Ticker

7/recent/ticker-posts

swami vivekananda most inspirational quotes in telugu by sayloudtelugu

            స్వామి వివేకానంద సూక్తులు

👉"ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి. "

👉"రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి లేకపతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. "

👉"ఉత్సాహంతో శ్రమించడం. అలసటను ఆనందంగా అనుభవించడం. ఇది విజయాన్ని కాక్షించే వారి ప్రాధమిక లక్షణాలు."

👉"ఎవడికంటేనో నువ్వు గొప్పగా ఉండాలి అనుకోకు,నీ గతం కంటే ఇప్పుడు బాగుంటే చాలు అనుకో ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. "

👉"ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దాం అనే ఆలోచన మొదట నీ ప్రశాంతతనే దూరం చేస్తుంది."

👉"నీ గురించి నువ్వు ఎక్కువగా చెప్పుకోవద్దు. ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు."

👉"నీకు నచ్చినట్టు బ్రతకాలంటే ధైర్యం కావలి. ప్రపంచానికి నచ్చినట్లు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. "

👉"సముద్రాన్ని చూడగలం కానీ అందులో దాగి ఉన్న ఉప్పును చూడలేము. అదేవిధంగా మనుషుల్ని చూడగలం కానీ వారి మనసులో ఏముందో చూడలేం"

👉"ఏ ఆయుధాలు వాటి అంతట అవి హానికరం కావు. కోపాన్ని నియంత్రించుకోలేని మనిషి చేతులో పడినపుడు అవి హానికరంగా మారుతాయి. "

👉"యుద్ధం తప్పదు అంటే అరచేయి కూడా ఆయుధమవుతుంది. వద్దనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొడుతుంది. సంకల్పం ఒక్కటే నిజం మిగిలినదంతా కల్పితం"

👉"మనకున్న సమస్యలకు రెండు కారణాలు ఒకటి మరచిపోవలసినవి గుర్తుంచుకోవడం రెండు గుర్తుంచుకోవలసినవి మరచిపోవడం"

👉"అసూయపడే వారితో నీ అభివృద్ధి గురించి చెప్పుకోవడం ఆశపడే వారితో నీ ఆలోచనలు పంచుకోవడం మూర్ఖత్వం."

👉"గెలిచినప్పుడు పొంగిపోకుండా ,ఓడినపుడు కుంగిపోకుండా ఉండు సంతోషం నీ సొంతమవుతుంది."

👉"ఓడిపోతామేమోనన్న భయం గెలుపును దక్కనివ్వకుండా చేస్తుంది."

👉"నవ్వుతున్నపుడు నీళ్లు త్రాగడం ఎంత కష్టమో మనసుకు బాధ కలిగినపుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం."

👉"దురాశపరుడైన వ్యక్తిని ధనంతోను మొండిఘటాలను అభినందనలతోనూ అవివేకిని ఆశయంతోను పండితుడిని నిజాంతోను జయించవచ్చు. "

👉"మన మాటల్లో ఇష్టాన్ని మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకొన్న వాళ్ళు మన నిజమైన ఆత్మీయులు"

👉"బంధం ఏదైనా సరే బాధ పంచుకునేలా ఉండాలి కానీ బాధ పెట్టేలా ఉండకూడదు."

👉"కష్టాన్ని సవాలుగా తీసుకొంటే నీవే ఓ సందేశం నీవే ఓ ఆదర్శం."

👉"ప్రతి మనిషికి తన జీవితం తనకు చాలా ముఖ్యం ఒక్క మనిషిపై పంతానికి పోయి పతనాన్ని కొని తెచ్చుకోకండి."

👉"స్వశక్తి పై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఇతరులపై ఆధారపడిన వ్యక్తి ఎప్పుడు నిరాశకు గురవుతూనే ఉంటాడు."

👉"నీవు పనికిమాలిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తావో అప్పుడు మనశాంతి పొందుతావు."

👉"ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో ఆపవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని."


👉"పుడమిలోకి వచ్చాక పూడ్చి పెట్టేవరకు పోరాడాల్సిందే వేరే మార్గం లేదు.."

👉"మనిషి ఆరోగ్యం కంటే ముఖ్యమైనది విలువైనది ఏమీ లేదు. ఆరోగ్యంగా ఉంటే అన్ని సంపాదించవచ్చు."

👉"నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు. నువ్వు చేస్తున్న పని వారికి నచ్చట్లేదు అన్నమాట . "

👉"రాపిడి లేనిదే వజ్రం ప్రకాశించాడు. అలాగే కష్టాలు లేనిదే మనిషి పరిపూర్ణత చెందడు ."

👉"పట్టుకున్న దాన్ని విడిచి పెట్టకు. విడిచి పెట్టె ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు. అది ఆశయం అయినా బంధమైనా."

👉"జీవితంలో గొప్ప వాడివి కావాలంటే కలలు కనే ధైర్యం ఉండాలి. ఆ కలల కోసం కష్టపడే దమ్ము ఉండాలి."

👉"ఎప్పుడూ కింద పడిపోవడం గొప్ప కాదు. పడినప్పుడల్లా మళ్ళీ  పైకి లేవడమే గొప్ప."

👉"విలువైనది ఎప్పుడు ఆ విలువ తెలిసిన వారికే దొరుకుతుంది. అది వస్తువైనా. బంధమైనా."

👉"నువ్వు మొదలు పెట్టాలంటే గొప్ప వాడివి అవ్వక్కర్లేదు. కానీ గొప్ప వాడివి అవ్వాలంటే మాత్రం కచ్చితంగా మొదలుపెట్టాలి."

👉"కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకొంటే చింత లేని జీవితం నీ సొంతమవుతుంది. '

👉"జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే వరకు చెవులను మూసుకో,ఎదిగిన తర్వాత నోటిని మూసుకో."

👉"కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైన ఉండవచ్చు. కానీ ఆ కోపంతో కౄరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు."

👉"అబద్దం అప్పు వంటిది. అవసరానికి ఒక్కసారి అబద్ధం ఆడితే ఇంకా దానికి వడ్డీ కట్టినట్లు మరికొన్ని అబద్దాలాడక తప్పదు. "

👉"జీవితంలో అబద్ధాలు చెప్పే వారిని క్షమించు కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించే వారిని జీవితంలో క్షమించవద్దు."

👉"నువ్వు నమ్మిన వాళ్లే మోసం చేస్తే కుమిలిపోకు. గుడ్డిగా నమ్మడం నీ తప్పేనని సరిపెట్టుకో కానీ ఒక్కటే గుర్తుపెట్టుకో దేవుడనే వాడు   ఒకడున్నాడు. లెక్క సరి చేయకుండా వదిలిపెట్టడు."

👉"ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది."

👉"నీ వెనుకేముంది..... ముందేముంది.... అనేది నీకనవసరం నీలో ఏముంది అనేది ముఖ్యం."

👉"విజయం కలిగిందని విర్రవీగకు. అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతం కాదు. అపజయం తుది మెట్టు కాదు"

👉"మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి."

👉"తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతలకంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు."

👉"ప్రతీ ఆనందం తర్వాత దుఃఖం వస్తుంది. వాటి మధ్య అంతరం ఎక్కువ లేదంటే... తక్కువ ఉండవచ్చు. వ్యక్తి ఎంత ఉన్నతుడైతే అంత వేగంగా సుఖదుఃఖాలు ఒకదాన్ని మరొకటి అనుసరిస్తాయి."

👉"జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వము కోల్పోయినట్టే."

👉"లక్ష్యం పై ఉన్నంత శ్రద్దాసక్తుల్ని. లక్ష్య సాధనలో సైతం చూపించాలి. విజయ రహస్యమంటే ఇదే."

👉"జీవితంలో నచ్చని క్షణాలు చాలా వస్తాయి. మోసపోయావని మొదలుపెట్టిన పనిని మధ్యలో వదిలేయకు. తోటి ప్రయాణికుడు నచ్చకపోతే రైలు నుండి దూకేస్తావా?గొడుగు రంగు బాలేదని వర్షంలో తుడుచుకుంటూ వెళ్తావా?ఏదైనా సరే,గమ్యం చేరుకోవాలి. నీ ప్రయాణమే నీ కథ. మిగతావన్నీ ప్రకటనలు."

👉"నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధ పెడితే బంధాలు తెగిపోతాయి."

👉"అన్నీ సాధించాక ఆనందం ఉంటుందని అనుకోకు.... మనం ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలం."

👉"ఎదుటి వారి ముఖాన్ని చూసి తన మనస్తత్వాన్ని అంచనా వేయకండి. కొంతమంది మనసులో కటిక విషాన్ని నింపుకొని బయటకి నవ్వుతూ ఉంటారు. మరికొంతమంది గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతున్నా బయటకి ఏ సమస్య లేనట్టు సాధారణంగా ఉంటారు."
swami vivekananda life motivatioanl quotes_mottivational quotes by sayloudtelugu
swami vivekananda life quotes in telugu


👉"భయం.... అభద్రత అనేవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. అవి నీలో మాత్రమే ఉన్నాయి అనుకోకు ."

👉"ఏదైనా నావల్ల కాదు అని వదిలేసే ముందు ఈ అవకాశం పొతే మళ్లీ తిరిగి రాదు అని గుర్తుంచుకో."

👉"అతి స్నేహం అతి ప్రేమ,అతి చనువు మనఃశాంతికి హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధని కూడా భరించాల్సి ఉంటుంది."

👉"గొప్ప గొప్ప విషయాలు మౌనంగా ఉన్నప్పుడే రూపుదాల్చుకుంటాయి. ఎందుకంటే మౌనంగా ఉన్నప్పుడే గొప్ప ఆలోచనలు వస్తాయి."

👉"నీ ప్రయత్నాన్ని ఆపేద్దాం అనిపించినప్పుడు ఒక్కసారి ఎందుకు మొదలు పెట్టావో గుర్తు తెచ్చుకో."

👉"ఆపద వచ్చినపుడు అన్నీ దారులు మూసుకుపోయినా మనోధైర్యం తోడుంటే కచ్చితంగా విజయానికి చేరువ చేసే దారి దొరికి తీరుతుంది."

👉"నీ దగ్గర ఎన్ని ఉన్నా లేని దానికోసం బాధపడే గుణం నీకు ఉంటే మాత్రం నీ దగ్గర ఏమీ లేనట్టే."

👉"నిన్ను చూడకముందే నీ స్వరం వినకముందే నిన్ను నిన్నుగా ప్రేమించే ఒకే ఒక్క వ్యక్తి అమ్మ."

👉"జీవితంలో మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి :
1. నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన పని లేదు. 
2. నీకు గౌరవం లేనిచోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు. 
3. నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అసలు బాధ పడాల్సిన పని లేదు."

👉"రహస్యాన్ని కాపాడడం,తగిలిన గాయాన్ని మరచిపోవడం,సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఈ మూడు చాలా కష్టతరమైన పనులు."

👉"వాడని ఇనుము తుప్పుపడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్ధకం మెదడును నిత్తేజం చేస్తుంది."

👉"అబద్దం చెప్పడం శాపం లాంటిది. ఎందుకంటే అది మనలో తప్పించుకొనే ధోరణి పెంచుతుంది. నిజాయితీ వరం లాంటిది. అది మనలో ఎదుర్కొనే ధోరణి పెంచుతుంది."

👉"నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తిని ఎన్నటికీ వదలకు... ఎందుకంటే ఏదో ఒక రోజు తెలుస్తుంది రాళ్లను పోగేస్తూ వజ్రాన్ని కోల్పోయావని."

👉"మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటల్ని మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. ఓపిక,సహనం, అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు."

👉"మనం మాట్లాడితే గానీ మాట్లాడని బంధాలను వదిలేయడమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్ధం."

👉"చికాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు. కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపుచాలు. గుండె మంటను చల్లార్చడానికి తీయటి మాటలు చాలు నేనున్నానని భరోసా ఇవ్వడానికి చక్కని నేస్తం చాలు."

👉"భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి. మానసికంగా చంపడానికి ఒక్క పదునైన మాట చాలు. అందుకే ఎవ్వరినీ మాటలతో నొప్పించకండి."

👉"విమర్శలు అన్నిటిలోకి ఉత్తమమైనది ఆత్మ విమర్శ."

👉"మంచి అందంతో పుట్టడం నీ చేతుల్లో ఉండదు. కానీ మంచి మనస్సు కలిగి ఉండడం అనేది మన చేతుల్లోనే ఉంది. మంచి సంపన్నులకు పుట్టడం నీ తేతుల్లో ఉండదు కానీ మంచి సంస్కారంతో బతకడం అనేది నీ చేతుల్లోనే ఉంది."

👉"బురద నీటిలో స్నానం చేసి శరీరాన్ని శుభ్రం చేసుకోలేం కదా.... అలాగే చెడ్డవారితో చెలిమి చేసి గౌరవం పొందలేము కూడా. మన శ్రేయస్సు కోరే వారితో మాత్రమే స్నేహం కొనసాగించాలి. కీడు చేసే వారి స్నేహాన్ని తిరస్కరించాలి."

👉"అధికారపు అహం,మితిమీరిన ధన దాహం,కపట బుద్ధి ఉన్నవాడు ఎదుగుతున్న కలుపు మొక్క లాంటివాడు. ఎదిగినంతకాలం ఎదుగుతాడు. తరువాత పీకి అవతల పారేస్తారు."

👉"బంధం బాగున్నపుడు అన్నీ విషయాలు నీకు చెబుతారు.... అదే బంధం చెడినపుడు నీ విషయాలు అందరికీ చెబుతారు. ఇదే లోకం పోకడ..."

👉"భయం లేని రోజు స్వేచ్చగా విహరించగలం, జరిగేది ఎలాగూ జరుగుతుంది. జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు. అందుకే భయాన్ని భయపెట్టేలా బ్రతుకుదాం...... చావుకంటే కూడా భయపడడం అనేది అతి పెద్ద చావు... బతగడం గొప్ప కాదు. భయం అనేది లేకుండా బతకడం గొప్ప విషయం."

👉"జీవితంలో ఎవ్వరికీ ఎక్కువగా దగ్గర అవ్వొద్దు. దగ్గరై బాధపడటం కన్నా మన హద్దుల్లో మనం ఉంటే చాలా మంచిది."

👉"ఎదుటివారితో అవసరం ఉన్నా లేకున్నా...  నువ్వు నీలా ఉండటం నేర్చుకో. అవసరం కోసం నటించడం మొదలుపెడితే జీవితాంతం నటిస్తూనే బ్రతకాల్సి వస్తుంది."

👉"జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. నవ్వేవాడికి ఏడిచే రోజు... ఏడ్చే వారికి నవ్వే రోజు తప్పక వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే..."

👉"ఒకసారి వద్దని వదిలేసిన వాళ్ళు మళ్ళి పిలిచారు అని పరిగెత్తుకు వెళ్లేముందు ఈ సారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఊహించుకో చాలు."

👉"రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజు వృధా చేయడం మూర్ఖత్వం నిన్న జరిగిన దానిని నేడు కూడా తలుస్తూ చేయాల్సిన పనిని వదిలేయకూడదు."

👉"అంతా తనదే అన్నది మమకారం. అంతా తనే అన్నది అహంకారం."

👉"మంచితనం ఉన్నవారు తమ బాధ్యతలను నిర్వహిస్తారు. మంచితనం లేనివారు తమ హక్కులపై దృష్టిని నిలుపుతారు."

👉"మన మాటకే విలువ ఇవ్వని వారు జీవితంలో మనకు గొప్ప స్థానాన్ని ఇస్తారు అని అనుకోవడం మూర్ఖత్వం. "

👉"నువ్వు తరచూ ఓడిపోతూ ఉంటే నీకు అర్ధం కాని విషయాలను నువ్వు గెలవడానికి ప్రయత్నిస్తున్నట్టు అర్ధం."

👉"జీవితంలో ఒకటి గుర్తుంచుకో,నువ్వు ధైర్యంగా ఉంటేనే నీ కుటుంబం ధైర్యంగా ఈ లోకంలో బ్రతకగల్గుతుంది."

👉"మన జీవితంలో మనం కనపడితే ఆనందపడే వాళ్ళు,మనం బాధపడితే ఆవేదన చెందేవాళ్ళు  ఉండడం చాలా అదృష్టం."

👉"జీవితంలో ఒకటి గుర్తుంచుకో,నువ్వు దైర్యంగా ఉంటేనే నీ కుటుంబం ధైర్యంగా ఈ లోకంలో బ్రతకగల్గుతుంది."

👉"గొంతు పెంచడం కాదు. నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకి పంటలు పండవు."

👉"జీవితంలో ఓటమి పొరపాట్ల వలన రాదు. జరిగిన సంఘటనల నుండి గుణపాఠం నేర్చుకోవడం వల్ల వస్తుంది. కాలంతోపాటు అనుభవాలు,గుణపాఠాలు ప్రతి వ్యక్తి నేర్చుకోవడం అవసరం."

👉"కన్నీటి చుక్క కరిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తే విజయం సాధించగలవు."

👉"మనసుకు నచ్చినవారు మనసారా మాట్లాడితే ఆ ఆనందం ముందు స్వర్గం కూడా చిన్నబోతుంది."

👉"అన్నీ ఉన్నవాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వల్ల దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేనివాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు వాళ్ళకి నువ్వు దేవుడిలా కనిపిస్తావు."

👉"ఒక మంచి వ్యక్తి మన జీవితంలోకి వచ్చినపుడు ఆ వ్యక్తి విలువ మనకు తెలియకపోవచ్చు. కానీ విడిపోయాక మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది మన జీవితంలో ఏం పోగొట్టుకున్నామో."

👉"మంచి అనేది మనసులో ఉండాలి చేసే పనిలో ఉండాలి ఊరికే చెప్పే మాటల్లో కాదు."

👉"నేను గెలవడంతో ఓడిపోవచ్చు కానీ ప్రయత్నిచడంలో గెలుస్తూన్నాను ప్రయత్నిస్తూ గెలుస్తాను గెలిచి తీరతాను."

👉"బంధం కంటే బలమైనది ఏదీ లేదు ఈ లోకంలో తిత్రమేమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా బంధమే."

👉"మాటలు చెప్పే వాడి దగ్గరకు తాత్కాలికంగా జనం చేరుతారు కానీ కష్టపడే వాడి దగ్గరకు విజయం శాశ్వతంగా వచ్చి చేరుతుంది."

👉"రాత్రంతా ఆలోచనలతో జీవితం ఎటు పోతుందో అని బాధపడతాం పగలంతా బాధ్యలతో తెలియకుండా పరిగెడదాం"

👉"గతాన్ని మర్చిపోవడం మంచిది ఎందుకంటే గతంలో ఎవరూ విజయం సాధించలేరు"

👉"సొంతం కాని వాటిపై అత్యాశ.... సొంతమైన వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే జీవితం అసంతృప్తిగా సాగడానికి ఇవి ప్రధానం."

👉"తలదించుకొన్న ప్రతీ వారు తప్పు చేసినట్టు కాదు. తగ్గిన ప్రతీ వారు చేతగాని వారు కాదు కొన్ని సార్లు జరుగుతుంది."

👉"గెలుపు వెనక పరిగెత్తడం మాని ప్రయత్నం వెనుక పరిగెత్తు అప్పుడు గెలుపు నీ వెనక్కి పరిగెడుతూ వస్తుంది."

👉"దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ  మళ్ళీ వెంటాడుతుంది ఒకసారి ఎదురు వెళ్ళి చూడు ఆ భయమే నీకు భయపడుతుంది."

👉"గెలుపు అనేది నీడ లాంటిది దాన్ని పట్టుకోవాలని  చూడకు నీ దారిలో నువ్వు సాగిపో దానంతట అది నీ వెంట వస్తుంది కానీ నీ అడుగులు వెలుగు వైపు పడితేనే నీ నీడ ఉంటుందని గమనించాలి."

👉"సమయం ఆరోగ్యం బంధం వీటిపై ఏ ధర రాసి ఉండదు అవి కోల్పోయిన అప్పుడే వాటి విలువ తెలిసేది అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి."

👉"ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి,బంధాన్ని నిలబెట్టుకోవాలి."

👉"ఓటమి, ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలని నేర్పిస్తే ఇంకోటి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది."

👉"ప్రశ్నించే తత్త్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది."

👉"మంచి మనసున్న ఏ మనిషినీ హద్దులు దాటి కష్టపెట్టకు అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుంది.... గుర్తుంచుకో."

👉"విడిచి పెట్టాల్సిన ఐదు లక్షణాలు. 1. అందరినీ సంతృప్తి పరచాలని అనుకోవటం 2. అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం 3. నిన్ను నువ్వే కించ పరుచు కోవడం 4. మార్పుకు భయపడడం 5. గతంలో జీవించడం"

👉"కోపంతో సమాధానం చెప్పకు సంతోషంలో వాగ్దానం చేయకు ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు."

👉"పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే నీ బలం "

👉"విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు నిన్ను నువ్వు గెలవాలి."

👉"నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండటం,తిట్టినపుడు కోపాన్ని చూపించకుండా ఉండటం,పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండటం నేర్చుకో.. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకే చేరుస్తాయి తప్పా.... "ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు."'

👉"మనం బాగున్నపుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నపుడు విలువలు మాట్లాడకూడదు."

👉"అర్ధం చేసుకోకుండా ఎవరినీ అంగీకరించకు... అపార్థం చేసుకొని ఎవ్వరిని వదులుకోకు."

👉"ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు కష్టమైన సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో ఒక్కటి గుర్తు పెట్టుకో నీడలో మొక్కలే ఎదగలేవు మనుషులం మనం ఎదగగలమా."

👉"మీకు ఒకరి జీవితాన్ని కొంచమైనా ప్రభావితం చేయగల శక్తి ఉంటే వెంటనే ప్రయత్నించండి ఎందుకంటే ఇప్పటి ప్రపంచానికి ఇది చాలా అవసరం."

👉"వర్షాలు పడడం లేదని ఊర్లో వాళ్ళందరూ దేవుని దగ్గరకు వెళ్లారు, కానీ ఒకడు మాత్రం గొడుగు తీసుకుని వెళ్ళాడు అదే  విస్వాసం."

👉"మౌనంగా ఉండే మనిషితో జాగ్రత్త ఎందుకంటే వాళ్ళు మీకు తెలియని ఎన్నో రహస్యాలు వాల్ల లోపల దాచుకొని ఉంటారు."

👉"మిణుగురు పురుగు తనలో ఉన్న కాస్తంత వెలుగును కూడా లోకానికి పంచాలని చూస్తుంది. అందుకే మనలో ఉన్న కొంత విజ్ఞానమైనా ఇతరులకు పంచినప్పుడే దానికి సార్ధకత."

👉"వంద బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టుకు అమాంతం కాయలు కాయవు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాల్లో పూర్తయిపోవు. దేనికైనా సమయం రావాలి. సహనం కావాలి."

👉"మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనస్సు నమ్మగలిగితే దానిని కార్చితంగా సాధించగలరు."

👉"లే!!బయల్దేరు నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధలు సంకెళ్లు తెంచుకో. పడ్డ చోట నుండే పరుగు మొదలు పెట్టు. "

👉"పర్వతం ఎత్తు చూసి ఎక్కితే శాశ్వతంగా కొందనే ఉండిపోతాము అది సాహసించి ఒక్కో అడుగు ముందుకు వేస్తే శిఖరాగ్రం మీదకి చేరుతాము."

👉"నువ్వు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్లు విసురుతూనే ఉంటారు. వాటితో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు. వాటన్నింటిని నీ గెలుపు బాటగా మార్చుకోవచ్చు. నిర్ణయం నీ చేతిలోనే ఉంది."

👉"పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయమనే మొక్క మొలుస్తుంది."

👉"ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. దాన్నే మీ జీవిత లక్ష్యంగా చేసుకోండి. దాన్నే ధ్యానించండి. దాన్నే శ్వాసించండి ఇదే విజయానికి మార్గం."

👉"నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కిందనే మొదలవుతుంది."

👉"ఉన్నతంగా ఆలోచించే వారికి ఎప్పుడూ ఒంటరితనం ఉండదు వారి ఆలోచనలే వారి మిత్రులు."

👉"నీదగ్గర డబ్బు లేదన్న నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీడ కూడా ఆలోచనలో పడుతుంది."

👉"కుదిరితే పరిగెత్తు పోతే నడువు అదీ చేతకాకపోతే పాకుతూ పో అంతే కానీ ఒకే చోట 
అలా కదలకుండా ఉండిపోకు."

👉"అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు మనం కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి దక్కించుకోవచ్చు."

👉"జరిగినదాని గురించి ఎప్పుడూ చింతించకు ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది."

👉"జీవితంలో ఓడిపోయారని బాధపడుతున్నారా ఒక్కసారి ఓడి గెలిచిన చరిత్రలు చదవండి. ఈ ప్రపంచంలో చెడి బ్రతికిన వాళ్ళు ఉన్నారు కానీ బ్రతికి చెడ్డ వారు లేరు."

👉"ఈ ప్రపంచంలో ఐడియాలు ఇవ్వడానికి చాలా మంది ఉంటారు కానీ వాటిని ఇంప్లిమెంట్ చేసే వారు కొందరే వారే విజేతలుగా మిగులుతారు."

👉"జీవితంలో మనం సాధించే అతి గొప్ప విజయం మనల్ని మనం తెలుసుకోవడం ఇంకా గొప్ప విషయమేమిటంటే మనం తెలుసుకున్న విషయానికి సంతృప్తి చెందడం."

👉"జీవితంలో నీకు శత్రువులు తయారవుతున్నారంటే వారు సాధించలేనివి నువ్వు సాధించి చూపించావు అని అర్ధం."

👉"జీవితం ఎప్పుడూ సవాళ్లనే విసురుతుంది దానిని ఎదుర్కొని నిలిచిన వారే విజేతలు అవుతారు."

👉"డబ్బును బట్టో, స్థాయిని బట్టో ఎప్పుడు గర్వపడకు ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది ఆట ముగిశాక రాజు. బంటు చేరేది ఒక పెట్టెలోకి. "

👉"మనం పూర్తిగా ఆనందంగా ఉండలేకపోవడానికి కారణం మన దగ్గర ఉన్న దానిపై నిర్లక్ష్యం లేని దాని పట్ల ఉన్న ఆసక్తి."

👉"ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి. కాలం కదిలిపోతుంది. కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపుని గుండెల్లో దాచిపెట్టు. గెలుపు కోసం పరిగెత్తు. అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకి కారణం అయిన వాళ్ళే నీ గెలుపు చూసి తలదించుకోవాలి. నీ జీవితం నువ్వే నిర్ణయించుకో."

👉"చెరువు నిండినపుడు చీమలే చేపలకు ఆహారం. చెరువు ఎండిపోయినపుడు చేపలే చీమలకు ఆహారం. కొన్ని లక్షల అగ్గిపుల్లలు తయారీకి ఒక చెట్టు చాలు. కొన్ని లక్షల చెట్లను కాల్చడానికి ఒక అగ్గిపుల్ల చాలు. పరిస్థితులు ఎలాగైనా మారొచ్చు. అందుకే ఎవరిని తక్కువగా చూడకండి. ఎవరి మనసును గాయపరచకండి."

👉"నేను గెలవడంలో ఓడిపోవచ్చు కానీ ప్రయత్నించడంలో గెలుస్తున్నాను. ప్రయత్నిస్తూ గెలుస్తాను. గెలిచి తీరుతాను."

👉"జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండు మార్గాలు ఒకటి మన సమస్యలు ఎవరికి చెప్పకూడదు రెండు ఇతరుల సమస్యలు తల దూర్చకూడదు."

👉"నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే, మరొకసారి ప్రయత్నించు."

👉"సమస్యలు ఎప్పుడైనా రాని,కష్టాలు ఎప్పుడైనా రాని,కన్నీళ్లు ఎండిపోని,నీ స్నేహితులు దూరమైతే కానీ, రేపు అనేది ఒకటుంది. నీ కోసమై... వేచి చూడు. నీడనేది నీది కాక ఎక్కడికి పోదు."

👉"జీవితం అనేది నిన్ను నువ్వు తెలుసుకోవడం కాదు నిన్ను నువ్వు నిర్మించుకోవడం."

👉"జీవితమనేది గమ్యం కాదు. గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం. గమనం అనేకం."

👉"నిన్ను నువ్వు నమ్ము ప్రపంచమే నీ పాదాల చెంత ఉంటుంది."

👉"మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతీ ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతీ ఆలోచనను తిరస్కరించండి. "

👉"శారీరకంగా,మేధోపరంగా,ఆధ్యాత్మికంగా నిన్ను బలహీన పరిచేది ఏదైనా,దాన్ని విషంలా తిరస్కరించు."

👉"నిజమైన స్వేచ్ఛా అంటే నీకు నచ్చినది చేయడం మాత్రమే కాదు,నీకు నచ్చనిది చేయకపోవడంకూడా."

👉"బలం జీవితం బలహీనత మరణం"

👉"మాటలు ద్వితీయం,కానీ ఆలోచనలు సజీవం,అవి చాలా దూరం ప్రయాణిస్తాయి."

👉"పవర్ అంతా నీలోనే ఉంది. నువ్వు తలచుకొంటే ఏదైనా చేయవచ్చు."

👉"జ్ఞాన బహుమతి ప్రపంచంలోనే అత్యున్నత బహుమతి."

👉"స్వచ్ఛమైన ప్రేమకు కారణం ఉండదు దానికి పొందడానికి ఏమీ లేదు."

👉"ప్రయాస పడే వాడే ఉత్తముడు అసలు ప్రయత్నించని వాడికంటే."

👉"గొప్ప పని పూర్తి చేయుటకు పట్టుదలతో కూడిన కృషి చాలా కాలం పాటు అవసరం."

sayloudtelugu లో ఇంకా మోటివేషనల్ కోట్స్ చదువుటకు ఇచట క్లిక్ చేయండి inspiring quotes 

Post a Comment

0 Comments