చమత్కార పొడుపు కథలు
1. అరచేతికింద అరిసె ?
జవాబు :పిడక
జవాబు :పిడక
2. అమ్మంటే అందుతాయి-నాన్న అంటే అందవు?
జవాబు :పెదవులు
3. అనగనగా ఓ అప్సరస-ఆమెపేరులో మధ్య అక్షరం తీసేస్తే మేక?
జవాబు :మేనక
4. ఆ ఆటగత్తె ఎప్పుడూ లోనే నాట్యం చేస్తుంది?
జవాబు :నాలుక
5. అందం కాని అందం ?
జవాబు :పరమానందం
6. ఆకాశం లో అరవై గదులు గది గదికి ఓ సిపాయి ,సిపాయికో తుపాకీ ?
జవాబు :తేనెపట్టు
7. అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు ?
జవాబు :పుట్ట
8. అమ్మ తమ్ముడిని కాదు కానీ నేనూ నీకు మేనమామనే?
జవాబు :చందమామ
9. అంకటి బంకటి కూర,తిన్న తియ్యగున్నది ఇంత పెట్టు?
జవాబు :మీగడ
10. అడవిలో పుట్టింది,అడవిలో పెరిగింది,మా ఇంటికొచ్చింది తైతక్కలాడింది?
జవాబు :కవ్వం
12. ఇల్లు కానీ ఇల్లు ?
జవాబు :బొమ్మరిల్లు
13. ఇంటింటికీ ఒక నల్లోడు?
జవాబు :మసిగుడ్డ
14.ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్య దూలం?
జవాబు :ముక్కు
15. ఈకలు లేని కోడి ఇలెక్కింది?
జవాబు :అనపకాయ ,సొరకాయ
16.ఈనదు,పొర్లదు,బంధం వేస్తే బిందెల పాలిస్తుంది?
జవాబు :తాడిచెట్టు
17. ఈనె లేని ఆకు ?
జవాబు : నీరుల్లి ఆకు
18. ఉన్నవి రెండే కాళ్ళు,రెండూ తొక్కనిదే కదలదు?
జవాబు :సైకిల్
19. ఉడిగి ఉత్తరం చేరుతుంది?
జవాబు :మబ్బు
20. ఊరంతటికి ఒక్కటే దుప్పటి?
జవాబు :ఆకాశం
21. ఊరందరికీ ఒకే దీపం?
జవాబు :చంద్రుడు
22. ఊరంతా తిరిగినా గడప ముద్దొచ్చి ఆగుతాయి?
జవాబు :చెప్పులు.
23. ఎన్ని గొడ్డళ్ళతో నరికినా తెగనిది?
జవాబు :నీడ
24. ఎంత తొక్కినా అణగదు?
జవాబు :నీరు
25. ఎర్రని పండు ఈగైనా వాలదు ?
జవాబు :నిప్పు
26.ఏ గుణాలు కలిగివుంటే మానవుడు అవుతాడు?
జవాబు :సుగుణాలు
27.ఐదుగురిలో చిన్నోడు ,పెళ్ళికి మాత్రం పెద్దోడు?
జవాబు :చితికినవ్రేలు
28. ఒళ్ళంతా కళ్ళు ఉన్నవాడు?
జవాబు :సీతాఫలం
29. ఒంటి కంటి తో చూసేది ఎవరు?
జవాబు :కాకి
30. ఒక్కొక్కడు పోయిన కొద్దీ తోక కొంచెం తగ్గుతుంది?
జవాబు :సూది,దారం
31. ఒక చేత్తో పట్టుకొని,ఒక చేత్తో పెట్టుకునేది?
జవాబు :అద్దం ,బొట్టు
32. అందరాని వస్రాలమీద అన్నీ వడియాలే ?
జవాబు :నక్షత్రాలు
33.కంటికి కనబడుతుంది కానీ గుప్పిట్లో పట్టను వీలుకాదు?
జవాబు :పొగ
34. కరం కాని కరం?
జవాబు :భీకరం
35. కారు కాని కారు?
జవాబు :షావుకారు,షికారు,పుకారు,పట్టకారు.
36. కోడి కాని కోడి?
జవాబు :పకోడీ
37. కోట కాని కోట ?
జవాబు :తులసి కోట
38. కటి కాని కటి /
జవాబు :సంకటి ,చీకటి
39. గ్రామం కాని గ్రామం?
జవాబు :సంగ్రామం
40.గళ్ళు కాని గళ్ళు ?
జవాబు :అంగళ్ళు ,వడగళ్ళు
41. కీలు కాని కీలు ?
జవాబు :వంకీలు,వకీలు,బాకీలు,ఝంకీలు
42. కట్టెలు లేని చెట్టు ?
జవాబు :అరటి చెట్టు
43. కీచు కీచు పిట్టా నేలకేసి కొట్ట ?
జవాబు :చీమిడి
44. గడ కాని గడ ?
జవాబు :తలగడ,మీగడ,లోగడ,రగడ,గడగడ
45. కాలు కాని కాలు?
జవాబు :జుంకాలు,పంకాలు,బాకాలు,టీకాలు
46. కళ్ళు తెరచుకొని నిద్రపోతుంది?
జవాబు :చేప
47. తాళి కాని తాళి ?
జవాబు :ఎగతాళి
48. ధనం కాని ధనం?
జవాబు :ఇంధనం
49. డాలు కాని డాలు ?
జవాబు :అప్పడాలు,తేడాలు,జగడాలు,ఆగడాలు
50. తారు కాని తారు ?
జవాబు :జలతారు.
51. చూస్తే చూపులు,నవ్వితే నవ్వులు,గుద్దితే గుద్దులు?
జవాబు :అద్దం
52. తడిస్తే గుప్పెడు, ఎండితే బుట్టెడు?
జవాబు :దూది
53. టాలు కాని టాలు?
జవాబు :లోటాలు,తూటాలు,గూటాలు
54. జనం కాని జనం?
జవాబు :భోజనం
55. దండం కాని దండం?
జవాబు :కోదండం
56. చెట్టుకు కాయానికాయ,తింటేనే అది కాయని, దాని రుచి తెలుస్తుంది?
జవాబు :మొట్టికాయ
57. చారు కాని చారు?
జవాబు :పచారు
58. దాక కాని దాక ?
జవాబు :వచ్చేదాక, వెళ్ళేదాక,ఎందాక,ఇందాక
59. నారి కాని నారి?
జవాబు :పిసినారి
60. దానం కాని దానం?
జవాబు :నిదానం
61. తొండమున్నా ఏనుగు కాదు,రెక్కలున్నా పక్షి కాదు,ఆరు కళ్ళున్నా చీమ కాదు?
జవాబు :సీతాకోకచిలుక
62. దిబ దిబ లాడేవి రెండు,దిబ్బెక్కి చూసేవి రెండు,అలంకరించేవి రెండు,అందిపుచ్చుకొనేవి రెండు?
జవాబు :కాళ్ళు , కళ్ళు, చెవులు, చేతులు
63. టప టప తలుపులు ఎంత మూసినా చప్పుడు కావు?
జవాబు :కనురెప్పలు
64. లాగి విడిస్తేనే బతుకు?
జవాబు :ఊపిరి
65. నడిచిపోయే నల్లరాతికి నాలుగు లింగాలు?
జవాబు :గేదె
66. పంట కాని పంట?
జవాబు :ఉప్పుపంట
67. పత్రి కాని పత్రి ?
జవాబు :ఆసుపత్రి
68. పురం కాని పురం?
జవాబు :గోపురం,కాపురం
69. పది కాని పది?
జవాబు :ద్రౌపది
70. పైన చూస్తుంటే టెంక పగలకొడితే బొచ్చు?
జవాబు :పత్తికాయ
71.పతి కాని పతి ?
జవాబు :తిరుపతి,పరపతి
72. పాప కాని పాప?
జవాబు :కనుపాప
73. పండు కాని పండు?
జవాబు :విభూతి పండు
74.పాలు కాని పాలు?
జవాబు :పాపాలు,పీపాలు,కోపాలు,తాపాలు,శాపాలు,మురిపాలు,లోపాలు,దీపాలు
75. బారు కాని బారు?
జవాబు :సాంబారు
76.బడి కాని బడి ?
జవాబు :రాబడి,దిగుబడి,కొనుబడి,ఎగుబడి
77. బొట్టు కాని బొట్టు?
జవాబు :తాళి బొట్టు, పచ్చ బొట్టు
78. బాడి కాని బాడి ?
జవాబు :కబాడి,లంబాడి
79. మందు కాని మందు?
జవాబు :కామందు
80. మని కాని మని?
జవాబు :ఆమని
81. మతి కాని మతి?
జవాబు :ఎగుమతి,దిగుమతి,శ్రీమతి
82. మాను కాని మాను?
జవాబు :కమాను
83. ముగ్గురు రాజులకు ఒకటే టోపీ?
జవాబు :తాటిపండు
84. మామ కాని మామ?
జవాబు :చందమామ
85. రణం కాని రణం?
జవాబు :కరణం,మరణం,శరణం,చరణం,కిరణం,తోరణం
86.రాయి కాని రాయి ?
జవాబు :కిరాయి,తురాయి,షరాయి,కీచురాయి
87. వడ కాని వడ?
జవాబు :ఆవడ,పావడ,దవడ
88. వంక గాని వంక?
జవాబు :గోరువంక,నెలవంక
89. వింతాకాదు,విడ్డూరం లేదు అయినా అది వస్తే అందరూ నోరు తెరుస్తారు. ఏమిటది?
జవాబు :ఆవులింత
90. కాగితం కనిపిస్తే చాలు కన్నీరు కారుస్తుంది?
జవాబు :కలం
91. వేలెడంత ఉంటుంది కానీ తోక మాత్రం బారెడు ఉంటుంది.ఏమిటది?
జవాబు :సూది-దారం
92. పళ్ళు ఉంటాయి కానీ నోరు ఉండదు?
జవాబు :రంపం
93. పచ్చని చెట్టు కింద ఎర్రటి చిలక?
జవాబు :మిరపపండు
94. మూట విప్పితే ముక్కు పట్టుకుంటుంది?
జవాబు :ఇంగువ
95. పచ్చని మేడ , తెల్లని గదులు, నల్లని దొరలు?
జవాబు :సీతాఫలం
96. అడవిలో పుట్టాను అడవిలో పెరిగాను వంటినిండా గాయాలు,కడుపు నిండా రాగాలు?
జవాబు :ఫ్లూట్ (పిల్లనగ్రోవి)
97. కారు కాని కారు పరుగు లో మహా జోరు ?
జవాబు :పుకారు
98. నీటి పై ఉంటే ఎగసి పడుతాను!నేల పై ఉంటే కూలబడతాను?
జవాబు :కెరటాలు (అలలు)
99. తోలు నలుపు,తింటే తెలుపు ఏమిటో తెలుపు?
జవాబు :చింతపండు
100. కదలలేదు కానీ కావలికి గట్టిది?
జవాబు :తాళం
sayloudtelugu లో తెలుగు సామెతలు చదువుటకు క్లిక్ హియర్ 👈👀

0 Comments
మీరిచ్చే ప్రతి కమెంట్ ప్రోత్సాహమే మన సే లౌడ్ తెలుగు కు ఉత్సాహం ......అందుకే కమెంట్ చేయండి మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.