తెలుగులో స్నేహ కవితలు
గుబులు నిండిన గుండె కన్నా,
కన్నీరు నిండిన కనుల కన్నా,
పువ్వులు నిండిన వనాల కన్నా,
ఆకాశము నిండిన తారల కన్నా,
నేస్తం నిండిన స్నేహం మిన్న !!!!
నీ మాటలకై ,
నా గుండె మొండిగా ఎదురుచూస్తుంటే
నీ మదిని రాయిలా మారుస్తావా?నేస్తమా!!
నీ చూపుకై ,
నా మది నిండుగా ఎదురుచూస్తుంటే
నీ కలలోనే ఊహాగా మార్చేస్తావా?నేస్తమా !!
ఎన్నో హృదయాలకు మన రూపం -ఒక గొప్ప స్నేహం.
ఎన్నో హృదయాలకు మన స్నేహం-ఒక కనిపించని అపురూపం.
మనకే తెలియని స్నేహరూపం -ఎన్నో హృదయాలకు కనిపిస్తుంది.
మనలో తెలియని స్నేహారాగం - ఎన్నో హృదయాలకు వినిపిస్తుంది.
మదిలో నీ స్నేహం మరచిపోలేక,
నదిలా స్నేహ ప్రవాహంతో ఉప్పొంగుతుంది చూడు!!
గది లో గడపలేక నీ స్నేహం ,
మదిలోనే సమయం గడిపేస్తుంది చూడు.!!
కనులతో ఎదురుచూడలేక నీ స్నేహం.
కడలి లా ఉప్పగా కన్నీరుగా మారుతుంది చూడు!!!
మౌనంగా మాట్లాడలేక నీ నేస్తం,
స్నేహంగా ఈ కవితలో కనిపిస్తుంది చూడు!!!
వినేవారికి ఇది విచిత్ర స్నేహం!!!!
చదివేవారికి ఇది ఒక అదృశ్యరూపం!!
మౌనమే నీ మాట అయితే ??
నిశ్శబ్దంలో కలిసిపోతా !!!
చిరునవ్వే నీ జవాబు అయితే ??
మౌనంగా విడిచిపోతా !!!
ఏమంటావ్ నేస్తమా!?
చూసే కన్నులను మాట్లాడమంటే ఎలా?
నవ్వే నోటితో చూడమంటే ఎలా?
మన్ను మిన్ను కలవమంటే ఎలా?
నీకు నాకు స్నేహమంటే ఎలా?
తోడు లేకపోతే పెరుగు లేదు. !!
కళ్ళు లేకపోతే చూపులేదు!!
గాలి లేకపోతే శ్వాసలేదు!!
నువ్వు లేకపోతే కవిత లేదు !!!
కాలం తో సమసిపోయే స్నేహం కాదు నాది.
కలం లా అక్షరాలు మలిచే స్నేహం నాది.
మౌనంగా తలచిపోయే స్నేహం కాదు నాది.
మరణం వరకు విడిచిపోని స్నేహం నాది !!!
కలలో నీ రూపం చూసి మదిలో వ్యధ !!?
కన్నీరులా కరిగిపోతున్నావు ....
ఎవరున్నారు నీకు నా మది తెలుపను ??
కవితల రూపంలో ఉన్న అక్షరాలు తప్ప!!!
మదిలో నీ స్నేహం విడువలేకున్నాను !!!
జ్ఞాపకాలు మరువలేదుకనుక.
అక్షరాలు ఉత్తరాలుగా రాయలేకున్నాను !!!
చిరునామా తెలియదుకనుక.
అంతర్జాలానికి కృతజ్ఞతలు తెలుపుకొంటూ,
పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ
ప్రియమైన నీ నేస్తం.......
వయసు పెరుగుతుంటే...
జ్ఞాపకాలు మరవడం లేదు!!!?
కాలం గడుస్తుంటే...
స్నేహం విడవడం లేదు!!!?
కలం రాస్తుంటే.....
అక్షరాలు వదలడం లేదు!!!?
నా స్నేహం నిన్ను చూడాలని నన్ను
ఎదురుచూడనివ్వదు ఎందుకోమరి!!!
నన్ను విడిచిన దూరమంతా నిన్ను
ఎదురు చూస్తూ వెతకమంటుందేమో ???
కొందరి స్నేహం కొరకే
కొందరు పుట్టారేమో అనిపిస్తుంది.
అభిమానం తో స్నేహం చేసే వ్యక్తులను
అనుమానం తో దూరం చేసుకోకండి.!!!
నీ జ్ఞాపకాలు నా కన్నీటిలో
తడిసి పోతుంటే ఒడిసి పట్టలేకపోతున్నా......
ఏ మాపకంతో కొలవాలో !!
గడిచి పోతున్నజ్ఞాపకాలసంద్రాన్ని ....
ఏమని తెలుపాలో అనంత
స్నేహాసంద్రానికి నువు నేస్తమని.
ఒకరు మనతో స్నేహం చేయలేదని ఏడవకండి.
మీ స్నేహం కోసం కూడా
ఎదురుచూసేవారుంటారని మరువకండి.
సమయస్ఫూర్తితో మీ సమయాన్ని గడపండి.
మంచి ఆలోచనలతో మెలగండి.
స్నేహాన్ని కృత్రిమంగా సృష్టించలేరు.
స్నేహాన్ని యాంత్రికంగా నడిపించలేరు.
నమ్మకం లేని నిజాలతో స్నేహం నిలువలేదు.
విలువ లేని క్షణాలతో స్నేహం కలవలేదు.
మీరు కోరుకొనే నేస్తం మీకు దొరకనప్పుడు....
మిమ్మల్ని కోరుకునే నేస్తానికి మీరు దొరికిపొండి
మంచిది.!!
మీ ఆలోచనలు మీ నేస్తానికి అర్ధం కావట్లేదని మీ
సమయాన్ని వృధా చేయకండి...
మిమ్మల్ని అర్ధం చేసుకొన్న నేస్తానికి దగ్గరవడం
మంచిది!!!
నీ కనులు నన్ను చూసే క్షణం కోసం
ఎదురు చూస్తాయి అని కాలం తో చెప్పలేను...!!
గడిచిన సమయాలను పిలుస్తూ
నువు స్నేహంతో నింపలేవు కదా!!
నీ పై స్నేహాన్ని
ఎలా తెలుపను!
నీ పై ఇష్టాన్ని
ఎలా చూపాను!
మదిలో మండే గుండెలో జ్ఞాపకాలు!!!
కడలై ఉప్పొంగే కనులలో కన్నీళ్ళు !!!
విడిచిన నేస్తాన్ని
విడువను అని విసిగించకండి!!
మరువని నేస్తాన్ని
విడువను అని దారి చూపండి !!
గడచినా కాలం
తిరిగి..... రాదు.
విడిచిన నేస్తం,
తిరిగి దరికి...... రాదు.
మరల పరిచయమవ..... రాదు.😎😶😊
అందరికీ ఒక అనుమానం
నువ్వే నా నేస్తమా?
అందరికీ ఒక అవగాహణ
నీలో పదాలే నా నేస్తాలని.
అర్థమైందా ఓ కవిత్వ స్నేహమా?
నీతో నే అనుక్షణం ఉండే ప్రకృతి నేస్తాన్ని చూడు.
నీ నీడనే నీకు చూపగల ప్రకృతి నేస్తాన్ని చూడు.
పువ్వు వికసిస్తున్న పద్దతి చూడు,
నువ్వు ఊహిస్తున్న పోలికలను వీడు.
నీరు ప్రవహిస్తున్న శబ్దం విను,
నీకు అనవసర విషయాలు వీడు.
స్నేహం ప్రతి ఒక్కరి జీవన ప్రయాణంలో అవసరం,
చివరికి నీ దరికి చేరేది మాత్రం ప్రకృతి నేస్తం.
కవితలు రాయుటకు,
నేస్తమే కావాలా?
పదాలు కూర్చుటకు,
తెలుగు పదాల స్నేహం సరిపోదా😊!!?
మీకు sayloudtelugu లో ఈ స్నేహాకవితాలు నచ్చితే మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. మరిన్ని కవితలు చదువుటకు ఇక్కడ క్లిక్ చేయండి 👈
0 Comments
మీరిచ్చే ప్రతి కమెంట్ ప్రోత్సాహమే మన సే లౌడ్ తెలుగు కు ఉత్సాహం ......అందుకే కమెంట్ చేయండి మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.