జవహర్ లాల్ నెహ్రూ గురించి క్లుప్తంగా కొన్ని మాటలు:
జవహర్ లాల్ నెహ్రూ 14 నవంబర్ 1889 సంవత్సరంలో బ్రిటిష్ రాజ్యంలో ఉన్న అలహాబాద్ (ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ )జిల్లాలో జన్మించాడు. నెహ్రూ మోతిలాల్ నెహ్రూ మరియు స్వరూపా రాణి తుస్సు దంపతులకు జన్మించారు. నెహ్రూ తండ్రి ఒక న్యాయవాది.
జవహర్ లాల్ నెహ్రూ గారికి ఈయనకు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. ఒక చెల్లెలు "విజయలక్ష్మి" యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క మొదటి మహిళా ప్రెసిడెంట్ గా ఉన్నారు. రెండవ చెల్లెలు "కృష్ణ హుతీ సింగ్" తన సోదరుడైన నెహ్రూ పై పుస్తకాలు రాసి ప్రముఖ రచయిత్రి అయినది.
ఉన్నత విద్య కోసం, యువ నెహ్రూను హారో పాఠశాలకు, తరువాత ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి నాచురల్ సైన్సెస్ లో డిగ్రీ పొందడానికి పంపారు. లండన్ లోని ఇన్నర్ టెంపుల్ లో రెండు సంవత్సరాలు గడిపిన తరువాత, అతను బారిస్టర్ గా అర్హత సాధించాడు. లండన్ లో ఉన్న సమయంలో నెహ్రూ సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, చరిత్ర వంటి అంశాలను అధ్యయనం చేశారు.జవహర్ లాల్ నెహ్రూ గారు ఉదారవాదం, సోషలిజం, జాతీయవాదం వంటి భావాలకు ఆకర్షితుడయ్యాడు.
నెహ్రూ 1916 ఫిబ్రవరి 8న కమలా కౌల్ ను వివాహం చేసుకున్నారు. 1917 నవంబరు 19న ఆమె ఒక కుమార్తెకు జన్మనిచ్చింది, ఆమె ఇందిరా ప్రియదర్శిని అని పిలువబడింది.1921 సహాయ నిరాకరణోద్యమ కాలంలో కమల అలహాబాద్ లో విదేశీ వస్త్రాలు, మద్యం విక్రయించే దుకాణాలను, మహిళల బృందాలను ఏర్పాటు చేసి కీలక పాత్ర పోషించారు. జవహర్ లాల్ నెహ్రూ జైలులో ఉండగా 1936 ఫిబ్రవరి 28న కమల స్విట్జర్లాండ్ లో క్షయవ్యాధితో మరణించారు.
జైలులో ఉండే నెహ్రూ గారు డిస్కవరీ అఫ్ ఇండియా,గ్లిమ్స్ అఫ్ వర్డ్ హిస్టరీ అనే రెండు గొప్ప పుస్తకాలు రాసారు. చివరకు స్వతంత్రం కోసం పోరాటం చేసున్న భారతీయులకు ఆంగ్లేయులు తలవంచక తప్పలేదు. 1947 లో మన దేశాన్ని వదలిపోయారు.వెళుతూ వెళుతూ మన దేశాన్ని ఇండియా పాకిస్తాన్ అనే రెండు దేశాలుగా విడగొట్టిపోయారు.
భారతదేశ తొలి ప్రధాన మంత్రిగా నెహ్రూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నెహ్రూగారు చాలా నేర్పుగా నైపుణ్యంగా మన దేశాన్ని నడిపాంచారు.అమెరికా రష్యాల మధ్య ప్రత్యన్న యుద్ధం నడుస్తున్నపుడు నెహ్రు అలీనోద్యమం పేరుతో మిగతా దేశాలన్నిటిని కూడగట్టారు.
నాయకత్వపు బాధ్యలతో క్షణం తీరికలేనప్పటికీ జవహర్ లాల్ నెహ్రూ గారికి పిల్లలతో గడపడం అంటే ఇష్టం.పిల్లలు తన సొంత బాబాయిగా భావించి "చా"చా అని పిలిచేవారు.మన దేశానికి బాలల దినోత్సవం కావాలి అనుకున్నపుడు నెహ్రు పుట్టిన తేదీనే బాలల దినోత్సవం జరపాలని ఎంచుకొన్నారు.
చిల్డ్రన్స్ డే ఏరోజో మీకు తెలుసా?
చిల్డ్రన్స్ డే చరిత్ర :
గాంధీ మార్గదర్శకత్వంలో నెహ్రూ 1947లో భారత స్వాతంత్ర్య పోరాటానికి నేతృత్వం వహించారు. స్వతంత్ర భారతదేశానికి సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక గణతంత్ర వ్యవస్థకు పునాది వేశాడు. ఇందుకు నెహ్రూ ఆధునిక భారతదేశ రూపశిల్పిగా గుర్తింపు పొందారు.
1964లో జవహర్ లాల్ నెహ్రూ మరణానంతరం ఆయన జయంతిని బాలల దినోత్సవంగా ప్రకటిస్తూ ఆయనను గౌరవించాలని పార్లమెంటులో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
అయితే 1964లో జవహర్ లాల్ నెహ్రూ మరణానంతరం ఆయన వారసత్వానికి గుర్తుగా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. పిల్లలు ప్రేమగా చాచా నెహ్రూ అని పిలుచుకునే నెహ్రూకు చిన్నపిల్లలంటే అమితమైన ప్రేమ. పిల్లలే దేశానికి అసలైన బలమని, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, సంరక్షణ అందించడమే అభివృద్ధి చెందిన భారత్ తన లక్ష్యమని ఆయన విశ్వసించారు.
జవహర్ లాల్ నెహ్రూ పేరుతో కొన్ని ప్రశ్నలు మరియు జవాబులు (Q &A ):
Q ) జవహర్ లాల్ నెహ్రూ ఎప్పుడు జన్మించాడు?
A )నవంబర్ -14,1889
Q ) జవహర్ లాల్ నెహ్రూ బిరుదు ఏమిటి?
A )చాచా ,శాంతిదూత
Q ) జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని ఏ దినోత్సవంగా జరుపుకొంటారు?
A )బాలల దినోత్సవంగా
Q ) జవహర్ లాల్ నెహ్రూ రచించిన ప్రముఖ గ్రంధం పేరు ఏమి?
A )డిస్కవరీ అఫ్ ఇండియా
Q ) జవహర్ లాల్ నెహ్రూ కాంగ్రెస్ సమావేశాలకు తొలిసారిగా ఎప్పుడు అధ్యక్షత వహించాడు?
A )1929వ సంవత్సరంలో
Q ) జవహర్ లాల్ నెహ్రూ మొత్తం ఎన్నిసార్లు కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించాడు?
A )ఆరు సార్లు
Q ) జవహర్ లాల్ నెహ్రూ మరణించే నాటికి ఏ లోక్ సభ నియోజక వర్గానికి ప్రతినిత్యం వహిస్తున్నారు?
A )ఫూల్పూర్ నియోజకవర్గం
Q ) జవహర్ లాల్ నెహ్రూ భార్య పేరు ఏమి?
A )కమలాబాయి
Q ) జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె పేరు ఏమిటి?
A )ఇందిరాగాంధీ
జవహర్లాల్ నెహ్రూ గారి స్ఫూర్తిదాయక మాటలు:
లక్ష్యాన్ని సాధిచలేని జ్ఞానం నిరుపయోగమైనది.
వైఫల్యం ఎదురవగానే నిరాశ చెందకూడదు అది కొత్త ప్రేరణకు నాంది కావాలి.
సమయానికి కొలమానం సంవత్సరాలు గడిచిపోవడం కాదు... ఆ కాలంలో మనం ఏం సాదించామనేది ముఖ్యం
మితిమీరిన విశ్రాంతి అన్ని విధాలా అనర్ధం!
ఎదురుదెబ్బలు తిని కూడా జాగ్రత్త పడని వ్యక్తి తరువాత గట్టి దెబ్బ తింటాడు. అప్పుడు లేచి సంబాళించుకోవడం కూడా కష్టమవుతుంది.
చిన్నప్పుడు మంచి అలవాట్లు చేసుకుంటేనే పెద్దయ్యాక గొప్ప లక్ష్యాలను సాధించగలరు.
పరాయి వాళ్ళ దివ్య సౌధాలలో జీవించడం కన్నా సొంతదైన పూరి గుడిసెలో నివసించడం మిన్న..
పనిని అభిమానించడం మొదలుపెడితే విజయం దానంతట అదెవస్తుంది.
ధైర్యం పనులను చేపట్టేవారిని విజయం వరిస్తుంది. ఫలితం ఎలా ఉంటుందో అని భయపడే పిరికివారిని విజయం వరించదు.
చరిత్ర చదవడమే కాదు సృష్టించాలి
ఎంత గొప్పవారినైనా విమర్శించడం చాలా సులువు.... ఒళ్ళు వంచి ఏ చిన్న పనిని అయినా చేయడం కష్టం
హృదయంలో మాలిన్యంఉన్న మనిషి ఆరోగ్యవంతంగా ఉండలేడు.
జ్ఞానం వలన మాత్రమే మన ఉనికిని ఊహిచగలం
చాలా జాగ్రత్తగా ఉండాలనే విధానం అన్నింటికంటే పెద్ద ప్రమాదం.
సంస్కృతి అంటే మనస్సును, ఆత్మను విస్తరింపజేయడం.
పెట్టుబడిదారీ సమాజంలోని శక్తులను అదుపుచేయకుండా వదిలేస్తే, ధనవంతులను ధనవంతులుగా, పేదలను మరింత పేదలుగా మారుస్తారు.
రవీద్రనాద్ ఠాగూర్ కొటేషన్స్ చదువుతుకు క్లిక్ హియర్ 👈
0 Comments
మీరిచ్చే ప్రతి కమెంట్ ప్రోత్సాహమే మన సే లౌడ్ తెలుగు కు ఉత్సాహం ......అందుకే కమెంట్ చేయండి మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.