Ticker

7/recent/ticker-posts

How to Cook Boiled Egg Fried Rice ? ఉడికించిన కోడిగుడ్లతో ఫ్రైడ్ రైస్ చేయడం ఎలా ? 😋😋


boiled_egg_fried_rice_sayloudtelgu

ఉడికించిన కోడిగుడ్లతో ఫ్రైడ్ రైస్ చేయడం ఎలా ? 

కావలసిన పదార్థాలు :--

  • 4 గుడ్లు
  • ఉడికించిన బియ్యము
  • అల్లం
  • వెల్లుల్లి
  • ఉల్లిపాయలు
  • కాప్సికం
  • పచ్చిమిర్చి
  • జీరకర్ర 
  • అవాలు
  • ఆయిల్
  • ఉ ప్పు
  • పసుపు పొడి
  • కారం పొడి
  • మిరియాలు
  • సోనామసూరి రైస్ 

👉తయారుచేయువిధానం:

కావలసిన పదార్దాలు అన్ని మంచినీటితో కడుక్కొని మనం సులువుగా మూడు దశలలో ఈ బొయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ని తయారుచేసుకోవచ్చు.
  1. రైస్ ను ఉడకబెట్టుకోవడం 
  2. ఎగ్స్ ను ఉడకబెట్టుకొని వేగించుకోవడం 
  3. పోపువేసుకొని అన్ని కలిపివేయడం 
👉ముందుగా కుక్కర్ లో ఒక కప్పు సోనా మసూరి రైస్ కి రెండుకప్పు ల నీటిని పోసి కుక్కర్ లో పెట్టి ఉడికించుకొని ఒక గిన్నె లో పక్కన తీసుకొని పెట్టుకోండి.మీరు ఎన్ని కప్పుల రైస్ ను వండుతున్నారో దానికి అనుగుణంగా నీటికొలతను  తీసుకోండి.
👉మూడు ఉడకబెట్టిన కోడిగ్రుడ్లను నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి.ఇప్పుడు ఆమ్లెట్ కి  వేసుకున్నట్లు ఒక ప్లేట్ లో కోడి గుడ్డు ను పగలు కొట్టి గుడ్డుసొనను బాగా కలియబెట్టి అందులో ఉప్పు మరియు మిరియాలపొడిని వేసుకోండి.క్రింద వీడియోలో చూపిన విధంగా ఉడకబెట్టి కట్ చేసిన కోడి గుడ్ల ముక్కలను కొంచెం సేపు పెట్టుకొని (అంటే ఉడకబెట్టిన కోడిగుడ్డు పచ్చ సొన ఈ పచ్చి గోడిగుడ్డు సొనను పీల్చుకొనేలా) ఉంచుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ లో ఆయిల్  కొంచెం వేసుకొని కొంచెం కాగాక ఈ ప్లేట్ లో రెడీ చేసిపెట్టుకొన్న ఎగ్స్ ను అందులో వేసి వేగించండి.కొంచెం వేగుతుండగా కొంచెం కరం వేయండి.క్రింద చూపిన విధంగా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఈ వేయించిన కోడిగుడ్లను ఒక పక్కన పెట్టుకోండి.
👉కావాల్సిన పదార్దాలు అన్ని ముందుగానే తరిగిపెట్టుకున్నారుకదా !!!! ముఖ్యం గా అల్లం మరియు వెల్లుల్లి ముక్కలను వీలున్నంత చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి.ఇప్పుడు కావాల్సిన పదార్దాలకు సరిపడా ఆయిల్ ను వేసుకోండి,ఆయిల్ వేగాక ఆవాలు,జీలకర్ర మరియు పర్చిమిర్చివేసి ఇవి వేగాక ఉల్లిపాయముక్కలు, కాప్సికమ్ ముక్కలు,అల్లం ముక్కలు,వెల్లుల్లి ముక్కలను మరియు కరివేపాకు కొత్తిమీర వేసి బాగావేగించండి.రుచికి సరిపడా ఉప్పును మరియు మిరియాలపొడిని వేసి వేగించిన మిశ్రమాన్ని బాగా కలపండి.
😋ఈ వేగిన మిశ్రమంలో ముందుగా ఉడకబెట్టుకొన్న రైస్ ను వేసి బాగా కలిపి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి  ఇప్పుడు ముందు తయారు చేసుకొన్న ఎగ్ ఫ్రై ని అందులో కలపండి.కోడిగుడ్డను చెదిరిపోకుండా కలపండి.ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి బొయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ను ప్లేట్ లో పెట్టుకొని రుచిచూడండి.ఇందులోకి నేను ఐతే రెడ్ చిల్లి సాస్ వేసుకొని తిన్నాను బాగా రుచిగా ఉంది.నేను పచ్చి  ఉల్లిపాయ ముక్కలను నంచుకుని తిన్నాను తినేటప్పుడు ఈ అల్లం మరియు వెల్లుల్లి ముక్కలు రైస్ తో కలవడం వల్ల రుచికి చాలా బాగుంది.





బొయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ను అందించిన కట్ట పవన్ కుమార్ గారికి ధన్యవాదాలు.


Post a Comment

4 Comments

మీరిచ్చే ప్రతి కమెంట్ ప్రోత్సాహమే మన సే లౌడ్ తెలుగు కు ఉత్సాహం ......అందుకే కమెంట్ చేయండి మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.