😃😃జంధ్యాల జోక్స్ 😄😍
సంబంధం
పోలీసు స్టేషన్లోకి ప్రవేశించాడు బందిపోటు భీమన్న .పోలీసులందరూ సెల్యూట్లు చేసారు.
"సార్ ..మీ దగ్గర కనీసం 50 లక్షలకు తక్కువ కాకుండా
దోపిడీలు చేసే నేరస్తుల వివరాలు ఇస్తారా ?ఫోటో ఉంటే మంచిది
యస్సైని అడిగాడు.
"ఎందుకు బీమన్నా ?"ఆప్యాయంగా అడిగాడు యస్సై .
"ఏం లేదు అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం.
కాస్త హైక్లాస్ సంబంధాలైతే ఇద్దామనుంది"చెప్పాడు భీమన్న.😄
సహనం
"సార్..ఈ ఉద్యోగం పెళ్లైనవారికి మాత్రమే ఇస్తామంటున్నారు.
ఒక వేళ బ్యాచలర్ ఎవరైనా అబద్దం చెప్పి చేరితే ....?
సందేహం వెలిబుచ్చాడు మేనేజర్ ప్రొప్రయిటర్ ముందు.
"నేనంత పిచ్చోన్నోయ్ మేనేజరూ.....నేను తిట్టే తిట్లకు పెళ్లికానివాడు
ఒక్క రోజు కూడా పనిచెయ్యడు.పెళ్లైన వాడికి ఇంట్లో పెళ్ళాం తిట్లు
అలవాటై ఉంటాయి కాబట్టి సహనం ఎక్కువగా ఉంటుంది."
నవ్వుతూ చెప్పాడు ప్రొప్రయిటర్😄.
😝😃😄😃😄😜😄😃😄😃😝
సంపాదించా
ఈ సిటీకి వచ్చినప్పుడు ఒకే ఒక చొక్కాతో వచ్చాను.ఈ పదేళ్లలో పదిలక్షలు సంపాదించా "
మీసాలు మెలేస్తూ చెప్పాడు" పుల్లయ్య
అయ్యబాబోయ్ ..పదిలక్షలే !
అన్ని చొక్కాలు ఏం చేసుకొంటారు సార్ ?"
అడిగాడు ఆచారి😄.
సుఖం
"నువ్వు ప్రేమించేవాడికన్నా నిన్ను ప్రేమించేవాడిని చేసుకొంటే
సుఖపడతావు.ఆలోచించుకో "
కూతురుతో చెప్పింది తల్లి.
"అదంతా పాతకాలం మమ్మి.
నువ్వు వంట చేసి పెడితే తినేవాడికన్నా నీకు చేసి పెట్టేవాడిని
చేసుకొంటే సుఖపడతావు అనాలి"
సవరించింది కూతురు.
"నేను చెప్పేది కూడా అదే తల్లీ " అన్నది తల్లి😎.
😄😃😜😄😜😃😄😂
రహస్యం
"నీ బట్టలు అంత తెల్లగా ఉంటాయి .....ఎలా ఉతుకుతావు?
అడిగింది శ్వేత.
"ఏమో ...నే 😐 నాకేం తెలుసు.మా ఆయనను అడగాలి " చెప్పింది స్వాతి.
వదులు
"ఒసేయ్ హారికా ....నా బాయ్ ఫ్రెండు చూడు
నా వేలికి ఉంగరం తొడిగాడు"
మురిసిపోతూ చూపించింది మౌనిక.
"అవును ఇదే.మొన్న నా వేలికి తొడిగి వదులైనదని
చాలా బాధపడ్డాడు పాపం"
అన్నది హారిక.
😗😄😃😎😂😆😍
అనుకోను
"అమ్మా ... మా షాపులో ఉన్న చీరలన్నీ చూపించాము"
అన్నారు ఆయాసంతో.
"పర్వాలేదు.పక్క షాపు నుండి తెప్పించండి.
ఆలస్యమైనా నేనేమీ అనుకోను"చెప్పింది అమల😄
ఏమౌతాయి ?
"రాము ...కోడిగుడ్డులో ఉండే తెలుపు,పసుపు,నలుపు పదార్ధాలన్నీ
21 రోజుల తర్వాత ఎలా రూపాంతరం చెందుతాయి?"
అడిగాడు టీచర్.
"ఆమ్లెట్లుగా సార్ "చెప్పాడు రాము.
😃😄😃😄😃😄😃😄😃😄
ఫరవాలేదు
డాక్టర్ వద్ద మందులు తీసుకొని బయటకు వెళ్తున్నది సుగుణ.నర్సు పరుగెత్తుకొచ్చింది.
"మేడం..మేడమ్ ...డాక్టరుగారు ఒక మాత్రకు బదులు పొరపాటున
మరొక మాత్ర ఇచ్చారట. అది మింగితే ప్రాణాపాయమట.
దాన్ని తీసుకురమ్మంటున్నారు".కంగారుగా చెప్పింది నర్సు.
"ఫరవాలేదు సిస్టర్..ఈమాత్ర మా అత్తగారికేలే."
అంటూ ఆటో ఎక్కింది సుగుణ.
రక్తం
"అబ్బాయి చాలా మంచివాడు.
రోజుకు పది మంది రక్తమైన కళ్లచూస్తాడు"
చెప్పాడు పేరయ్య.
"అయ్యబాబోయ్ ...
ఇదేం సంబంధమండీ పేరయ్యగారూ మాకొద్దు"
భయంగా చెప్పింది వసుంధర.
"అబ్బాయి ల్యాబ్ టెక్నిషియన్ తల్లీ .
నవ్వుతూ చెప్పాడు పేరయ్య.
😄😉😃😎😅😅😍😍😍మేకప్
"విన్నావా సుందరోధినా ..అమెరికాలో ఎవరో ఒకాయనయాబై ఏళ్ళదాన్ని పాతికేళ్ల దానిలా మార్చేమందు కనిపెట్టాడట!
ఏం వింత?" అన్నది ఆండాళు.
"ఇదేం గొప్ప మా ఆయన తలచుకొంటే డెబ్భైఎల్లాదాన్ని
పదహారేళ్ళ పాపాయిని చెయ్యగలడు"చెప్పింది సుందరి.
"మీ ఆయన కూడా సైంటిస్టా ?
"కాదు మేకప్ మాన్ "
చెప్పింది సుందరి.
జాగరణ
"ఏంటి వసుధా ...అంత నీరసంగా ఉన్నావు?'
అడిగింది మీనా.
"మా వారికి టైఫాయిడ్ కదా.
రెండు రాత్రులు జాగరణ చెయ్యాల్సివచ్చిందోడినా"చెప్పింది వసుధ.
"అదేంటి...ఆయన్ను చూడటానికి నర్సును అప్పోయింట్ చూసారుగా?"
"నర్సును పెట్టాను కాబట్టే
నేను మేలుకొని ఇద్దరినీ కనిపెట్టవలసివచ్చింది"
నీరసంగా అన్నది వసుధ.😕
😃😃😎😂😅😆😄😉😃😂😎
డిగ్రీలు
"హమ్మయ్య ..ఎలాగైతేనేం.మూడేళ్లు కష్టపడిఒక డిగ్రీ సంపాదించాను.
"ఓస్ ..ఇంతేనా...పొద్దున నేను డాక్టరు దగ్గరకు వెళ్తే
నూట మూడు డిగ్రీలని చేప్పాడు ."
సిరా
"నాన్నా...సిరా అంత ఖరీదైన పదార్డమా?
అడిగాడు బాబి.
"హబ్బే ....వందరూపాయలిస్తే సీసా వస్తుంది"
చెప్పాడు తండ్రి.
"మరైతే ఆ సిరా చీరమీద ఒలగబోశానని
అమ్మ నన్ను చితకబాదిందేందుకు?"
అడిగాడు బాబి.
😄😎😎😎😎😍😍😂😂😆😆😃పిసినిగొట్టు బేరం
"ఈ చెప్పలేంతబాబూ? ఎన్నాళ్ళొస్తాయి?"వందరూపాయలు.మూడునెలలొస్తాయి"
"మూడొందలు ...ఆర్నెల్లోస్తాయి. మీకేవి కావాలి?"
"అబ్బే..నాకేవీవద్దు.చెప్పులువడకపోతే
సంవత్సరానికి ఎంత మిగులుతుందాని....అడిగా"😂
దయ
"నా భార్య ఎంతో దయగలిగినది.అటువంటి పెళ్ళాం ఎవరికీ రాదు.
నన్ను అన్యాయం చేసిపోయింది."
వలవల ఏడుస్తున్నాడు వల్లభాచార్య.
"ఏంటి ఆమె చూపించే దయ?"
అర్ధంకాక ప్రశ్నించాడు ఓదార్చడానికి వచ్చినాయన.
"ఎప్పుడైనా కోపం వచ్చినన్ను కొట్టడానికి చీపురుకట్ట ఎత్తితే
మొదలువైపుతో కొడితే దెబ్బలు బాగా తగుల్తాయని
కుంచెవైపుతో కొట్టేది."భోరుమన్నాడు వల్లభాచార్య😄.
"భర్త చనిపోయాడని ఆవిడ చూడు
ఎలా ఏడుస్తుందో పాపం!"
జాలిగా అన్నాడు భర్త ఎదురింటి సుబ్బలక్ష్మిని చూసి.
"చల్లేండి సానుభూతి!
మీరు పోతే నేను అంతకంటే పెద్దగానే ఏడుస్తాను"
అక్కసుగా అన్నది భార్య.😗
ఎలా
"మీరు పెద్దగా చదువుకోలేదంటున్నారు
అయినా ఇన్ని ప్రేమకథలు ఎలా వ్రాయగలిగారు?
విలేకరి అడిగాడు చంద్రకాంత్ ను
"ఇంతకుముందు నేను దాదాపు పది సంవత్సరాలు
ఇందిరా పార్కులో ముంతకింద ముద్దపప్పు అమ్మేవాడిని.
అప్పటి ఐడియాలతో....."చెప్పాడు చంద్రకాంత్😊.
😃😄😃😄😎😆😊😃😉😄😃😎
సరైనవాడు
అభిరాం భార్య ఎక్కడో తప్పిపోయింది.వెతుకుతూ వెతుకుతూఓ రామాలయం చేరాడు.
"రామా..ఇక వెతకడం నా వల్ల కాదు.ఆమె ఎక్కడుందో నువ్వేచెప్పు"
విగ్రహం ముందు మొరపెట్టుకున్నాడు.
రాముడు ప్రత్యక్షమైయ్యాడు.
"నాయనా....నా గుడికి వెనుక ఆంజనేయుడి దేవాలయం ఉంది.
వెళ్లి ఆయననడుగు. నా భార్య తప్పిపోయినపుడు
ఆయనే వెతికి పెట్టాడు"చెప్పి మాయమయ్యాడు😇
కారణం
"చేతికి కట్టు ఏమిటి గురూ?ఏదైనా యాక్సిడెంటా?
అడిగాడు మూర్తి.
"మా ఆవిడ కింద పడింది"చెప్పాడు గురు.
"మీ ఆవిడకింద పడితే నీ చెయ్యి విరగడం ఏమిటోయ్ విదూరం?"
"నా చెయ్యి మా ఆవిడకింద పడింది. దాంతో బోన్ విరిగింది"
అప్పు తెలివి
"ఏమిట్రా విచిత్రం? అందర్నీ జలగలా పట్టుకొని కవితలు వినిపించే
మాధవరావు మీ వద్దకు ఇలావచ్చి అలా పారిపోతున్నాడు?"
ఆర్చ్యర్యముగా అడిగాడు లింగమూర్తి సాయిబాబాను.
"ఏం లేదు. నేను ఎవరికి ఎంత అప్పులున్నానో,
ఇంకా ఎంత అప్పు కావాలో ఊరికే ఓ మాట అన్నాను.
దాంతో పారిపోయాడు"
నవ్వుతూ చెప్పాడు సాయిబాబా.
పవర్
"మా ఆవిడ కన్నా నాకే పవర్ ఎక్కువ"
గర్వంగా చెప్పాడు చలపతి.
"వెర్రిగూడ్... చాలా గొప్పవిషయం. ఇన్నాళ్ళ నుంచీ నాకు తెలియదు"
అన్నాడు తిరుపతి.
"నాకు తెలియదు. మొన్న కాళ్ళ డాక్టర్ చేపియిందాకా"
ముక్తాయించాడు చలపతి.
![]() |
click on image for jokes☝ |
👉ఎమెస్కో బుక్స్ పబ్లిష్ చేసిన జంధ్యాల జోక్స్ నుండి ఇవి గ్రహింపబడినవి.
👇మీ అభిప్రాయాలను క్రింద కామెంట్స్ రూపం లో తెలియచేస్తూ మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయగలరని ఆసిస్తూ....మీ సే లౌడ్ తెలుగు 👩
1 Comments
Thank you..
ReplyDeleteమీరిచ్చే ప్రతి కమెంట్ ప్రోత్సాహమే మన సే లౌడ్ తెలుగు కు ఉత్సాహం ......అందుకే కమెంట్ చేయండి మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.