స్టీవ్ జాబ్స్ జీవితానుభవం తో చెప్పిన మాటలు | steve jobs inspirational quote in telugu | sayloudtelugu
👉జ్ఞానం వశపారంపర్యంగా వచ్చేది కాదు,దాన్ని ఎవరికి వారు సంపాదించుకోవాల్సిందే.
👉సాధ్యంకానిది ఏదీ ఉండదని నమ్మితే అసాధ్యం అన్నదే ఉండదు.
👉గతాన్ని తలచుకొని బాధపడే బదులు,భవిష్తతుని నిర్మించుకోవడానికి ప్రయత్నించండి.
👉ఎవరైతే ప్రపంచాన్ని మార్చగలమని నమ్ముతారో,వారే ఆ పని చెయ్యగలరు.
👉జీవితంలో సత్ప్రవర్తన,క్రమశిక్షణ,నిజాయితీలకు ప్రాధాన్యం ఇచ్చేవారంతా గొప్ప వ్యక్తులే.
👉ఇదే మీ జీవితంలో చివరి రోజు అయితే, మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అది ఈరోజే చేయండి.
👉గొప్ప పనులు చేయడానికి ఒకే ఒక మార్గం మీరు చేసే పనిని ప్రేమించడమే.మీరు ఇంకా కనుగొనలేకపోతే వెతుకుతూ ఉండండి . ఊరుకోవద్దు!!.
👉మీకున్న సమయం చాలా తక్కువ కాబట్టి, దానిని వేరొకరి జీవితం కోసం వృధా చెయ్యవద్దు.
👉ఓటమికి దగ్గర కాకుండా ఉండాలి అంటే గెలవాలనే తపన ఎప్పటికి తగ్గకూడదు...
👉మీ హృదయాన్ని మరియు అంతరదృష్టిని అనుసరించే ధైర్యాన్ని కలిగి ఉండండి.. మీరు నిజంగా ఏమి కావాలనుకొంటున్నారో వాటికి ఇప్పటికే తెలుసు. మిగతావన్నీ ద్వితీయమైనవి అవసరం లేనివి.
👉స్మశానవాటికలో అత్యంత ధనవంతుడు కావడం నాకు అవసరం లేదు. నేను ఈ రోజు అద్భుతమైన పని చేశానని చెప్పి రాత్రి పడుకోవడం అదే నాకు నిజంగా ముఖ్యమైనది.
👉ఆకలి తో ఉండండి అవివేకంగా ఉండండి...
👉మీ పని మీ జీవితంలో చాలా భాగాన్ని నింపుతుంది మరియు నిజంగా సంతృప్తి చెందడానికి ఏకైక మార్గం గొప్ప పని అని మీరు నమ్ముతున్నది చేయడం. మరియు గొప్ప పని చేయడానికి ఏకైక మార్గం మీరు చేసే పనిని ప్రేమించడం. మీరు ఇంకా కనుకొనలేక పొతే,వెతుకుతూ ఉండండి. ఊరుకోవద్దు. హృదయానికి సంభందించిన అన్ని విషయాల మాదిరిగానే,మీరు దానిని కనుగొన్నప్పుడు మీకు తెలుస్తుంది.
👉నిన్న జరిగిన దానిని గురించి చింతించే బదులు రేపు కనిపెట్టే దానికి వెళ్దాం.
👉ఏం చేయకూడదో నిర్ణయించుకోవడం ఎంత ముఖ్యమో ఏం చేయాలో నిర్ణయించుకోవడం అంతే ముఖ్యం .
👉మీరు మొదటి ముప్పై సంవత్సారాలలో మీ అలవాట్లను తయారుచేస్తారు.చివరి ముప్పై సంవత్సరాలు మీ అలవాట్లు మిమ్మల్ని తయారుచేస్తాయి.
👉ఎప్పుడూ ఆకలితో ఉండు మనసులోకి వచ్చిన కొద్దిపాటి ఆలోచనలను కూడా వదులుకోకు.
👉ఈనాటి సాహసానికి ఎప్పుడో ఒక సారి ఫలితం ఉంటుందని మీరు నమ్మకం పెట్టుకోవాలి.
👉 ఆనందం అనేది రెడీమేడ్ గా దొరకదు అది నువ్వు చేసే పనుల నుండి వస్తుంది.
👉నేను అడిగేదల్లా, నువ్వు ఈ రోజు నీ పనిని నీ జీవితంలోనే ఉత్తమంగా చేయమని.
👉నీ మనస్సును,నీ అంతర్ దృష్టిని అనుసరించడానికి ధైర్యం చేయి.
👉మనందరి దగ్గర ఉండే అతి విలువైన వస్తువు,మన సమయమే.
👉అభిరుచి ఉన్న వ్యక్తులు ప్రపంచాన్ని మంచిగా మార్చగలరు.
![]() |
steve jobs life quotes sayloudtelugu |
వ్యాపార అనుభవంతో స్టీవ్ జాబ్స్ చెప్పిన మాటలు [Steve Jobs Business Quotes]:-
👉ఆవిష్కరణ అనేది ఒక నాయకుడు మరియు అనుచరుడి మధ్య తేడాను చూపుతుంది.
👉మీరు మీ కస్టమర్లకు గతంలో కంటే బాగా సన్నిహితంగా ఉండండి. చాలా దగ్గరగా ఉండి వారికి ఏది అవసరమో వారు స్వయంగా గ్రహించక ముందే మీరు వారికి బాగా చెప్పండి.
👉మేము ప్రపంచంలో అత్యుత్తమ వస్తువులను తయారుచేయాలనుకొనే వ్యక్తులను నియమిస్తాము.
👉వ్యాపారంలోని గొప్ప పనులు ఎప్పుడు ఒకే వ్యక్తిచే చేయబడవు. అవి వ్యక్తుల బృందంచే చేయబడుతాయి.
👉కొన్ని సార్లు జీవితం ఒక ఇటుక రాయితో నీ తల పగులకొడుతుంది. విశ్వాసం కోల్పోవద్దు.
👉 వ్యూహం అంటే ఏమి చేయకుడుదో వాటిని గుర్తించడం.
👉తెలివైన వారిని పనిలో పెట్టుకొని,వారికి ఏమి చేయాలో చెప్పడం సమంజసం కాదు. మనం ఏమి చేయాలో చెప్పడానికే,తెలివైన వారిని పనిలో పెట్టుకునేది.
👉నువ్వు చేసే దాని పట్ల నీకు చాలా మక్కువ ఉండాలి. లేకుంటే బుద్ధి ఉన్నవాడు ఎవడైనా దాన్ని వదిలేస్తాడు.
👉విజయవంతమైన వ్యవస్థాపకులను విజయం కాని వారిని వేరు చేసే వాటిలో సగం,శుద్ధ పట్టుదలే అని నా నమ్మకం.
స్టీవ్ జాబ్స్ ఆఖరి సందేశం (తన డైరీలో ఇలా రాసుకున్నారు):-
వ్యాపార జగత్తులో శిఖరాన్ని చేరాను నేను. విజయానికి ప్రతీకగా నిలిచాను. పని తప్ప నాకు వేరే ఆనందం తెలీదు. సంపాదనకే అంకితమైపోయాను. ఇప్ప్పుడు ఈ మరణశయ్య మీద రోజులు రోజులు లెక్క పెట్టుకుంటున్న నేను ఒక్క సారి ఆత్మ పరిశీలన చేసుకొంటే,ఇన్నాళ్ళూ నేను గర్వపడిన పేరూ ,డబ్బూ ఎందుకూ కొరగానివని నాకు అనిపిస్తుంది.
ఈ నిశి రాత్రిలో... నా ప్రాణాలు నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు వినిపిస్తోంది. నాకిప్పుడనిపిస్తోంది.... జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక,మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి. కళలు,అనుబంధాలూ,చిన్నపాటి కలలూ ,కోరికలూ ,సేవ.... ఇలా డబ్బుకి అవతల చాలా ప్రపంచం ఉంది. కానీ డబ్బు వెనక పెట్టే పరుగు మనిషిని మరమనిషిలా మార్చేస్తుంది. అందుకు నేనే ఉదాహరణ.
ఇతరుల మనసుల్లోని ప్రేమను గుర్తించాలనే దేవుడు మనకు జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. కానీ డబ్బుకు మాత్రమే విలువనిచ్చే కాల్పనిక జగత్తును మనం సృష్టించుకొన్నాం. నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు. నా ఈ ఆఖరి ప్రయాణంలో అది నా వెంట రాదు. నేను నాతో తీసుకువెళ్ళగలిగేది ప్రేమానుభూతులు,అందమైన జ్ఞాపకాలు మాత్రమే. ఈ ప్రేమ పూర్వక అనుభూతులే ఎప్పుడూ మనతో ఉంటాయి. మనల్ని ఉన్నతస్థాయికి చేరుస్తాయి.
నిజం,అంతా మన హృదయంలోనే,మన చేతుల్లోనే ఉంది. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా?...... నువ్వు రోగంతో బాధపడుతూ పడుకున్న మంచం. నీ కారు నడపడానికి ఒక డ్రైవేర్ను నియమించుకోగలవు. నీ కోసం సంపాదించిపెట్టగలిగే ఉద్యోగాలను నియమించుకోగలవు.,,కానీ నీ జబ్బును,నీ బాధనూ అనుభవించే వ్యక్తిని మాత్రం ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు. నువ్వు దేన్నీ కోల్పోయినా తిరిగి పొందవచ్చుగానీ చేజారిన జీవితాన్ని మాత్రం తిరిగి పొందలేవు.
జీవితంలో ఈ రోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా ----కధ ముగిసే రోజు,తెరపడే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు---ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి వెళ్ళదు. అందుకే,కాస్త ముందే కళ్ళు తెరువు. డబ్బును కాదు,నీ కుటుంబాన్ని ప్రేమించు. నీ స్నేహితులను ప్రేమించు. ఆనందంగా జీవించు.అందరినీ ఆనందంగా ఉంచు.
👀మారిన్ని మోటివేషనల్ కోట్స్ sayloudtelugu లో చదువుటకు క్లిక్ హియర్
0 Comments
మీరిచ్చే ప్రతి కమెంట్ ప్రోత్సాహమే మన సే లౌడ్ తెలుగు కు ఉత్సాహం ......అందుకే కమెంట్ చేయండి మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.