Ticker

7/recent/ticker-posts

Rabindranath Tagore Inspirational Quotes In Telugu | Sayloudtelugu

రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన జీవిత సత్యాలు 


visvakavi_Rabindranath Tagore quotes in telugu_sayloudtelugu


👉 మనది కాని వాటిపై వ్యామోహం పెంచుకోవడం మూర్ఖత్వం.
👉భయంతో ఉన్నవాళ్ళు ఏది సాధించలేరు. 
👉నిరంతరం నేర్చుకొనే ఉపాధ్యాయుడే మంచి విద్యావంతులను తయారు చేయగలడు.
👉అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్ధులకు అవకాశాలుగా కనిపిస్తాయి.
👉జీవితంలో వైఫల్యాలు భారమని గ్రహించే వారు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవచ్చు. 
👉నిన్ను నువ్వు తక్కువగా చేసుకోకు.. అది పాపం,ఆత్మ కంటే ఘోరం!
👉వాస్తవాలు చాలా ఉంటాయి,కానీ నిజం మాత్రం ఒకటే ఉంటుంది. 
👉సూర్యుడు మీ జీవితం నుండి పోయినందున మీరు ఏడిస్తే,మీ కన్నీళ్లు నక్షత్రాలను చూడకుండా అడ్డుపడతాయి... 
👉చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం. 
👉ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం కూడా ఉంటుంది.
👉మంచిని పెంచుతానంటూ పరుగులు తీసే వ్యక్తికి తాను మంచిగా ఉండేందుకు తీరిక దొరకదు. 
👉అజ్ఞానం విజ్ఞానం వైపుకు దారి తీసే అవకాశం ఉంది ... కానీ మూఢవిశ్వాసం పతనం వైపు నడిపిస్తుంది. 
👉కోపం మనసులో కాదు,మాటల్లో మాత్రమే ఉండాలి ..ప్రేమ మాటల్లోనే కాదు,మనసులో కూడా ఉండాలి..!
👉ప్రయత్నం చేసి ఓడిపో.. కానీ ప్రయత్నం చెయ్యడంలో మాత్రం ఒకడిపోవద్దు..
👉కళ్ళకి రెప్పలు ఉన్నట్లే పనికి విశ్రాంతి ఉండాలి... 
👉ప్రేమ నీలో ఉంటే నీకు లభించే సంపద పవిత్రత.
👉శాంతంగా ఉండే వారి మనసు స్వర్గం వంటిది.
👉ప్రేమ కేవలం ప్రేరణ కాదు అది నిజమును కలిగి ఉంటుంది. 
👉అందం అంటే ప్రేమ కళ్ళతో కనిపించే వాస్తవికత.. 
👉జీవితంలో ..ప్రతిరోజూ క్రితం రోజు కన్నా కాస్తో.. కూస్తో ఎక్కువ విషయాలు నేర్చుకోవాలి. 
👉స్నేహం యొక్క లోతు పరిచయం యొక్క పొడవుపైన  ఆధారపడదు.
👉ఒడ్డున నిలబడి నీటిని చూస్తూ ఉంటే ఎప్పటికీ నదిని దాటలేరు. ప్రయత్నం చేస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. 
👉కొన్ని వయసుల్లో ప్రతి విషయాన్నీ అవగాహన చేసుకోనక్కర్లేదు.
👉ప్రమాదాలు నివారించాలని ప్రార్దించరాదు వాటిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వాలని ప్రార్ధించండి.
👉సంతోషంగా ఉండడం చాలా సులభం ,కానీ సరళంగా ఉండడం చాలా కష్టం. 
👉ఏదైనా పొందాలంటే దానికి పూర్తి ధర చెల్లించాలి. 
👉మనం ఈ ప్రపంచాన్ని ప్రేమించినపుడు మాత్రమే ఈ ప్రపంచంలో జీవించగలం.
👉ప్రేమ అనేదానికి బహుమతిగా ఇవ్వలేం అది స్వీకరించడానికి ఎదురుచూస్తూ ఉంటుంది. 
👉సంగీతం ద్వారా మనం ఆత్మల మధ్య అంతరాన్ని పూరించగలం. 
👉మీ మనస్సు కత్తి లేదా బ్లేడ్లాంటిది మీరు దానిని సరిగా ఉపయోగించకపోతే అది మీకు హాని కలిగిస్తుంది.
👉ప్రేమ హక్కులను అడుగదు కానీ స్వేచ్యను ప్రసాదిస్తుంది.
👉నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే.. విజయం పది అడుగులు ముందుకు వస్తుంది. 
👉కళ అనేది మనిషియొక్క సృజనాత్మక ఆత్మకు సంబందించిన వాస్తవిక పిలుపుకు ప్రతిస్పందన.
👉మనం వినయంతో మెలిగినపుడు మాత్రమే గొప్పతనానికి దగ్గరవుతాం.
👉మీరు చేసే అన్నితప్పులకీ తలుపులు మూసివేస్తే సత్యం బయటనే ఉండిపోతుంది.
👉ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో,
ఎక్కడ మనిషి గర్వంగా తలెత్తుకొని తిరగగలడో,
ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలైపోయి మగ్గిపోదో,
ఎక్కడ మన చదువూ విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో,
ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో,
అక్కడ ఆ స్వేఛ్ఛా స్వర్గంలోకి నా దేశాన్ని మేలుకొలుపు.. 
👉ఐక్యతలో ఉన్న ప్రాముఖ్యత శాశ్వతమైనది. 
👉అబద్ధము శక్తిని పొందినంత మాత్రాన, అబద్ధము ఎన్నడూ నిజం కాదు. 
👉నవ్వడంతో స్వీయ భారం తగ్గిపోతుంది. 
👉వెలిగే దీపమే ఇతర దీపాలను వెలిగించినట్లు,నిరంతరం నేర్చుకొనేవారే ఇతరులకు జ్ఞానాన్ని పంచగలరు. 
👉ప్రేమ గుణం బాగా పెరిగితే లభించే సంపద పవిత్రత.
👉అత్యున్నత విద్య మనకు సమాచారం ఇవ్వడమే కాక,మన జీవితాన్ని మరియు మన ఉనికికి అనుగుణంగా చేస్తుంది. 

జవహర్లాల్ నెహ్రూ గురించి క్లిక్ హియర్ 👈

Post a Comment

0 Comments