Ticker

7/recent/ticker-posts

Some Inspiring Books To Read In Telugu | sayloudtelugu

ఏ పుస్తకాలు చదివితే మనం జీవితం లో అన్నింటిలో అభివృద్ధి సాధించగలం ?

అసలు పుస్తకాలు చదివే అలవాటు నవీన ప్రపంచం లో తరచుగా తగ్గిపోతూ వుంది. జీవితం లో పైకి ఎదిగిన వారందరికీ పుస్తకాలు చదవడం అనేది గొప్పఅలవాటు.ఆ అలవాటునుండే వారు ఎన్నో జీవితపాఠాలను నేర్చుకొని అంచెలంచెలుగా ధనవంతులు గా మారినవారు ఉన్నారు.పుస్తకాలు చదవడం రిటైర్ ఐన వారే చదువుతారు అనుకుంటారు కొందరు.మన జీవితం లో జీవనశైలిని మార్చి మన గెలుపు కు భవిషత్ బాటలు ఈ పుస్తకాలు.

sayloudtelugu_book reviews in telugu_say _loudtelugu_say_loud_telugu_rich dad poor dad_The psychology of money_telugulo_the secret_Think and grow rich in telugu
book reviews in telugu


కొన్ని కోట్లకు పైగా అమ్ముడై ఎందరో జీవితాలలో  మార్పుతీసుకువచ్చిన పుస్తకాలేమిటో చూద్దాం.

👉రిచ్ డాడ్ పూర్ డాడ్ (Rich Dad Poor Dad)

👉హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇంఫ్లూయెన్స్  పీపుల్ (How to Win Friends and Influence People)

👉థింక్ అండ్ గ్రో రిచ్  (Think And Grow Rich)

👉ది సీక్రెట్ (The Secret)

👉డబ్బు మనస్తత్వం The Psychology of Money (Telugu) 


👉రిచ్ డాడ్ పూర్ డాడ్ (Rich Dad Poor Dad):

ఈ పుస్తకాన్ని రాబర్ట్ కియోసాకి రాసారు. ఈ పుస్తకం లో రిచ్ డాడ్ కి పూర్ డాడ్ కి గల ఆలోచనలను చాల వివరంగా తెలిపారు రాబర్ట్ కియోసాకి.ఈ పుస్తకం లో కియోసాకి ఏం చెప్తాడంటే డబ్బుకోసం మనం పని చేయకూడదు డబ్బే మనకోసం పనిచేయాలని చెప్తాడు.ఎందుకు ధనవంతులు ధనవంతులుగానే ఉన్నారు పేదవారు పేదవారిగానే ఉంటున్నారు వారి ఆలోచనల మధ్య బేధాలను బాగా వివరించిన పుస్తకం ఇది.మనందిరి దగ్గర ఉండే అత్యంత శక్తి వంతమైన సంపద మన మెదడు దానికి సరైన శిక్షణని ఇస్తే అపరిమితమైన సంపదను సృష్టించగలదని ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం చెప్తుంది.ఆర్ధికంగా పైకి ఎదగాలి అనుకున్నవాళ్లంతా తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.


👉హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇంఫ్లూయెన్స్ పీపుల్ (How to Win Friends and Influence People)

డేల్ కార్నెగీ అనే అతను ఈ పుస్తకాన్ని రాసారు.ఈ పుస్తకం తెలుగులో "అందరినీ ఆకట్టుకొనే కళ" అనే పేరుతో దొరుకుతుంది.కొందరు వ్యక్తులను చూస్తే అందరూ ఇష్టపడుతుంటారు వారు ఏం చెప్పినా వింటారు వారితో కలివిడిగా ఉంటారు.అలాగే కొందరు వ్యక్తులను చూస్తే అందరూ చిరాకు పడుతుంటారు వారిని అందరిలో కలవనివ్వరు.మనల్ని అందరూ ఇష్టపడాలన్నా,అందరూ స్నేహంగా ఉండాలన్నా,మనం చెప్పేది వినాలన్నా,నలుగురిలో ఎలా మెలగాలన్నది ఈ పుస్తకం లో ఉంది.ఈ పుస్తకం చదివిన తర్వాత మీ ప్రవర్తన లో మార్పు రావడం మీరే గమనిస్తారు.

👉థింక్ అండ్ గ్రో రిచ్  (Think And Grow Rich):

ఈ పుస్తకాన్ని నెపోలియన్ హిల్ అనే అతను 1930 లో రాశారు .ఇప్పటికి అమ్ముడవుతున్న పుస్తకాల్లో ఇదికూడా ఒకటి.డబ్బు సంపాదించడానికి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి చెమటోర్చి సంపాదించడం రెండవది తెలివితేటలతో సంపాదించడం ఈ థింక్ అండ్ గ్రో రిచ్ పుస్తకం మిమ్మల్ని రెండవ మార్గం లో తీసుకెళ్తుంది.మీ జీవన వికాస లక్ష్యాలు సాధించుటకు ఈ పుస్తకం చదవడం ద్వారా తెలుసుకోగలరు.

👉ది సీక్రెట్ (The Secret):

రొండా బర్న్ అనే ఆమె రాసిన  ది  సీక్రెట్ అనే పుస్తకం పుస్తక ప్రపంచం లోనే ఒక సంచలనం విడుదలైన ఒక సంవత్సరం లోనే పంతొమ్మిది కోట్లకు పైగా అమ్ముడైనది, అంతే కాదు నలబై బాషలలో అనువదించబడినది.మనం ఏమైతే గట్టిగా నమ్ముతామో అదే జరుగుతుంది అని చెప్పే పుస్తకం ఇది. మనలో ఉండే subconscious మైండ్ ఎలా పనిచేస్తుందో చెప్పే పుస్తకమే ఇది.లా అఫ్ అట్రాక్షన్ ప్రభావం తో మన జీవితం లో వచ్చే సుఖాలకు మరియు బాధలకు కారణం మనమే అని చెప్పేపుస్తకం ఇది.

👉డబ్బు మనస్తత్వం : 

మోర్గాన్ హౌసెల్ రాసిన ఈ పుస్తకంలో యదార్ధ జీవన కధలను వివరించారు. జీవితం సాఫీగా సాగాలంటే ధనం,ఆరోగ్యం రెండూ ఉండాలి.ఈ పుస్తకం లో డబ్బున్న  వ్యక్తులు సమయాన్ని ఉపయోగించుకొనే విధానానికి,డబ్బులేని వ్యక్తులు సమయాన్ని ఉపయోగించుకొనే విధానానికి ఉన్న వ్యత్యాసాన్ని రచయిత వివరించడం జరిగింది. ఆర్థికపరమైన విజయం అనేది మీకు తెలిసిన దానికంటే మీరు ఎలా ప్రవర్తిస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.ఈ పుస్తకం ఆర్థిక విజ్ఞానాన్ని మానవీయ కోణంలో వివరిస్తుంది.డబ్బు మనస్తత్వం ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే పుస్తకం, ముఖ్యంగా తమ ఆర్థిక జీవనశైలిని మెరుగుపరచాలనుకునే వారు చదవదగిన పుస్తకం. 

పుస్తకాలు చదవడం అలవాటు లేనివారు ఇకనుండైనా అలవాటుచేసుకొని  ఎవరి వ్యకిత్వ  వికాసాభివృద్దికి వారే కృషిచేయగలరని ఆసిస్తూ మీ sayloudtelgu 👈



Post a Comment

0 Comments