Ticker

7/recent/ticker-posts

patriotic songs in telugu | sayloudtelugu

దేశభక్తి గీతాలు ఇష్టపడేవారికి కొన్ని మీ sayloudtelugu లో😎😎

భారత మాతకు జేజేలు - రచన : ఆచార్య ఆత్రేయ

భారత మాతకు జేజేలు 
బంగరు భూమికి జేజేలు 
ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవ ధాత్రికి జేజేలు  !!భారత!! 

త్రివేణి సంగమ పవిత్ర భూమి 
నాల్గు వేదములు  పుట్టిన భూమి !!
గీతంభృతమును పంచిన భూమి 
పంచశీల బోధించిన భూమి ....... !!భారత!! 

శాంతి దూతగా వెలసిన బాబు 
జాతి రత్నమై వెలిగిన నెహ్రు !!
విప్లవ వీరులు వీర మతలు 
ముద్దు బిడ్డలై మురిసే  భూమి...... !!భారత!! 

సహజీవనము సమభావనము 
సమతా వాదమే వేదముగా !!
ప్రజా క్షేమమే ప్రగతి మార్గము
లక్షములైన  విలక్షణ భూమి ........ !!భారత!! 

రచన : ఆచార్య ఆత్రేయ 
చిత్రం : బడిపంతులు 


భారత దేశం మనదేశం - రచన : జి . వెంకటస్వామి 


భారత దేశం మనదేశం 
భారతీయులం మనమంతా 
దేశ సేవే మనకర్తవ్యం 
భారతమాతే మానసర్వస్వం ...!భా !


మమతా సమతలు 
మానవ విలువలు 
మన నడతలలో చూపిస్తే 
మన దేశం ప్రగతి పధం లో 
మున్ముందుకు పోతుంది. 
మురిపాలను అందిస్తోంది. 

జాతి ప్రగతికి రూపునిచ్చే 
జగతి జనులకు శాంతినిచ్చే 
మార్గదర్శకమైన దేశం 
మరులు గొలిపే స్వర్గం 
ఇదే మన భారతదేశం 

దేశ ప్రజలను సేవిద్దాం 
దేశ మాతను పూజిద్దాం. 
దేశ దేశాల మన పేరు 
స్థిరంగా నిలుపుదాం.  !భా !

రచన : జి . వెంకటస్వామి 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

నాదు జన్మభూమి కంటే ... 

రచన : ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి 


నాదు జన్మభూమి కంటే 
నాఖ మెక్కడుంది
సురలోకమెక్కడుంది ?

అమరేంద్రులు గంధర్వులు 
అచ్చరులు వియచ్చరులు 
వేడుకతో వలసవచ్చి 
విహరించే హిమశృంగం !!నా !!

సుందర కాశ్మీరాలు 
బృందా సౌందర్యాలు 
జాహ్నవి మాధుర్యాలు 
స్వర్గ సీమలో ఎక్కడ !!నా !!

కాళిదాసు కంటి కోనల 
పసిడి కళల పూలమాల 
అలకాపురి కాపురమగు 
అమర భారతీ నిలయం !! నా!!

రచన : ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి 


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

పాడవోయి భారతీయుడా ... - రచన : శ్రీ శ్రీ 


పాడవోయి భారతీయుడా ... ఆడి పాడవోయి విజయ గీతిక ..... !!పా !!
నేడే స్వాతంత్య్ర దినం 
వీరుల త్యాగఫలం 
నేడే నవోదయం -- నీదే ఆనందం .... !!పా !!


స్వాతంత్రం వచ్చేనని సభలే చేసి 
సంబర పడగానే సరిపోదోయి. !!
సాధించిన దానికి సంతృప్తిని పొంది 
అదేవిజయమనుకొంటే  పొరపాటోయి !
ఆగకోయి భారతీయుడా -- కదలి సాగవోయి ప్రగతి దారులా.. !!ఆ  !!

ఆకాశం అందుకొనే ధరలోక వైపు 
అదుపులేని నిరుద్యోగం ఇంకొకవైపు !!
అవినీతి బంధుప్రీతి చీకటి బజారు 
అలము కున్న ఈ దేశం ఎటు దిగజారు 
కాంచవోయి నేటి దుస్థితి --ఎదిరించవోయి ఈ పరిస్థితి !!కా !!

పదవీ వ్యామోహాలు కులమత భేదాలు 
బాషా ద్వేషాలు చెలరేగే  నేడు !!
ప్రతి మనిషీ మరియొకరిని దోచుకొనే వాడే 
తన సౌఖ్యం తన భాగ్యం చూచుకొనే వాడే 
స్వార్ధమే అనర్ధ కారణం -- అది చంపుకొనుట క్షేమదాయకం   !!స్వా !!

సమ సమాజ నిర్మాణమే !!నీ ధ్యేయం 
సకల జనుల సౌభాగ్యమే !!నీ లక్ష్యం 
ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే 
లోకానికి మన భారతదేశం,
అందించును లే శుభ సందేశం 

రచన : శ్రీ శ్రీ 
చిత్రం: వెలుగు నీడలు 
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఏ దేశమేగినా ఎందుకాలిడినా -- 

రచన : రాయప్రోలు సుబ్బారావు 


ఏ దేశమేగినా ఎందుకాలిడినా 
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా 
పొగడరా నీ తల్లి! భూమి భారతిని 
నిలుపరా నీ జాతి నిండు గౌరవము. 

ఏ పూర్వ పుణ్యమో,ఏ యోగబలమో
జనియించినాడ వీ స్వర్గఖండమున 
ఏ మంచి పువ్వులన్  ప్రేమించినావో 
నినుమోసె నాతల్లి కనక గర్భమున 

లేదురా ఇటువంటి భూదేవి యెందు 
లేరురా మనవంటి పౌరులింకెందు 
సూర్యుని వెలుతురుల్ సోకునందాక 
ఓడల జెండాలు ఆడునందాక 

అందాకగల ఈ అనంత భూతల్లిని 
మన భూమివంటి చల్లని తల్లి లేదు 
పాడరా నీ తెల్గు బాలగీతములు 
పాడరా నీ వీర భావ భారతము 

తమ తపస్సులు ఋషుల్ దారబోయంగ 
శౌర్య హారము రాజచంద్రులర్పింప 
భావ సూత్రము కవి ప్రభువు లల్లంగ
రాగ దుగ్దము భక్తరత్నముల్ పిదుక 

దిక్కుల కెగదన్ను తేజమ్ము వెలుగ 
రాళ్ళ తేనియలూరు రాగాలు సాగ 
జగముల నూడిగించు మగతనం బెగయ 
సౌందర్యమెగబోవు సాహిత్యమలర

వెలిగినదీ దివ్యవిశ్వంబు పుత్ర 
దీవించె నీ పుణ్యదేశంబు పుత్ర 
పొలముల రత్నాలు మొలిచెరా ఇచట 
వార్ధిలో ముత్యాలు పండెరా ఇచట 

పృథివి దివ్ఔషధుల్ పిదికెరా మనకు
కానల కస్తూరి కాచేరా మనకు 
అవమానమేలరా? అనుమానమేలరా?
భర్తతీయుడనంచు భక్తితో పాడరా. 



🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

మాదీ స్వతంత్ర దేశం .. రచన : బాలాంత్రపు రజనీకాంతరావు గారు
 



మాదీ స్వత్రంత్ర దేశం 
మాదీ స్వతంత్ర జాతి 
భాతదేశమే మా దేశం 
భారతీయులు మా ప్రజలు !!మా !


వింధ్య హిమవత్ శ్రీ నీలాద్రులు 
సంధ్యారుణిత నవాశలు మావి!
గంగా గోదావరీ సహ్యజా
తుంగ తరంగిత హృదయాల్  మావి!!


ఆలయమ్ముల శిల్ప విలాసం
ఆరామమ్ముల కళాప్రకాశం!!
మొఘల్ సమాధుల రస దరహాసం!
మాకు నిత్య నూతనేతిహాసం.    !!మాదీ ... !!

 

అహింసా పరమో  ధర్మః
సత్యం వద ధర్మం చర
ఆది ఋషుల వేదవాక్కులు
మా గాంధి గౌతముల సువాక్కులు.       !!మాదీ.... !!


స్వతంత్రతా భాతృత్వాలు
సమతా మా సదాశయాలు
జననీ! ఓ స్వాతంత్ర దేవీ!
కొనుమా! నీవాళులు మావి!!

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Post a Comment

0 Comments