ఆటో ఇమ్యూన్ వ్యాధులు
ఆటో ఇమ్యూన్ వ్యాధుల గురించి మనం తెలుసుకొనవలసిన కొన్ని వివరాలు :
రుమటాయిడ్ ఆర్థరైటిస్ (RA):
రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి రావడానికి కారణాలు ఏమైఉంటాయి?:
ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి?
ఈ వ్యాధి లక్షణాలు మరియు పద్ధతి వ్యక్తివ్యక్తికీ వేరుగా ఉండవచ్చు. ఎక్కువ మందిలోకీళ్ళు ప్రభావితం అవుతాయి. కీళ్ళ నొప్పులు, వాపులు (ముఖ్యంగా చేతి వేళ్లు మరియు కాలి వేళ్లు, మోకాళ్లూ ) కీళ్ల కదలికలు తగ్గిపోవడం రాత్రి వేళలో, ఉదయం నిద్ర లేవగానే చేతివేళ్ళు నడుము బిగుసుకొని పోవటం . ముఖ్య లక్షణాలు.వీటితో పాటుగా.ఆకలి.లేకపోవడం.జ్వరం వచ్చినట్లుగా ఉండటం నిస్సత్తువగా ఉండటం, బరువు తగ్గడం కూడా ఉండవచ్చు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ కేవలం కీళ్ళకే పరిమితం కాకుండా.శరీరంలోని ఇతర అవయవాలకు కూడా సోకుతుంది.ముఖ్యంగా. కళ్ళు (స్క్లిరైటిస్ ,ఎపిస్క్లిరైటిస్ ) రక్తనాళాలు (వాస్క్యూలైటిస్ ) ఊపిరితిత్తులు(ILD ). గుండె (పెరికార్డయిటిస్) ఆస్టియో పోరోసిస్ (ఎముకలు అరిగిపోవుట ),నోరు కళ్లు పొడిబారుట (జోగ్రెన్స్ సిండ్రోమ్) లు వస్తాయి.ఈ వ్యాధి ఉన్నవారు.గుండెపోటుకు గురయ్యే అవకాశాలు కూడా మామూలు ప్రజల కంటే ఎక్కువగా ఉంటాయి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధిని ఏవిధంగా నిర్ధారిస్తారు?:
- ఈ వ్యాధిని ముఖ్యంగా పేషంట్ లక్షణాలు బట్టి నిపుణులైన డాక్టర్ (రుమాటాలజిస్ట్) నిర్ధారిస్తారు.
- ల్యాబ్ మరియు రక్త పరీక్షలు (RA ఫ్యాక్టర్, ESR, CRP)
- ఎక్స్-రే, MRI మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్ఐ) మరియు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు
- ఎసిపిఎ(ACPA-యాంటీ-సిట్రులేటెడ్ ప్రోటీన్ యాంటీబాడీస్)-పరీక్ష: రుమటాయిడ్ ఆర్థరైటిస్ ను ముందుగానే గుర్తించడానికి మరియు నిర్వహించడానికి సహాయపడుతుంది.వ్యాధి తీవ్రత మరియు పురోగతిని అంచనా వేయగలదు
- ANA (యాంటీన్యూక్లియర్ యాంటీబాడీ) పరీక్షను రుమటాయిడ్ ఆర్థరైటిస్‌నే కాక ఇతర ఆటో ఇమ్యూన్ రుగ్మతలను సూచించే యాంటీన్యూక్లియర్ యాంటీబాడీలను గుర్తించడానికి ఉపయోగిస్తారు.
చికిత్స పద్ధతులు:
ఈ వ్యాధికి పూర్తిగా నయం చేసే చికిత్స లేదు, కానీ లక్షణాలను నియంత్రించేందుకు మరియు కీళ్ల నష్టాన్ని తగ్గించేందుకు పలు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి:
- డిసీస్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ DMARDs (Disease Modifying Anti-Rheumatic Drugs)వైద్యుని సూచనల మేరకు వాడాలి.
- నొప్పి నివారణ మందులు:NSAIDలు (నాన్‌స్టెరాయిడ్ యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్) సాధారణంగా వాపు, తేలికపాటి నుండి మితమైన నొప్పి మరియు జ్వరానికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. వైద్యుని సూచనల మేరకు వాడాలి.
- వ్యాయామం మరియు ఫిజియోథెరపీ :పరిమిత స్థాయిలో శారీరక వ్యాయామం ఎంతో అవసరం,రోజువారీ కార్యక్రమాలు ఇంటి పనులు క్రమం తప్పకుండా చేయుట వలన నిస్సత్తువ తగ్గించి ఎముకలు,కండరాలను దృడతరం చేస్తాయి.
- ఆహారానియమాలు పాటించడం : రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారికి ఈ ఆహరం తీసుకొంటే కీళ్ళ నొప్పులు ఎక్కువవుతాయని చెప్పటానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సమతుల్యమైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారాన్ని (చేపలు,డ్రై ఫ్రూట్స్ ) తీసుకోవడం వలన నొప్పులు కొంతవరకు తగ్గిస్తాయి. సరిపడినంత ప్రోటీన్ మరియు కాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని (పాలు ,గుడ్డు ,ఆకుకూరలు) విరివిగా తీసుకోవాలి. బరువు ఎక్కువగా ఉన్నవారు కార్చితంగా బరువు తగ్గాలి. దోమపానం మద్యపానము మానెయ్యాలి. ఉప్పును తగ్గించాలి. ఒక సంవత్సరం పాటు పూర్తిగా ఉప్పు మానెయ్యాలి అని మంతెన గారు చెప్పారు.😊
రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధిని అదుపు చేయడం ఎలా ?
👉 రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి దీర్గకాలికంగా నొప్పులను కలుగచేయటం వలన శారీరకంగా మరియు మానసికంగా రెండువిధాలుగా వ్యాధిగ్రస్తులను ఇబ్బంది పెడుతుంది.
👉 రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధిని ఎదుర్కొని పోరాడే స్వభావాన్ని మరియు సమస్యలను పరిషరించుకొనే నైపుణ్యాలను పెంపొందించుకొనుటపై కూడా కౌన్సిలింగ్ కూడా చక్కటి తోడ్పాటునిస్తుంది.

0 Comments
మీరిచ్చే ప్రతి కమెంట్ ప్రోత్సాహమే మన సే లౌడ్ తెలుగు కు ఉత్సాహం ......అందుకే కమెంట్ చేయండి మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.