101 తెలుగు సామెతలు !!!!!
Telugu Proverbs sayloudtelugu |
1. అరచేతిలో వెన్నబెట్టుకొని ... నేతి కోసం ఊరంతా తిరిగినట్లు
2. ఆగ భోగాలు అంకాళమ్మవి... పొలికేకలు పోలేరమ్మవి.
3. ఇంటికి ఇత్తడి... పొరుగుకు పుత్తడి
4. ఉసిరికాయంత తగవు... ఊరికి తాటికాయంత అవుతుంది.
5. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసింది.
6. ఆదిలోనే హంసపాదు
7. అందితే తల,అందకపోతే కాళ్ళు
8. ఇంట గెలిచి రచ్చ గెలువు
9. గుడ్డు వచ్చి పిల్లని వెక్కిరించినట్లు
10. చేప పిల్లకు ఈత నేర్పాలా?
11. తానుపట్టిన కుందేలుకు మూడేకాళ్ళు
12. దూరపు కొండలు నునుపు
13. నడమంత్రపుసిరి నరాలమీదపుండు.(నడమంత్రపు సిరి నరాలమీది పుండు భరించరానివి)
14. దేముడు వరమిచ్చినా పూజారి వరమియ్యడు
15. దిక్కులేని వారికి దేవుడే దిక్కు.
16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు?
17. ఆడలేనమ్మ మద్దెలు వద్దన్నట్లు..
18. ఎవడికంపు వారికి ఇంపు
19. కొత్తబిచ్చగాడు పొద్దెరగదు.
20. గబ్బిలాయి మొగం నవ్వినా ఒకటే,ఏడ్చినా ఒకటే
21. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగవు.
22. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత !
23. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
24. అరనిమిషం తీరికాలేదు అరకాసు సంపాదనా లేదు !
25.చదివేది రామాయణం పడగొట్టేది దేవాలయం !!
26. నెమలి కంట నీరు వేటగాడికి ముద్దా?
27. పంది ఎంత బలిసినా నంది కాదు
28. మంచి కొంచెమైనా చాలు ,విత్తనం చిన్నదయినా చాలు
29. నొసట నామాలు నోట బండబూతులు
30. తింటే ఆయాసం తినకుంటే నీరసం
31.కొంగ జపము చేపల కొఱకే
32. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
33. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
34. ఎనుబోతు మీద వానకురిసినట్లు
35. చెవిటి వాని ముందు శంఖమూదినట్లు
36. కత్తి పోటు తప్పినా కలం పోటు తప్పదు.
37. కుక్క కాటుకు చెప్పు దెబ్బ
38. అయితే ఆదివారం కాకుంటే సోమవారం
39. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
40. అనువుగాని చోట అధికులమనరాదు
41. ఇల్లు పీకి పందిరేసినట్లు
42. అంచుదాబేకాని,పంచెడాబు కాదు
43. అందరికీ శకునం చెప్పేబల్లి తానుపోయి కుడితిలో పడ్డట్లు.
44. అంకెలేని కోతి లంకంతా చెరచిందట.
45. అంత్య నిష్ఠూరంకన్నా ఆది నిష్ఠూరం మేలు
46. అండలుంటే కొండలు దాటవచ్చు.
47. అందని మామిడిపండ్లకు అర్రులు సాచినట్లు
48. ఎవరికి వారే యమునా తీరే
49. కోటి విద్యలు కూటి కొరకే
50. గుర్రం పని గుర్రం చేసుకోవాలి గాడిద పని గాడిద చేసుకోవాలి.
51. కోటి విద్యలు కూటి కొరకే
52. అత్తవారింటి ఐశ్వర్యంకన్నా పుట్టింటి గంజి మేలు
53. అత్త మీద కోపం దుత్త మీద తీర్చుకున్నట్లు
54. అన్నప్రాసన నాడే ఆవకాయ పచ్చడి పెట్టినట్లు
55. అడ్డాల నాడు బిడ్డ కానీ ,గడ్డాల నాడు కాదు.
56. వాన రాకడ ప్రాణపోకడ ఎవరికెరుక !
57. సిగ్గులేని వాడికి నవ్వే సింగారం!
58. ఆకలి రుచి ఎరుగదు , నిద్ర సుఖమెరుగదు!
59. మన దీపం అని ముద్దాడితే మూతి కాలకుండా ఉంటుందా!
60. అదృష్టం చెప్పి రాదు -దురదృష్టం చెప్పి పోదు.
61. ఆహారానికి ముందు వ్యవహారానికి వెనక!
62. సముద్రం కన్నా సహనం పెద్ద
63. అడిగే వాడికి చెప్పేవాడు లోకువ
64. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నాడట.
65. గుడిని గుడిలో లింగాన్ని మింగినట్లు
66. నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు
67. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ .
68. ఆరునెలలు సహవాసం చేస్తే, వారువీరవుతారు.
69. ఆరంభ సూర్యుడికి ఆర్భాటం ఎక్కువ.
70. ఆవు నలుపైతే పాలు నలుపా?
71. ఆ వూరికి ఈ వూరు ఎంతదూరమో,ఈ వూరికి ఆ వూరు అంతే దూరం.
72. ఆకార పుష్టి నైవేద్య నష్టి
73. ఆపదలో ఆదుకొనేవాడే చుట్టం.
74. ఆశ సిగ్గేరుగదు, నిద్ర సుఖమెరుగదు
75. అమాయకుడికి అక్షింతలు ఇస్తే అవతలికెళ్ళి నోట్లో వేసుకొన్నాడట!
76. ఆవలింతకు అన్న ఉన్నాడు కానీ,తుమ్ముకు తమ్ముడు లేదంట!
77. అన్నీ తెలిసినమ్మ అమావాశ్య నాడు చస్తే , ఏమీ తెలియనమ్మ ఏకాదశి నాడు చచ్చిందట !
78. పొమ్మనలేక పొగబెట్టినట్లు
79. ఊరి కొక కోడి ఇస్తే, ఇంటి కొక ఈక అంట!
80.పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికి పెట్టిందట !
90. అందని ద్రాక్షలు పులుపు
91. అడగందే అమ్మయినా అన్నం పెట్టదు .
92. ఆలస్యం అమృతం విషం.
93. పరుగెత్తి పాలు తాగే కంటే నిల్చి నీళ్ళు తాగడం మేలు
94. చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు
95. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరచిందట!
96. అబద్దమైన అతికినట్లు ఉండాలి!
97. పొరుగింటి పుల్లకూర రుచి
98. అగ్నికి వాయువు తోడైనట్లు
99. వెంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చింది
100. మింగనుమెతుకు లేదుకానీ మీసాలకు సంపంగెనూనె
101. ఇల్లలకగానే పండగ కాదు.
sayloudtelugu లో మరిన్ని తెలుగు సామెతలు చదువుటకు క్లిక్ హియర్ 👈😊
0 Comments
మీరిచ్చే ప్రతి కమెంట్ ప్రోత్సాహమే మన సే లౌడ్ తెలుగు కు ఉత్సాహం ......అందుకే కమెంట్ చేయండి మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.