ఆనందానికి వంద మార్గాలు👀😄
1. ప్రతి రోజూ ఒక ఐదు నిముషాలు దీర్ఘ శ్వాస తీసుకోవడం.2. నీలో నీవు ధ్యానం చేసుకో ఈ ప్రపంచాన్ని ప్రక్కకు జరిపి.
3. ఏపనినైన మనస్ఫూర్తిగా చేయండి.
4. ధన్యవాదాలు (thanks ) చెప్పడం అలవాటు చేసుకోవడం.
5. ఎప్పుడూ ఏ పరిస్థితులను కీడించకండి.
6. హాయిగా కొన్ని నిముషాలు పరిగెత్తండి.లేదా ఈత కొట్టండి లేదా పాట పాడండి.
7. ఏదో ఒక పుస్తకాన్ని నీ మంచం పక్కనే పెట్టుకొని చదువుతుండండి.
8. వారానికి ఒక సారి దీర్ఘ స్నానం చేయండి.
9. చక్కగా కొంత సమయం కునుకు తీయండి.
10. నవ్వొచ్చినపుడు ఆపుకోకండి గట్టిగా నవ్వండి.😆
11. రోజూ నడకను రకరకాల ప్రదేశాలలో నడవండి.
12. ఒక మంచి గ్రీన్ టీ తయారుచేసుకొని దాన్ని ఆస్వాదిస్తూ ఆకాశాన్ని చూస్తూ తాగండి.
13. నీకు నచ్చినది వండుకొని తిను.
14. ఏదైనా ఒక అట ఆడండి.
15. ఏదైనా మెదడుకు మేత పెట్టే పనులు చేయండి.
16. నిన్ను నువ్వు మరచేలా ఒక పాట పెట్టుకొని ఎగరండి.
17. నచ్చిన పాటను ప్రశాంతంగా విను.
18. నీకున్న వాహనం లో పని లేకపోయినా ఊరికే ఆలా తిరగండి.
19. ఎప్పుడూ ఇంట్లోనే కూర్చోకుండా అప్పుడప్పుడు బయట తిరగండి.
20. నీకు నువ్వే నచ్చినది గిఫ్ట్ గా ఇచ్చుకో.
21. నీకు నచ్చిన వాళ్లకు ఫోన్ చేసి ఊరికే గుర్తొచ్చారండి అని చెప్పి పెట్టెయ్. (వారిని వ్యక్తిగత విషయాలు అడగకండి)
22. నీకు నచ్చిన ఫ్రెండ్స్ తో కూర్చొని ఏదైనా షేర్ చేసుకొని తిను.
23. ఏదైనా నీ ఆలోచనలో మెదిలేది వ్రాయండి.
24. నీ శరీరాన్ని నీకు నువ్వే మర్దన చేసుకో.
25. శరీరాన్ని శాస్త్రీయ పద్దతిలో మసాజ్ చేయించుకోండి.
26. నీళ్ళు నిదానంగా తాగండి.
27. ఇల్లు శుభ్రం చేసుకోండి.
28. నీకు నచ్చిన ఫోటోని గోడకు పెట్టుకో.
29. చిన్నప్నప్పటి నుండి నీకు బాగా నచ్చిన విషయాలు ఫ్రెండ్స్న తో చెప్పుకొని నవ్వుకో.
30. సవత్సరానికి ఒకరోజు ఎవరైనా పుట్టినరోజులు ఉంటే సుభాకాంక్షలు తెలుపు.
31.మీకు తోచిన సాయం అప్రయత్నంగా రోడ్డు పైన ఎవరైనా కనిపిస్తే చేయండి.
32. ఇతరుల ముందు నీ కుటుంబ సభ్యుల గురించి కొన్ని మంచి మాటలు చెప్పు.
33. ఎప్పుడైనా బాధనిపిస్తే గట్టిగ ఏడవండి.
34. నీ పైన వున్న విమర్శలను పట్టించుకోకు.
35. కొన్ని విహాయలలో కాస్త స్వార్ధ పూరితంగా నటించండి.
36. నీ మనసులోని చెత్తను మీలో మీరు పరిశీలించండి.
37. ఎక్కువ భవిషత్తు గురించి ఆలోచించకు.
38. ప్రతి పనికిరాని విషయానికి బాధపడకు.
39. ఇంతవరకు ఎప్పుడు చేయని పనులను చేయండి.
40. నెలలో ఒక్కసారైనా ఒక కొత్త విషయం నేర్చుకో .
41. నీలక్ష్యాలను మరొకసారి సమీక్ష(రివ్యూ) చేసుకో.
42. నీకు నచ్చిన ఒక సినిమాను వారానికి ఒక సరి చూడు.
43. ఎవరైనా పెద్దవారు ఉన్నపుడు వాళ్ళను గమనించి సహాయం చై .
44. నీకు బాగా నచ్చిన వ్యక్తిని మనస్ఫూర్తిగా కౌగిలించుకో.
45. ఎవరికైన క్షమాపణ చెప్పవలసి వస్తే వెంటనే చేప్పేయండి.
46. నిన్ను నీవు నిందించుకోవడం ఆపు.
47. రోజూ ఒక పది పదినిమిషాలు చిరునవుడుతో నడవండి.
48. కొంచెం ఉదార స్వభావాన్ని కలిగుండు.
49. నీ రోజును కొంచెం ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం చై. అవకపోతే నవ్వుకో 😃
50. ప్రతి రోజు క్రమశిక్షణతో పండ్లు కూరగాయలు తినండి లేదా యోగ చేయండి.
![]() |
100 ways to be happy-sayloudtelugu |
51. వారంలో ఒకసారైనా సూర్యోదయాన్ని సూర్యాస్తమాన్ని చూడండి.
52. ఏదైనా ఒక ఆట వస్తువుని కొనుక్కొని చిన్నపిల్లలు ఆడుకున్నట్లు ఆడుకొండి.
53. మరణం అనే విషయాన్నీ గంభీరంగా చూడకుండా మరణం ఎలాగూ వస్తుంది దాని పట్ల భయం అక్కరలేదని తెలుసుకొండి.
54. ఏ వూరికి పోయినా ఒక చిన్న పని పెట్టుకో.
55. ఒక అరగంట సేపు అలా నిశ్శబ్దంగా ఉండు.
56. డబ్బును గురించి అర్ధం చేసుకొని దుబారా చేయకు.
57. నీ ఫ్రెండ్స్ తో ఎందువలన నీకు వారికీ ఎలా గర్షణలు వస్తున్నాయి. ఏ విషయాల పైన గొడవలవుతున్నాయో వాటిని గుర్తించి తీసి ఆనందంగా ఉండు.
58. సమయాన్ని ప్రణాళిక చేసుకో .
59. కొన్ని విషయాలలో సంయమనం పాటించండి.
60. మీకు బాగా నచ్చిన మిత్రులతో కలిసి బాగా నోటికొచ్చినంత మాట్లాడి కలిసి తినండి.
61. ఏదైనా ఒక పెయింటింగ్ గోడకు పెట్టుకోండి.
62. డిన్నర్ వారానికి ఒకసారి కుటుంబసభ్యులతో కలిసి తినాలని ప్లాన్ చేసుకోండి.
63. నీకన్నా గొప్ప వాళ్ళు నీ కన్నా ఉన్నతమైన వారు కనిపిస్తే వారిలోని సుగుణాలను నీ జీవితంలో నికి ఆహ్వానించు.
64. చిన్న చిన్న రిస్కులు చై ,ఎప్పుడూ కంఫర్ట్ జోన్ లో ఉండకండి.
65. మీలోని పనికి రాని భయాలకు స్వస్తి చెప్పండి. తలచుకొని నవ్వుకోండి.
66. నీకు నచ్చనిది జరిగినపుడు ముఖం పైనే చెప్పేయండి.
67. కలిసిన ప్రతి ఒక్కరి గురించి ఆలోచించకుండా నీవెవరో నువ్వు తెలుసుకో
68. సంఘవిద్రోహులకు దూరంగా ఉండండి.
69. ఏదైనా నొప్పి కలిగినపుడు ఆ నొప్పిని అర్ధం చేసుకో.
70. వయసును గుర్తించు కానీ వయసులో ఇరుక్కుపోకు.
71. నీకున్న మూర్ఖ భవనాలను వేరేవారి పై రుద్దకు.
72. ఏదో ఒక ఫిలాసఫీ ని చదివి అర్ధం చేసుకోని అలవరుచుకోండి.
73. ఒక పది నిముషాలు సోషల్ మీడియా లో గడుపు. అందులో నచ్చినవి అందరితో షేర్ చేసుకో.
74. నీ జీవితం ముగిసే లోపు కనీసం వంద మొక్కలన్నా నాటు.
75. నెలకొకసారి సంబరంగా అందరినీ పిలిచి పార్టీ చేసుకోండి.
76. ఎవరైనా మంచి పని చేసినపుడు ఒక చిన్న బహుమతి ఇవ్వండి.
77. రోజూ ఇంట్లోనే తినకుండా నెలకొక సరైన ఆలా చెట్ల కింద కూర్చొని తినుటకు ప్లాన్ చేసుకోండి.
78. నీవు చిన్నగున్నపుడు చేసిన అల్లరిని ఎప్పుడూ మరచిపోకు
79. నీవు ఏ బట్టలు వేసుకొని పడుకొంటే హాయిగా ఉంటదో ఆ రెండు జతలు పక్కన పెట్టుకో,ఏ ఊరు వెళ్లినా ఆ బట్టలు తీసుకొనిపో .
80. నిన్ను నీవు ఎవరితోనూ పోల్చుకోకు.
81. టెక్నాలజీ ని నీకు ఎంత వరకు అవసరమో అంత వరకు అర్ధం చేసుకో.
82. గదిలో నీ కంటూ ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకో.
83. ఎవరైనా అడిగితే లేదని (నో) చెప్పడం కూడా నేర్చుకో.
84. వేరేవాళ్ళు చేసిన ఒక పైంటియింగ్ ని గాని ఏదైనా పనిని గాని ప్రశంసించు. (విమర్శించకు)
85. నీలోని బలహీనతలను తెలుసుకొని ప్రక్కకు జరుపుకో
86. ఏదైనా సహజ సిద్ధంగా తెలుసుకొన్నపుడు దాన్ని గుర్తించు.
87. ఏది ఏమైనా నీ చుట్టూ ఉన్నవాళ్ళతో చక్కగా ఉండు.
88. నీ వ్యక్తిగత సంబంధాలకు వృత్తి రీత్యా సంభందాలకు మధ్య తేడాను గుర్తించు.
89. ఏ పనీ చేయకుండా వారంలో ఒక్కసారైనా ఒక గంట గడుపు.
90. వేరే వారు పని చేస్తున్నపుడు వారి పనికి అడ్డు పడకు. నీవు పనిచేస్తున్నప్పుడు వేరే వాళ్ళను డిస్ట్రబ్ చేయొద్దని చెప్పు.
91. నీకు నచ్చిన ప్యాషన్ ను జీవితకాలం కొనసాగించు.
92. అప్పుడప్పుడు కుటుంబసభ్యులను సప్రైజ్ చై
93. సంవత్సరానికి ఒక సారి లాంగ్ ట్రిప్ వేయండి.
94. మీ అమ్మకి సంబందించినతో మీ నాన్నకు సంబందించినదో లేదా నీ పూర్వీకులకు సంబందించినదో ఏదో ఒక జ్ఞాపకాన్ని నీ వద్ద పెట్టుకొని నీ తరువాత తరానికి చూపించు.
95. డబ్బు పట్ల వ్యామోహం లేకుండా నిజంగా అవసరమైన వారికి సహాయం చై
96. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో.
97. ఎవరైనా ఆరోగ్యం బాగాలేనపుడు నీవు చేసే సేవ వారు చాలా కలం గుర్తు పెట్టుకొంటారు. అది చాలా తృప్తిని ఇస్తుంది.
98. సాధ్యమైనంత నిజాయితీగా ఉండండి.
99. అత్యంత ముఖ్యమైనది ఏమిటో గుర్తించి ఒక గోడపైన రాసుకో (నీవు ఆనందంగా ఉండడమే ముఖ్యం)
100. ఎవరో ఏదో అన్నారని నీకు నీవు ఎన్నడూ వదులుకోకు.
0 Comments
మీరిచ్చే ప్రతి కమెంట్ ప్రోత్సాహమే మన సే లౌడ్ తెలుగు కు ఉత్సాహం ......అందుకే కమెంట్ చేయండి మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.