Ticker

7/recent/ticker-posts

proud to be write telugupoetry కలం తెలుగుకవితగా పలకరిస్తుంది మిమల్ని

కలం  నడిచే దారిలో 
పదాలు దొరికితే 
గడిచే కాలమంతా 
కవితల ప్రయాణం ..... 


గడిచిన కాలాన్ని తలుస్తూ 
నడిచే కాలంతో గడుపుతూ 
జ్ఞాపకాలను మదిలో తలుస్తూ 
అనుభవాలను  అక్షరాలుగా  మలుస్తూ 
ఎలా విహరిస్తుందో  నా కవితల విహారి .... 


నా కలం తో కాలాన్ని కవితలతో కొలవనా ... !!
నా కవితలతో ఈ ప్రపంచాన్ని పిలువనా ...!!
నా పదాల తో మదిలోని  భావాలను  తెలుపనా ..!!
నా అక్షరమాలను  మీ మది మెడలో వేయనా ...!!


ఆకాశం లో కదిలే మేఘాలే..!  
మది లో మెదిలే ఈ కవితలు. 
మేఘం క్రమ్మె  వర్షాలే..!
మది లో మెదిలే ఈ భావాలు. 


మీ మదికి దగ్గరగా ఉండి మాట్లాడేదే 
కవిత్వం !!
కవులకు మదిలోనే ఉండి పోట్లాడేదే 
కవిత్వం !!


కోయిలకు పాడమని నేర్పిస్తామా !!
చేపలకు ఈదామని నేర్పిస్తామా !!
పక్షులకు ఎగరమని నేర్పిస్తామా !!
కవులకు స్వతహాగా వచ్చే ఈ భావమే కవిత్వం. 


నదిలో కదిలే అలల్లా ...!
మదిలో మెదిలే  పదాలు.
తారలు మెరిసే ఆకాశంలా ....!
భావాలను తెలిపే కవులు.


పదప్రవాహం తో పారాడి ,
జనసమూహం లో తారాడి ,
ఇంద్రధనుస్సు లా మెరిసే ,,,
అంతరంగం లో మురిసే కవుల మనసే .!


శిల్పంలో రూపం తెలియాలంటే?
శిల్పి ఉలితో మలచేవరకు తెలియదు.
కవిత్వం లో భావం తెలియాలంటే?
కవి పదాలతో వర్ణించేవరకూ తెలియదు.


కవి హృదయం లో భావం అద్భుతం.
కావ్య సమూహం లో పదం  ప్రవాహం. 
నవ తరం లో బలం సాంకేతికపరిజ్ఞానం.
నవ యుగం లో వరం అంతర్జాలం.


నా కలం కనులకు తెలిసిన రూపం - తెలుగు కవితలు 
నా భావం జనులకు తెలిసే మార్గం - తెలుగుకవితాలు 




Post a Comment

4 Comments

  1. Nice mitarama,matrubasha ni marachi potamu anna anumanam undedi nee lanati vallu rayatam kontha lo kontha santosham, rayalani neevu marenno chudali tondaralo malli

    ReplyDelete
  2. chala bagundhi me kavitha. Best of Luck dear.

    ReplyDelete

మీరిచ్చే ప్రతి కమెంట్ ప్రోత్సాహమే మన సే లౌడ్ తెలుగు కు ఉత్సాహం ......అందుకే కమెంట్ చేయండి మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.