గొప్ప గొప్ప కలలు కానవచ్చు. ఉన్నతమైన ఆశయాలు ఉండవచ్చు. విలువైన మానవ వనరులు సమకూర్చుకోవచ్చు. శాంతి కరువైన చోట అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే. - జవాహర్ లాల్ నెహ్రూ
విప్లవం అంటే అన్ని సందర్భాలలోనూ రక్తంతో తడిసి ముద్దయిపోయే పోరాటాలే కానక్కర్లేదు. బాంబులూ తుపాకుల మోతలు వినిపించాల్సిన పన్లేదు. అన్యాయం,వివక్ష ఆధారంగా ఏర్పడిన వ్యవస్థను మార్చడానికి జరిగే ఏ పోరాటమైనా విప్లవమే. ఇంక్విలాబ్ జిందాబాద్ -
భగత్సింగ్
పౌరుడైనా పాలకుడైనా గుర్తుంచుకోవలసిన విషయం ఒకటుంది. మన మంచితనం ఎప్పుడూ మన బలహీనత కాకూడదు. మనం చేస్తున్న పని మీద నమ్మకం,ఆ నమ్మకాన్ని నిజం చేసుకోగల శక్తి... ఏ విజయానికైనా ఈ రెండూ అవసరం.-సర్దార్ వల్లభాయ్ పటేల్
స్వాతంత్య్రన్నీ సార్వభౌమత్వాన్నీ కాపాడాల్సిన కర్తవ్యం సైనికులది మాత్రమే కాదు. ఆ అభాద్యత మన మీదా ఉంది. ఆ శత్రువు కంచెకు అవతలే ఉండాలని లేదు. లోపలా ఉండవచ్చు. పారా హుషార్!--లాల్ బహదూర్ శాస్త్రి
నా దృష్టిలో రాజీపడడాన్ని మించిన నేరం లేదు. అది విలువల విషయంలో కావచ్చు,స్వేచ్ఛ విషయంలో కావచ్చు. అన్యాయంతోనో అక్రమంతోనో అయినా కావచ్చు. భవిషత్తు పట్ల నమ్మకాన్ని కోల్పోయినప్పుడే రాజీపడాలన్న ఆలోచన వస్తుంది. ఆ పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోకూడదు. జై హింద్ - సుభాష్ చంద్రబోస్
స్వరాజ్యం నా జన్మహక్కు..... దాన్ని సాధించి తీరుతాను. - బాల గంగాధర్ తిలక్
అవరోధాలు వస్తుంటాయి. వైఫల్యాలు ఎదురవుతూ ఉంటాయి. కుట్రలూ కుతంత్రాలూ పోరాటాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తుంటాయి.అయినా సరే,సహనాన్ని కోల్పోకూడదు. సహనాన్ని కోల్పోతే విజయాన్ని కోల్పోయినట్టే.-మహాత్మాగాంధీ
ఆలోచనల్లో నిజాయితీ,మాటల్లో ధైర్యం,చేతల్లో నిబద్ధత ఉన్నవారే మనకు అవసరం. --సరోజినీ నాయుడు
నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. ---సర్ధార్ వల్లభాయ్ పటేల్
ఆధునిక విద్య,విజ్ఞానాల్ని ఆర్జించకుండా మన జాతి పురోగమించటం సాధ్యం కాదు. ---రాజారామ్మోహన్రాయ్
సూర్యడు కనపడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరకు నక్షత్రాలు కూడా కనపడకుండా పోతాయి. ---రవీంద్రనాధ్ ఠాగూర్
జై జవాన్,జై కిసాన్ --- లాల్ బహదూర్ శాస్త్రి
జై విజ్ఞాన్- అటల్బిహార్ వాజ్పాయ్
దేశ్ బచావో,దేశ్ బనావో-- పి . వి .నరసింహారావు
కష్టాలు,విమర్శలు,వ్యతిరేకత... మనం వాటిని అధిగమించేందుకే వస్తాయి. వాటిని ఎదుర్కొని విజేతలుగా నిలవడంలో ఓ ప్రేత్యేకమైన ఆనందం ఉంటుంది. ఎక్కడైతే ప్రశంసలు మాత్రమే లభిస్తాయో అక్కడ జీవితం కొన్ని రోజుల తర్వాత ఆనందాన్ని కోల్పోతుంది.---విజయలక్ష్మీ పండిట్
జై హింద్ -- నేతాజీ సుభాష్ చంద్ర బోస్
డూ ఆర్ డై -- మహాత్మాగాంధీ
జల్ జంగిల్ జమీన్ -- కొమరం భీం
సత్యమేవ జయతే --- మదన్మోహన్ మాలవ్య
వందేమాతరం --- బంకిం చంద్ర ఛటర్జీ
నాకు రక్తాన్ని ఇవ్వండి,నేను స్వేచ్ఛ ఇస్తాను---సుభాష్ చంద్ర బోస్
గరీబీ హటావో --- ఇందిరా గాంధీ
ఇంక్విలాబ్ జిందాబాద్ --- భగత్ సింగ్
ఆనకట్టలు ఆధునిక దేవాలయాలు --- జవహర్ లాల్ నెహ్రు
దేశం అభివృద్ధి చెందడమంటే,అద్దాల మేడలు,రంగుల గోడలు కాదు. పౌరుని నైతికాభివృద్దే నిజమైన దేశాభివృద్ధి. - బి. ఆర్. అంబేద్కర్.
దేశాభివృద్ధిలో పారిశ్రామికవేత్తలకు,పెట్టుబడిదారులకూ బాధ్యత ఉంది. వారు తమ వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశాభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలి. - సర్ధార్ వల్లభాయ్ పటేల్
మనుషులను చంపగలరేమో... కానీ వారి ఆదర్శాలను చంపలేరు"- భగత్ సింగ్
తల్లులందించే స్ఫూర్తి, వారి ప్రేమ,త్యాగాలపైనే దేశం గొప్పతనం ఆధారపడి ఉంటుంది. --సరోజినీ నాయుడు
ఆస్తి పెరగాలంటే మార్గానేకం,అభిమానం పెరగాలంటే మాత్రం మార్గం ఒకటే... ఆత్మీయత. --దాదా భాయ్ నౌరోజీ.
మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి అందుకే దేవుడు మీద కానీ,మహానుభావుల మీద కానీ ఆధారపడొద్దు"-- బి. ఆర్ . అంబేద్కర్
"ఎంత గొప్పగా జీవించావో నీ చేతులు చెప్పాలి... ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి "--- మహాత్మా గాంధీ.
ఈ ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు మొదట నీతోనే మొదలవ్వాలి. - మహాత్మా గాంధీ.
పరాయి వాళ్ల దివ్య సాధనాలతో జీవించడం కన్నా,సొంతదైన పూరిగుడిసెలో నివసించడం మిన్న... --జవహర్లాల్ నెహ్రూ
లక్ష్యాన్ని సాధించలేని జ్ఞానం నిరోపయోగమైనది. --జవహర్లాల్ నెహ్రూ
మన లక్ష్యాలు,ఆలోచనలు,విలువలు మర్చిపోయినప్పుడు మాత్రమే అపజయం పాలవుతారు. --జవహర్లాల్ నెహ్రూ
సమయానికి కొలమానం సంవత్సరాలు గడిచిపోవడం కాదు ఆ కాలంలో మనం ఏం సాధించామనేది ముఖ్యం --జవహర్లాల్ నెహ్రూ
ఇతరులు మీకంటే గొప్పగా పని చేస్తున్నారని బాధపడకండి.రోజూ మిమ్మల్ని మీరు గెలిచే ప్రయత్నం చేయండి.నిన్న చేసిన పని కంటే ఈరోజు మరింత మెరుగ్గా చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే విజయం అనేది మీతో మీకు జరిగే ఒక పోరాటం లాంటిది.--చంద్రశేఖర్ ఆజాద్
సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వులాంటిది. -- మహాత్మా గాంధీ.
సత్యం,అహింస నాకు దేవుళ్లు -- మహాత్మా గాంధీ
ప్రతి కంటి నుండి కారే కన్నీటిని చదవడమే నా అంతిమ లక్ష్యం -- జవహర్ లాల్ నెహ్రూ
చెడును సహిస్తే అది మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది. --- జవహర్ లాల్ నెహ్రూ
మన జీవితంలో పోరాటం లేకపోతే - తీసుకోవలసిన నష్టాలు లేకపోతే జీవితం సగం ఆసక్తిని కోల్పోతుంది. - నేతాజీ సుభాష్ చంద్రబోస్
ఒక ఆలోచన కోసం ఒక వ్యక్తి చనిపోవచ్చు,కానీ ఆ ఆలోచన అతని మరణం తరువాత చాలా మంది జీవితాలలో ప్రేవేశిస్తుంది. అది ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. . - నేతాజీ సుభాష్ చంద్రబోస్
పిరికి మాటలు మాట్లాడకండి,వినకండి... అవి మీ జీవిత గమనానికి ఆటంకాలు అవుతాయి... - నేతాజీ సుభాష్ చంద్రబోస్
ఇతరులు మెదడులను పని చేయించగలవాడే మేధావి.... - నేతాజీ సుభాష్ చంద్రబోస్
అన్నింటికీ మించిన నేరం అన్యాయంతోను,అక్రమంతోను రాజీ - నేతాజీ సుభాష్ చంద్రబోస్
0 Comments
మీరిచ్చే ప్రతి కమెంట్ ప్రోత్సాహమే మన సే లౌడ్ తెలుగు కు ఉత్సాహం ......అందుకే కమెంట్ చేయండి మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.