కావలసినపదార్ధాలు :
పర్చిమిర్చి
ఆయిల్
క్యాప్సికమ్
బంగాళాదుంపలు
అల్లం వెల్లుల్లి పేస్ట్
టమాటో
ఉప్పు
నెయ్యి
లవంగాలు
బిరియాని ఆకు
గరంమసాలా
రైస్
తయారుచేయువిధానం :
ముందుగా మనం బంగాళాదుంపలు,ఉల్లిపాయలు,తాజా క్యాప్సికమ్,టొమాటోలను బాగా కడిగి తరిగిపెట్టుకోవాలి.పైన తెలిపిన కావలసిన పదార్ధాలన్నీ రెడీ చేసుకుందాం.ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి లో మూడు స్పూన్ల నెయ్యి వేసి మరియు మూడు స్పూన్ల ఆయిల్ వేసి బిరియాని ఆకు,లవంగాలు వేసి వేగించాలి.ఉల్లిపాయలు,బంగాళాదుంపలు రెండునిముషాలు వేగించి తరువాత టమాటో పర్చిమిర్చి వేయాలి.టమాటో గుజ్జుగా వేగాక,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి.ఇప్పుడు కాప్సికం ముక్కలను వేసి పచ్చివాసన పోయేవరకు వేగించి కొంచెం నీటిని పోసి రుచికి సరిపడా ఉప్పు ను వేయాలి.ఒక రెండు నిమిషాల పాటు మూతపెట్టి కాప్సికం ఉడికే వరకు ఉంచండి.ఇప్పుడు ఒక స్పూన్ గరంమసాలను కలపండి.ఇప్పుడు మనకు కాప్సికం మసాలా రెడీపోయింది.దీనిని రైస్ లో కలుపుకోవాలి.
రైస్ తయారీవిధానం :
ఒక గ్లాస్ రైస్ కి రెండుగ్లాసుల నీటిని పోసి రైస్ కుక్కర్ లో ఉడికించండి.
అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారీవిధానం :
500grams రైస్ కి 50 గ్రాముల అల్లం కి 25గ్రాముల తెల్లగడ్డలు (వెల్లుల్లి)
ఈ రెసిపీ విధానాన్ని మాకు అందించిన సువర్ణ గారికి మా ధన్యవాదాలు.మీరు కూడా మీకు నచ్చిన రెసిపీ విధానాలను పంపాలనుకొంటే మమ్మల్ని సంప్రదించగలరు.
1 Comments
Nice recepie
ReplyDeleteమీరిచ్చే ప్రతి కమెంట్ ప్రోత్సాహమే మన సే లౌడ్ తెలుగు కు ఉత్సాహం ......అందుకే కమెంట్ చేయండి మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.