![]() |
Sayloudtelugu Motivational Quotes Part-1 |
ప్రపంచంలో మనుషులందరూ ఒకేలా వుండరు. కొందరు మనుషులు ఇతరుల చెడ్డ గుణాలని వేలెత్తి చూపించడం కోసమే జీవించాలనుకొంటారు. అలాంటి తపన ఉండే మనుషులు తప్పులులెక్కించడం ముందుగా తమలోని చెడు తో మొదలుపెట్టాలి. దాంతో తప్పులెన్నే ప్రక్రియ టక్కున ఆగిపోతుంది. - డేవిడ్ గ్రేసన్.
ప్రపంచంలో గొప్ప గొప్ప ఉన్నత స్థానాలని చేరుకొనే మనుషులు మూడు విధాలుగా దాసులవుతుంటారు. ఒక్కోసారి రాజమర్యాదలకి దాసులవుతుంటారు;ఒకసారి కీర్తికాంత కటాక్షం కోసం దాసులవుతుంటారు. ఇంకోసారి తాము ఎన్నుకున్న పనులకే దాసులవుతుంటారు. - ఫ్రాన్సిస్ బేకస్.
మనిషి జీవితంలో ఎంతోమంది మిత్రులు దూరమయ్యేది,ఎన్నో ఉపయోగకరమైన సంఘటనలు నిరుపయోగమైయ్యేది,చివరకు మతమూ,అభిమతమూ గూడా పలచబడేదీ -గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల కాదు, చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయటంవలనే. - రిచర్డ్ వేట్లీ
మనిషి తానో పనిని చక్కగా చేయగలిగాననుకుంటే,అది అతని మనోమస్తిష్కాలకి అభినందన పూర్వకమైన చేయూతనిస్తుంది.కానీ అదే మనిషి తాను చేసిన పని తిరుగులేదనీ,అలా మరెవ్వరికీ సాధ్యపడదనీ భ్రమిస్తే, అది అతని వికాసానికి గొడ్డలిపెట్టు అవుతుంది. - సి . ఎఫ్ . కెటరింగ్.
జీవితం వికాసానికి ప్రతిరూపం;స్థిరంగా ఉండడం జీవితం కానేకాదు, నిరంతరం వికాసం వైపు చేసే ప్రయాణంలో మనిషి జీవితం ఎన్నడూ స్థిరంగా ఉండలేదు. - జవహర్ లాల్ నెహ్రూ
ప్రతి మనిషికీ సృష్టికర్త రెండు చెవులు,రెండు కళ్ళతోపాటు ఒకే ఒక నాలుక ప్రసాదించాడు. రెండు చెవులతో ఎక్కువగా వినాలనీ, రెండు కళ్ళతో చక్కగా చూడాలనీ, ఒక నాలుకని ఉపయోగించి మనం సాధ్యమైనంత తక్కువగా మాట్లాడాలని. - సోక్రటీసు
అజ్ఞానంలో పడి ఉండడం మనిషికి వుండే అసాధారణమైన అధికారం కాదు, అయితే తన అజ్ఞానాన్ని గుర్తించగలగడం అతని ప్రత్యేక అధికారం - డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
ఈ ప్రపంచాన్ని పరిపాలించేది ఆలోచనలు కాదు, శక్తియుక్తులు అయితే శక్తియుక్తులని సక్రమంగా ఉపయోగించుకొనేది మాత్రం ఆలోచనలే. - పాస్కల్
ప్రతి మనిషి తను చేసే పని పట్ల, గౌరవం కలిగి వుండాలి. ఆ గౌరవాన్ని ఎప్పటికప్పుడు నిలుపుకుంటూ వుండాలి. అందుకు తన వంతు బాధ్యతని ఎప్పటికీ విస్మరించకూడదు. అంతేకాకుండా ఆ భాద్యతను బట్టే తనకి విలువ లభిస్తుందనే సత్యాన్ని ఎల్లపుడూ గుర్తుంచుకోవాలి. - చార్లెస్ డికెన్స్
మనసుకి విషాదం అంటకూడదు. ఎందుకంటే మనిషి జీవితంలో విషాదాన్ని మించిన మనోవికారం లేనేలేదు.కోపంతో వున్న పాము తన చెంతకొచ్చిన పసిపాపలని సైతం విచక్షణ లేకుండా కాటువేసినట్లే, విషాదం కూడా మనిషిని నిలువెల్లా నశింపచేస్తుంది. - వాల్మీకి.
సంఘర్షణ,ఎగుడుదిగుడు బాటలు లేని జీవితం నిస్సారంగా ఉంటుంది. అందుకే తనకి అప్పుడప్పుడు ఎదురయ్యే విషమ సమస్యలని సహించగలగడమే మనిషి తెలివైనా, గొప్పదనమైనా! - వినోబా భావే.
మనిషి తన స్నేహితులని పెంచుకొంటూ పోవాలి . వీలైనంత ఎక్కువమందితో స్నేహం చేయాలి. పరిచయస్తుల బృందాన్ని విస్తరించుకోవాలి. అలా చేసుకొంటూ సాగే మనిషికి వారందరిలో ఎక్కడో ఒకచోట తనకి అన్నివిధాలా నచ్చిన వారూ , తన స్వభావానికి తగిన వారూ మిత్రులుగా లభించకపోరు. - హెచ్ . ఎం . దేశాయ్ .
సందేహం మనిషికి భయంకరమైన శత్రువు. అది మనిషి హృదయంలో లేనిపోని భయాలని పుట్టిస్తుంది.వాటివల్ల ఎంతో నమ్మకంతో జయించగలమన్న వారి ముందు సైతం మనం తలవంచుకోవాల్సిన విషమ పరిస్థితులు ఎదురవుతుంటాయి. - షేక్స్పియర్
అజ్ఞానంలో ఉన్న మనుషులు ఆపదలు వచ్చినపుడు అదృష్టాన్ని నిందిస్తారు కానీ,తాము చేసిన చెడ్డపనులను గురించి ,చేయలేకపోయిన మంచిపనుల గురించి క్షణమైనా ఆలోచించారు. - వేదవ్యాసుడు.
మన మనసులో నిరంతరం సజీవంగా వుండే క్రియాత్మకమైన ఆలోచనలు మన జీవితంతో పాటు ప్రపంచాన్ని సహితం మార్చేస్తాయి. - జార్జ్ షిన్
జీవితంలో పైకి వచ్చే ఎంతోమందిని చూసి మనం అదంతా అదృష్టం ఫలితం అంటుంటాం. అయితే మనం ఓ విషయం తెలుసుకోవాలి --అదృష్టం అనేది అన్ని విధాలా సిద్ధంగా వున్న మనిషినే వరిస్తుంది. --- లూయిస్ పాశ్చర్
అవకాశాలు వచ్చి మన తలుపులు తట్టవు. మనమే వెళ్ళి వాటి తలుపులు తట్టాలి. అయితే ఓసారి మనం ఆ పని చేసామంటే,మనకి ఎక్కడపడితే అక్కడ అవకాశాలు కోకొల్లలుగా దర్శనమిస్తుంటాయి. - థామస్ జె. వాట్సన్
మనిషి తమ మమకాలీకుడైన వ్యక్తిలోని మంచిగుణాలకన్నా,ఆ వ్యక్తిలోని మనిషికే ఎక్కువగా పొగడ్తలు అందిస్తుంటాడు. కానీ,ముందు తరాల్లో మాత్రం ఆ మనిషి కన్నా అతని గుణ సంపదకే ఎక్కువ సన్మానం లభిస్తూ ఉంటుంది. - కాల్టన్
ఆత్మవిశ్వాసం,ఆత్మజ్ఞానం,ఆత్మనిగ్రహం ఈ మూడు లక్షణాలు మనిషి జీవితాన్ని ఎంతో శక్తివంతంగా తయారుచేస్తాయి. - టెన్నీసన్
సంస్కృతి అంటే కేవలం ఓ ఆభరణం కాదు. అది ఓ జాతి స్వభావానికి సజీవమైన ప్రతీక. అంతేకాదు కోట్లాది హృదయాలను స్పందింపజేసి, వాటిని చక్కగా మలచే శక్తివంతమైన సాధనం. సంస్కృతి ఉద్దేశ్యం చక్కటి జీవనం. - w . సోమర్సెట్ మాం.
జీవితం ఎంత విలువైనదో,అంత చిన్నది కూడా,అందుకే మనం గతించిన వాటిని గురించి వ్యర్థంగా మదనపడుతూనో,జరగబోయే వాటిని విలాసవంతంగా ఊహించుకుంటూనో క్షణకాలం కూడా వృధా చేయకూడదు. - డోరథీ స్టాంగ్.
మాటలకు ఉన్న శక్తి అంతా యింతా కాదు. సరైన సందర్భంలో శక్తివంతంగా వుపయోగించబడిన మాటల ప్రభావం వల్ల సకల శక్తియుక్తులతో సాగివస్తున్న సైన్యం ఆగిపోతుంది;అపజయం అద్భుతమైన జయంగా మారిపోతుంది. చెల్లాచెదురయ్యే ఆ సామ్రాజ్యం తిరుగులేని సుస్థిరతని పెంపొందింప జేసుకొంటుంది. - ఎమైల్ డి . గిరార్డిన్.
మనిషి,తను ఎంచుకున్న వృత్తికి సంబందించిన ఏ పని చెయ్యడానికైనా సిగ్గుతోనో,అవమానంతోనో వెనుకాడకూడదు. తను చేస్తున్న వృత్తికి తాను అందకుండా దూరంగా,అంటీముట్టనట్లుగా వుండే వ్యక్తికీ,ఒకరోజున ఆ వృత్తే అందనంతగా దూరమై పోతుంది. - విక్టర్ హూగో
ప్రపంచములో అనేక పర్యాయాలు,ఎంతో మందికి చేతికి అందిన అవకాశాలు చేజారిపోవడానికి కారణం - వారు ఒకేసారి అనేక పనులపైకి తమ దృష్టిని మల్లించడం,ఎందులోనూ దృష్టిని కేంద్రీకరించలేకపోవడం. -- పి .టి .బర్నమ్.
ఎందుకోగానీ,ఈ ప్రపంచంలో ఉపదేశాలంటే ఎవరూ యిష్టపడరు. నిజానికి వాటి అవసరం ఎక్కువగా వున్నవారు,వాటిని ఎంతో తక్కువగా యిష్టపడుతుంటారు. - జాన్సన్
జీవితంలో భరించలేని తలంపులు ఎదురయ్యేది.... మనం ఏవేవో ప్రశంసలని ఊహించుకొంటూ,ఎంతో కష్టపడి పనిచేసి,చివరకు ఊహించిన విధంగా ప్రశంసలు లభించక మనం మానసికంగా కృంగిపోయినపుడు. - ఎడ్గర్ డబ్ల్యు హోమ్.
మరిన్ని స్ఫూర్తి దాయక మాటలను sayloudtelugu లో చదువుటకు క్లిక్ హియర్ 👈
2 Comments
మంచి విషయాలు తెలియ చేసినా అందుకు ధన్యవాదాలు
ReplyDeleteThank you...
Deleteమీరిచ్చే ప్రతి కమెంట్ ప్రోత్సాహమే మన సే లౌడ్ తెలుగు కు ఉత్సాహం ......అందుకే కమెంట్ చేయండి మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.