయారుచేసుకునే విధానాలు
👉ఒక స్పూన్ చెక్కరలో సరిపడినన్ని చుక్కలు నీటిని పోసి రెండు చుక్కల నారింజ రసం కలిపి ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు ముఖం పై వలయాకారంగా రుద్దాలి. ఇది ఆరిపోయిన తరువాత ముఖం కడుక్కొని కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ ను రాయండి. ఈ స్క్రబ్ నిర్జీవంగా మారిన చర్మానికి నిగారింపుగా తీసుకొస్తుంది.
👉ఒక స్పూన్ నిమ్మరసం ,చెక్కెర తీసుకుని దానికి కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ ను తేనెలో కలిపి గట్టి మిశ్రమం లా చేయాలి. దీనిని ముఖం పైన వలయాకారంగా రాసుకొని,ఆరిపోయిన తరువాత కడిగేసుకోవాలి. చెక్కెర మృత కణాలను (dead cells) తొలగించి ముఖాన్ని శుభ్రపరుస్తుంది. ఆలివ్ నూనె మొటిమల్ని మచ్చలను తగ్గిస్తుంది.
👉ఒక స్పూన్ కొబ్బరినూనెలో మూడు స్పూన్ల చక్కర,కొన్ని చుక్కల కొబ్బరి నూనె వేసి మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖం పై సవ్య అపసవ్య దిశల్లో రాసి,పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితొ కడిగేయాలి. పావు స్పూను ఆలివ్ ఆయిల్,ఒక స్పూన్ తేనే,ఒకటిన్నర స్పూన్ కాపీ పొడి కలిపి ముఖానికి రాయాలి. ఆరిపోయిన తరువాత నీటితో కడిగేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ సహజ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. తేనె చర్మానికి తేమనిస్తుంది.
👉గంధం తో అందం ఎలా?
కావలసిన పదార్ధాలు:
- పాలు పావుకప్పు
- గంధం ఒకస్పూను
- నూనె కొంచెం
- తేనే రెండు చుక్కలు
👉ఓట్ మీల్ మరియు పెరుగు తో స్క్రబ్ తయారుచేసుకోవడం ఎలా?
కావలసిన పదార్ధాలు:
- రెండు టీస్పూన్ల ఓట్ మీల్
- పెరుగు ఒక స్పూన్
- ఒక టీస్పూన్ కొబ్బరి నూనెను
ఓట్స్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగివున్నాయి, కనుక ఇవి చర్మాన్ని బాగా ఉంచుతాయి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చర్మం పొలుసు ఊడిపోవడంలో సహాయపడుతుంది మరియు కొబ్బరి నూనె చర్మ తేమను కాపాడడంలో సహాయపడుతుంది. ఈ స్క్రబ్ చేయడానికి, రెండు టీస్పూన్ల ఓట్ మీల్, ఒక టీస్పూన్ పెరుగు మరియు ఒక టీస్పూన్ కొబ్బరి నూనెను కలిపి పేస్ట్‌లా తయారు చేయండి. తర్వాత ఆ పేస్ట్‌ని తీసుకుని 30-60 సెకన్ల పాటు వృత్తాకారంలో మసాజ్ చేయాలి. చివరగా, మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి.
👉ఓట్స్ పాలతో స్క్రబ్ తయారీ ఎలా?
కావలసిన పదార్ధాలు:
- ఓట్స్ పొడి
- పాలు
- తేనె
ఓట్స్ ను ఎండబెట్టి లేదా దోరగా వేగించి పొడిచేసుకొని అందులో కొన్ని పాలు ,కొంచెం తేనె కలపండి. ముఖానికి ,చేతులకు,మెడ భాగాలలో పూసుకొని ఒక ఇరవైనిమిషాల పాటు ఉంచుకొని, ఐదు నిమిషాలు పాటు స్క్రబ్ చేసుకొండి.ఈ పద్దతి ద్వారా పాలలో ఉన్న మృదుత్వం వలన చర్మం చాలా మృదువుగా అనిపిస్తుంది.తేనె యాంటి ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండి,ఓట్స్ పొడి మరియు తేనె లతో చర్మం పై బాగా స్క్రబ్(రుద్దుకోవడం) చేయడం వలన మృతకణాలు (డెడ్ సెల్స్ ) తొలగిపోయి చర్మం కాంతి వంతంగా కనిపిస్తుంది.
👉తేనె పసుపు మిశ్రమంతో స్క్రబ్ :
కావలసిన పదార్ధాలు:
- తేనె
- పసుపు
తేనె పసుపు మిశ్రమాన్ని ముఖానికి గాని చేతులకు గానీ పూసుకొని 20 నుండి 30 నిముషాలు ఆలానే ఉంచుకొని తరువాత స్క్రబ్ చేసుకోండి. స్నానానికి వెళ్లే ముందు ఇలా చేసుకోవచ్చు. తేనె పూసుకొంటే జుట్టు తెల్లగా అవుతుందనేది అపోహ మాత్రమే. తేనె పూస్తే జుట్టు తెల్లగా అవ్వదు.
👉వర్షాకాలంలో సెనగ పిండి కొబ్బరి నూనెలతో:
కావలసిన పదార్ధాలు:
- సెనగ పిండి
- కొబ్బరినూనె
- పసుపు
వర్షాకాలంలో ఈ పద్దతిలో స్క్రబ్ చేసుకోవడంలో మృత కణాలను(డెడ్ సెల్స్) బాగా తొలగించుకోవచ్చు. సెనగపిండిని తీసుకొని అందులో కొబ్బరినూనె పసుపు ఈ రెండింటిని వేసి బాగా పేస్ట్ లాగ కలుపుకొని,చేతులు,మెడ,ముఖ భాగాలకు పూసుకొని ఒక 30 నిమిషాల తరువాత కొంచం కొంచెం నీటితో స్క్రబ్ చేసుకొంటూ కడిగేసుకోండి. ఇలా చేయడం వలన మన డెడ్ సెల్ లేయర్స్ అన్ని శుభ్రంగా తొలగిపోతాయి.వర్షాకాలంలో కొబ్బరినూనె దురదలు రాకుండా బాగా పనిచేస్తుంది. పసుపు వైరస్,బాక్టీరియా,ఫంగస్ క్రిముల నుండి చర్మానికి రక్షణ కలిగిస్తుంది.సెనగ పిండి సహజ సబ్బులాగా పనిచేస్తుంది.
![]() |
skin care tips in sayloudtelugu |
👉స్నానానికి సమయం ఎక్కువ సమయం పట్టే పెసర,సెనగ పిండితో మరో పద్దతి:
కావలసిన పదార్ధాలు:
- పెసర పిండి
- సెనగ పిండి
- పాలు
పెసర పిండిని ,సెనగ పిండిని రెండింటిని కలిపి ఒక సీసా లో ఉంచుకోండి.స్నానానికి వెళ్లబోయే ముందు రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల పిండిలో కొంచెం పాలు పోసి బాగా కలుపుకొని సబ్బులాగా రుద్దుకొని స్క్రబ్ చేసుకోవడం వలన శుభ్రంగా మురికి మృతకణాలు (డెడ్ స్కిన్ సెల్స్ ),జిడ్డు తొలగిపోతాయి. సబ్బుతో స్నానం చేసినపుడు చర్మానికి రక్తప్రసరణ ముప్పై శాతం కలిగితే,ఈ విధంగా స్క్రబ్ చేసుకోవడం వలన చర్మానికి సుమారు 80-90 శాతంకు పెరుగుతుంది.
👉ఎక్కువ మొత్తం లో సున్నిపిండి తయారీ పద్దతి :
కావలసిన పదార్దాలు:
- కస్తూరి పసుపు 100గ్రాములు
- తులసి ఆకులు 100 గ్రాములు
- వేప ఆకులు 100 గ్రాములు
- తుంగ మస్తులు వేర్లు 100గ్రాములు
- బావంచాలు గింజలు 100గ్రాములు
- వట్టివేర్లు 100గ్రాములు
- కంద కర్పూరాలు 100గ్రాములు
- నిమ్మతొక్కలు 100గ్రాములు
- కమలాతొక్కలు 100గ్రాములు
- గులాబీ రేకులు 100గ్రాములు
- పెద్ద ఉసిరికాయ ముక్కలు 100గ్రాములు
- కుంకుమ పువ్వు 3-5 గ్రాములు
- ఉలవలు 100 గ్రాముల నుండి సుమారు 200 గ్రాములు
- ముడిబియ్యం (పాలిష్ లేనివి)250 గ్రాములు
- పెసలు 5కేజీలు
పైన తెలిపిన కావలసిన పదార్ధాలను బాగా ఎండపెట్టుకొని పొడిచేసుకొని తేమ లేని ప్రదేశంలో నిల్వచేసుకోవాలి. ఫ్రిడ్జ్ లోకాని బయట సాధారణ వాతావరణం లోకానీ. కస్తూరి పసుపు,వేప ఆకులు,తులసి ఆకులు ఇవి మూడు చర్మం పైన బాక్టీరియా వైరస్ లను నాశనం చేయుటకు బాగా ఉపయోగపడుతాయి.
బావంచాలు చర్మం నలుపు వర్ణాన్ని నియంత్రిస్తుంది. తుంగమస్తులు స్కిన్ రాష్ రాకుండా ,వట్టి వేర్లు సెల్స్ ను గ్రోత్ కి,నిమ్మతొక్కలు కమలా తొక్కలు ఆయిల్ కంట్రోల్ కి ఆంటీ ఆక్సిడెంట్స్లా లా పని చేస్తాయి.
ఉసిరి కాయలో ఉండే విటమిన్ సి స్కిన్ ముడతలు రాకుండా ,ఉసిరి కాయలో ఉండే ఫ్లవనాయిడ్ల వలన డెడ్ స్కిన్ అంతా కూడా తొలగిపోతుంది.
గులాబీరేకుల వలన చర్మం ముడతలు పడకుండా నిగ నిగ లాడుతూ ఉండుతూ ఉంటుంది.
ఉలవలలో ఉండే కొన్ని రసాయనాల వలన బాక్టీరియా వైరస్ లు చర్మ స్వేద రంద్రాలలోనికి ప్రవేశించ కుండా నియంత్రించే ప్రక్రియ బాగా జరుగుతుంది.
పెసల గరుకుదనం వలన స్క్రబింగ్ కి చాల ఉపయోగ కరంగా ఉండి డెడ్ సెల్స్ సులువుగా తొలగిపోతాయి.
కుంకుమ పువ్వు ధరతో కూడినది కనుక మీరు వాడగలిగిన వారు వేసుకోవచ్చు.
ఈ విధానాలే కాకుండా ఇంకా కొన్ని పద్దతులలో మనం ఇంట్లో సున్నిపిండి తయారుచేసుకోవచ్చు. సున్నిపిండి తయారీ వివిధ పద్దతులలో తయారుచెయ్యడం తెలుసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి 👈
0 Comments
మీరిచ్చే ప్రతి కమెంట్ ప్రోత్సాహమే మన సే లౌడ్ తెలుగు కు ఉత్సాహం ......అందుకే కమెంట్ చేయండి మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.