జంధ్యాల జోక్స్ పార్ట్ 3 sayloudtelugu
బతికే ఉంది 😆😀😆
"ఈ తాగుడు అలవాటు ఎన్నాళ్ళ నుంచి?
అడిగాడు హిప్నోటిస్ట్ పట్టాభి.
"ఐదేళ్ల నుంచి " చెప్పాడు ప్రసాదరావు.
"ఓ. కే.. నేను హిప్నోటైజ్ చేసి మీ అలవాటు మాన్పిస్తాను.
ఇప్పుడు... మీరు... ఆరేళ్ళు వెనక్కి వెళ్తున్నారు....
వెళ్తున్నారు... వెళ్ళారు ...."
చేతూలూపుతున్నాడు పట్టాభి.
"అయబాబోయ్... మీకో దండం
అప్పుడు మా ఆవిడ బతికే ఉంది."
పరిగెత్తాడు ప్రసాదరావు.
😆😀😆 కోరిక
"నాన్నా.. నాన్నా.. నాకు సన్నాయి నేర్చుకోవాలనిఉంది.నేర్పించటానికో సన్నాయి కొనిపెట్టవా?"పదోక్లాస్ చదువుతున్న కొడుకు అడిగాడు తండ్రిని."వద్దురా... వేళాపాళా... లేకుండా వాయిస్తేఇంట్లో డిస్టర్బన్సుగా ఉంటుంది"అన్నాడు తండ్రి."ఫర్లేదు నాన్నా.. మీరంతా నిద్రపోయిన తరువాతవాయించుకొంటాను"చెప్పాడు కొడుకు
😆😀😆 అబద్దం 😆😀😆
"నా భార్య ఈ మధ్య అబద్దాలు చెప్పడం నేర్చుకుంటున్నది"
చెప్పాడు భవానీశంకరం.
"ఏం? ఏవైనా చీరలుకొని రేటు తక్కువ ఎక్కువ చెబుతున్నదా?
అడిగాడు సుబ్బిశెట్టి.
"కాదు, గత రాత్రంతా తాను చింతామణి దగ్గర గడిపినట్లు చెప్పింది"
"దాన్లో అబద్ధమేముంది?"
"గతరాత్రి చింతామణితో గడిపింది నేను" చెప్పాడు భవానీశంకరం"
😆😀😆 చల్లబడ్డాక 😆😀😆
"రష్యావాళ్ళు,అమెరికావాళ్ళు చంద్రలోకానికి వెళ్లారు. అవునా?"
"అవును"
"నేను సూర్యలోకానికి వెళ్తాను"
"కాలి బూడిదైపోతావు"
"ఆ మాత్రం నాకు తెలియదా? సాయంత్రం చల్లబడ్డాక వెళ్తాను"
😆😀😆 రెండు 😆😀😆
"మీరు చేసిన రెండు పెద్ద తప్పులు చెప్పండి"
ప్రేమ ఒలకబోస్తూ అడిగింది గయ్యాళి కాంతం.
"ఒకటి - నిన్ను పెళ్ళి చేసుకోవడం
రెండు - నీకు విడాకులు ఇవ్వకపోవడం"
చెప్పాడు కాంతయ్య.
😆😀😆 వృత్తి 😆😀😆
"కులవృత్తులను నమ్ముకుంటే బాగుపడతారని ఉపన్యాసాలిస్తారు!!
నమ్ముకున్నందుకు జైల్లో పెట్టారు"
బాధగా చెప్పాడు రామకృష్ణ 😒
"అదెలా? మీ కులవృత్తి ఏంటి?
అడిగాడు సోమయ్య
"మా తాతముత్తాతలనుంచీ దొంగతనమే మా కులవృత్తి.
చెప్పాడు రామకృష్ణ .
😆😀😆 అబద్ధం 😆😀😆
"సార్... మా ఆవిడకు ఒంట్లో నలతగా ఉంది. ఆస్పత్రికి తీసుకెళ్ళాలి.
మధ్యాహ్నం నుంచీ లీవ్ కావాలి సార్" ఆఫీసర్ను అడిగాడు రాజు.
"అవసరం లేదోయ్... మీ ఆవిడ ఇందాకనే ఫోన్ చేసి తనకు బాగానే
ఉన్నట్లు, నీవు ఇంటికి రానక్కర్లేనట్లు చెప్పింది. చెప్పడం మరిచాను.
సారి. వెళ్లి పని చూస్కో" అన్నాడు ఆఫీసర్.
"సార్... మీరు నాకంటే పచ్చి అబద్దాలు ఆడుతున్నారు. నాకసలు పెళ్లే
కాలేదు" చెప్పాడు రాజు.
😆😀😆 కనీసం కుక్కనైనా 😆😀😆
"సార్... సార్... మా ఆవిడ కుక్కను షికారుకు తీసుకెళ్తున్నానని మొన్ననగా
వెళ్ళి ఇంతవరకూ తిరిగి రాలేదు. మీరే వెతికి పెట్టాలి సార్... "
ఎస్సైతో మొరపెట్టుకున్నాడు పంతులు.
"ఎక్కడని వెతకాలయ్యా మీ ఆవిడను. వస్తుందిలే. కంగారు పడకు"
అన్నాడు యస్సై.
"సార్... నేను వెతికి పెట్టమంటున్నది మా ఆవిడను కాదు సార్..
కుక్కను. అది చాలా విశ్వాసం గలది. అన్నాడు పంతులు.
😆😀😆 ఫరవాలేదు 😆😀😆
"నాన్నా... నాన్నా... అమ్మ మన దొడ్లో బావిలో దూకింది."
కంగారుగా చెప్పాడు బాబ్జి.
"అయ్యయ్యో... ఎన్ని కప్పలు చచ్చాయో పాపం. పద పద ..."
పరిగెత్తాడు తండ్రి.
"అమ్మ బావిలో దూకిందంటే కప్పలు చచ్చాయంటావేంటి నాన్నా... ?
"అమ్మకేం ఫరవాలేదురా... బావిలో మోకాలి లోతు నీళ్ళు కూడా లేవు.
మహా అయితే కాళ్ళు విరిగుంటాయి.
😆😀😆 సీసాలు 😆😀😆
"మీరెలాగూ తాగుడుమానరు. ఆ తాగుడేదో బార్లలో తాగకుండా
ఇంటికే తెచ్చుకొని తాగొచ్చుగా"అరిచింది శ్రీదేవి.
"ఏంటి దేవీ? నువ్వు చెప్పేది నిజమేనా?
సంభ్రమంగా అన్నాడు ప్రసాదు.
"అవును. ఖాళీ సీసాలమ్ముకున్నా బోలెడు డబ్బులొస్తాయి"
అన్నది శ్రీదేవి.
😆😀😆 లేవు 😃😃😃😃
"హలో శంకరం... చాలారోజులకు కనిపించావు... రా...
అలా హోటల్ లో కూర్చుని టిఫిన్ చేద్దాం"
రాజబాబు అన్నాడు.
"ఇప్పుడే చేశారా.... నువ్వు చెయ్యి "
"నా దగ్గరే డబ్బులుంటే నిన్నెందుకు రమ్మంటాను రా"
గొణిగాడు రాజబాబు.
😆😀😆 ఎవరన్నారు ? 😄😄😄😄😄
భార్యాభర్తలిద్దరూ గంటసేపు పోట్లాడుకున్న తరువాత
"ఛీ ఛీ .... నీతో వాదించడంకంటే ఆ గోడతో వాదించడం మేలు.
మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు."
అన్నాడు భర్త.
"కాదని ఎవరన్నారు నిజమే
అన్నది భార్య.
😆😀😆 పెద్దది 😆😀😆
"డాడీ... ఒకటి పెద్దదా?నలభై పెద్దదా?
"నలబైయ్యే పెద్దది ఎందుకు?"
"నాకు క్లాసులో నలభయ్యో ర్యాంక్ వచ్చిందిలే. అందుకు".
😆😀😆 రాళ్ళు 😆😀😆
"వెరీ గుడ్ బియ్యంబస్తాలోని రాళ్ళన్నింటిని పదినిముషాలలో
ఏరిపారేసావ్. నీకు నా హోటల్లో ఈ ఉద్యోగమే ఇస్తాను చేస్తావా?"
హోటల్ యజమాని అడిగాడు రాఘవులను.
"చిత్తంసార్... కానీ సాయంత్రం ఆరింటికల్లా నన్ను వదలాలి.
ఏడుగంటలనుండీ రైస్ మిల్లులో ఉద్యోగం చేస్తున్నాను."
"తప్పకుండా!! అక్కడేం పనిచేస్తావు?
"బియ్యంలో రాళ్ళు కలిపే ఉద్యోగం".
😆😀😆మౌనవ్రతం 😏😏😏
"ఇకనుంచీ నేను వారానికోరోజు మౌనవ్రతం పాటించాలని
నిర్ణయించుకున్నాను వింటున్నారా?"అన్నది సూర్యకాంతం.
"ఎందుకో"అన్నాడు సుబ్బారావు.
"పుణ్యం కోసం"
"పోనీ... వారంలో ఏడురోజులూ మౌనవ్రతం పాటిస్తే పుణ్యం మరింత
వస్తుందేమో"అన్నాడు సుబ్బారావు తలమీద బొప్పిని తడుముకుంటూ.
😆😀😆 ప్రకటన 😆😀😆
"అందమైన భార్య కావాలని ప్రకటనివ్వడం పొరబాటయ్యింది"
విచారంగా అన్నాడు మహర్షి.
"ఏమైంది? రెస్పాన్సేమీ లేదా? అన్నాడు సత్యం.
"నాలుగొందల ఉత్తరాలు వచ్చాయి'
"మరి ఏడుస్తావేం? ఎవరో ఒకర్ని సెలెక్ట్ చేసుకోక"
"అందరూ తమ భార్యలను తీసుకు పొమ్మని రాశారు.
ఎవరి భార్యను ఎన్నుకోవాలి?
😆😀😆 ఉద్యోగి 😆😀😆
"సార్... వచ్చే నెల నా జీతం పెంచాలండీ"
అన్నాడు ఉద్యోగి.
"ఎందుకు నాయనా ?ఏం ఘనకార్యం సాంధించావని?'
అడిగాడు యజమాని.
"ఈ నెలలో నాకు పెళ్ళి సార్"
"చూడు నాయనా, కంపెనీ బయట జరిగే ప్రమాదాలకు మా బాధ్యత
ఏమీ ఉండదు వెళ్ళు."
😆😀😆 అభిప్రాయం 😆😀😆
"ఆఁ .... శాస్త్రిగారూ... ఇప్పటివరకూ నేను వినిపించిన
నూరు కవితలు విన్నారు. వాటి మీద మీ అభిప్రాయం
ఒక్క మాటలో చెప్పండి."అన్నాడు కవి శునకం 😊
"అభిప్రాయం చెప్పడానికి ఒక వాక్యం కావాలా?
ఒక్క అక్షరంలో చెప్పగలను"అన్నాడు శాస్త్రి.
""ఛీ ""
😆😀😆 నమ్మకం 😆😀😆
"మన భాస్కర్ పరిక్ష పాసైతే మోటార్ సైకిల్ కొనిస్తానన్నారు?
చేతిలో చిల్లిగవ్వలేకుండా ఏధైర్యంతో అలా అన్నారు?"
కోపంగా అడిగింది భార్య.
"మన వాడి మీద నమ్మకంతో..."
క్లుప్తంగా చెప్పాడు భర్త.
😆😀😆 వేలు 😆😀😆
రంగారావువద్దకు వచ్చింది నర్సు. అప్పుడే కరెంటు పోయింది.
"సార్ ... మీ భార్య ప్రసవించింది. బిడ్డను చూడండి."అన్నది నవ్వుతూ.....
రంగారావు ఆత్రంగా పసిబిడ్డ వళ్ళంతా తడిమి ""హమ్మయ్య.... మగబిడ్డే ""
అన్నాడు ఆనందంగా.
"సార్. మీరు పట్టుకున్నది నా వేలు" అన్నది నర్సు సిగ్గుపడుతూ . 😀😀😀
😆😀😆 కవల పిల్లలు 😆😀😆
"నేను చేసుకోబోయే అమ్మాయి,ఆమె చెల్లెలు ఇద్దరు కవలలు "
చెప్పాడు నాగేశ్వర్రావు.
"అలాగైతే ఎలా? రేపెప్పుడైనా నువ్వు అత్తగారింటికి వెళ్ళినపుడు
మీ ఆవిడనేలా గుర్తుపడతావు?"సందేహంగా అడిగాడు శ్యామ్ ,
"నాదేం బోయింది? ఏదైనా పొరపాటు జరిగితే అనుభవించేదివాళ్ళే "
నవ్వుతూ అన్నాడు నాగేశ్వర్రావు.
😆😀😆 దివాలా 😆😀😆
"అరటి పళ్ళ వ్యాపారం బ్రహ్మాండంగా ఉందన్నావ్.
మరి దివాలా ఎలాతీశావురా?"సురేష్ ను అడిగాడు సూరి.
"ఏం చేయమంటావురా? నేను వ్యాపారం మొదలెట్టగానే
మా అమ్మా నాన్నా గురువారాలు,మా ఆవిడ శనివారాలు,
చెల్లెళ్ళిద్దరూ మంగళవారాలు,మా వదినెలు శుక్రవారాలు,
మా అబ్బాయిలిద్దరూ సోమవారాలూ ఉపవాసాలు ఆరంభించారు.
మా అన్నయ్య భవానీ దీక్ష,బాబాయి అయ్యప్ప దీక్ష.
తమ్ముడు శివదీక్ష పట్టారు..... దాంతో...... "
నెత్తిన ముసుగేసుకుంటూ అన్నాడు సురేష్.
😆😀😆 పుల్ స్టాప్ 😆😀😆
"సుధాకర్.... 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.
ఇంకా ఎన్నాళ్ళు?
వీటికి పుల్ స్టాప్ పెట్టి ఇక పెళ్ళి చేసుకొందాం... "
పార్కు లో చెప్పింది దీప.
"అలాగే డార్లింగ్
నాకు పెళ్ళి సంబంధం కుదిరింది.
మరి నీ సంగతి"?
అడిగాడు సుధాకర్!!!
😆😀😆 ఇదేంటి? 😆😀😆
"ఇదేంటయ్యా బాబు పేషేంటును ఆపరేషన్ ధియేటరుకు
తీసుకెళ్తుంటే పూలదండలు తెచ్చారు?"
సంభ్రమంగా అడిగాడు డాక్టర్.
"ఆపరేషన్ సక్సెస్ అయితే మీకు ఫెయిలైతే పేషంటుకు వేద్దామని సార్."
చెప్పారు వారు.
😆😀😆 ఆరు మాసాలు 😆😀😆
"మొన్న వచ్చిన పెళ్ళి సంభందం వాళ్ళు చేసుకోమని
కబురుపంపించారటగా విశాలా?" అడిగింది శాంతమ్మ.
"అవును పిన్నీ... పాట ఏదైనా పాడమన్నారు. పాడాను.
ఈ విధంగా రాశారు."అన్నది విశాల.
"నువ్వు పాటలు బాగానే పాడుతావుగా.
నీ గొంతు నచ్చకపోవడం ఉండదే".
"నిజమే... వాళ్ళు సడన్ గా అడగ్గానే ఎంత ఆలోచించినా
ఒక్కపాటా గుర్తుగొచ్చి చావలేదు.
దాంతో అంతకుముందే రేడియోలో విన్న
"ఆరు మాసాలాగు-పుడతాడు మనకో బాబు.... "అన్న పాటపాడాను!!"
చెప్పింది విశాల. 😂😂😂
😉😉😀😀😂 పేరు 😆😀😆
ఇద్దరు తాగుబోతులు ---
"నీ పేరేమిటి?"
"తెలీదు"
"ఎంత మంచి పేరు?"
😆😀😆 ఛాయిస్ 😆😀😆
"ఏమయ్యా.... అసలు నువ్వు మా అమ్మాయి గురించి
ఏమనుకుంటున్నావు?మా అమ్మాయి నిప్పు.
మా అమ్మాయి వెంట పడుతున్నావు. దాన్ని పెళ్ళి చేసుకొందామనా?
లేక సరదా కోసం తిరుగుతున్నావా?"కోపంగా అడిగాడు రామనాధం
"ఓహో ... ఛాయిస్ ఉందా. ఆలోచించుకుని చెబుతాను."
అన్నాడు కిరణ్ హుషారుగా...
😆😀😆 రికార్డు 😁😀😀😁
హాస్పిటల్లో---
"ఒకే కాన్పులో పదిమంది పిల్లలు కలగటం
ప్రపంచంలోనే అతి పెద్ద వింత. గిన్నీస్ బుక్లోకి ఎక్కాలి.
గత సంవత్సరం ఎవరో ఒకావిడ ఒకే కాన్పులో తొమ్మిందిమందిని
ప్రసవించి రికార్డ్ సృష్టించింది.
ఇప్పుడు మీ ఆవిడ ఆ రికార్డును అధిగమించింది. కంగ్రాట్స్"
కుటుంబరావును అభినందించాడు వార్తాహరుడు.
"ఆ పాత రికార్డ్ కూడా మా ఆవిడదేనండీ.
తన రికార్డు తానే బ్రేక్ చేసుకుంది. "
విచారంగా చెప్పాడు కుటుంబరావు.
"ఐ .సీ ... అయితే తొందరపడి వార్త రాయనులెండి.
మరో సంవత్సరం చూస్తాను. "
అన్నాడు విలేకరి.
😆😀😆 చూడకుండా 😆😀😆
"ఆ ఒక్క పాఠాన్ని ఇరవై రోజులనుంచీ చదువుతున్నావు
ఎన్నాళ్ళు బోయినా చూడకుండా
ఒక్క వాక్యం చదవలేకపోతున్నావు గదరా వెధవా !!"
పదోతరగతి చదువుతున్న మనుమణ్ణి తిట్టాడు తాతయ్య !!
నువ్వు పదిహేనేళ్ళ నుంచీ ఆ భగవద్గీతను చదువుతున్నావు...
ఇంతవరకూ చూడకుండా ఒక్క శ్లోకం చదవగలిగావా?
అడిగాడు మనుమడు. 😉😉
😆😀😆 పళ్ళు 😆😀😆
"హలో అవధానిగారూ... పళ్ళు పీకించుకోవడానికి
నిన్న అపాయింట్మెంట్ తీసుకొని రాలేదేం?"
బజార్లో అడిగాడు డాక్టర్.
"నిన్న సాయంత్రం ఒకడితో తగాదా పడితే
రేపీపాటికి నీ పళ్ళు రాలగొడతానన్నాడు.
డబ్బుదండగెందుకని... చెప్పాడు అవధాని.
😆😀😆 పేరు 😆😀😆
"కొత్తగా రేసు గుర్రాన్ని కొన్నాను. పేరు ఏం పెడితే బాగుంటుంది
జంధ్యాలగారూ?"అడిగాడు చక్రవర్తి.
"Bad News అని పెట్టు" చెప్పారు జంద్యాల.
"శుభమా అని గుర్రం కొంటె అదేంపేరండీ?"
"మీకు తెలియదేమో?Bad News Travels Fast అన్నారు పెద్దలు."
చెప్పారు జంధ్యాల.
😆😀😆 డబుల్ 😆😀😆
"సార్... నాకు ప్రతి వస్తువూ రెండుగా కనపడుతున్నాయి సార్...
కొంచెం చూడండి". డాక్టరుతో అన్నాడు సాంభశివరావు.
"రెండు కళ్లున్నాయి కదా. అందుకై ఉండవచ్చు,కంగారుపడకండి..
ఆపరేషన్ చేసి ఏదో కన్ను తీసేస్తాలేండీ"
అభయమిచ్చాడు డాక్టర్.
😆😀😆 పక్క పక్క 😆😀😆
"ఏరా పూర్ణచంద్రా! ఇల్లు కోన్నావటగా !ఎక్కడ ?
"ఆంజనేయస్వామి గుడి పక్కన"
"ఆ గుడెక్కడ?"
"మా యింటి పక్కన"
"సరే రెండూ ఎక్కడా?"
"పక్కపక్కనే!!!"
😆😀😆 టైం 😆😀😆
"ఏరా వాసూ... మీ పెళ్లై ఐదు నెలలు కూడా కాలేదు.
అప్పుడే బిడ్డ ఎలా పుట్టాడు రా?"
అర్చర్యంగా అడిగాడు శేషు.
"బిడ్డ సరైన టైముకే పుట్టాడురా.
మా పెళ్ళే సరైన టైముకు జరగలేదు."చెప్పాడు వాసు.
😆😀😆 పట్టుదల 😆😀😆
"పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్"
అన్నాడు నరసింహం.
"అలాగా.... అయితే ఈ గ్లాస్లో పాలు కిందపోస్తాను.
మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం"
ఎదురన్నాడు కొడుకు.
😆😀😆 భయం 😆😀😆
"నాకూ,మా ఆవిడకు ఏదైనా కోడవైతే
నేను వెంటనే మా ఇంట్లో బావిని చెక్కతో మూసి ఉంచుతాను"
"ఏం... మీ ఆవిడ అలిగి నూతిలో దూకుతుందని భయమా?"
"కాదు... నన్ను తోసేస్తుందని"
😆😀😆 వాపస్ 😆😀😆
"అదేంట్రా... మీరిద్దరూ విడాకుల కోసం కేసు కూడా వేసుకున్నారు.
మళ్ళి ఇంతలోనే రాజీకొచ్చారా?"అర్చర్యంగా అడిగాడు శర్మ.
"అవున్రా . మేము విడాకులు తీసుకుంటే మా పెళ్ళికి తాము చదివించిన
కనుకలన్నీ తమకు తిరిగివ్వాలని పెళ్ళి కొచ్చిన వాళ్లంతా నోటీసులు
పంపేర్రా. అందుకని... "చెప్పాడు శాస్త్రి
😆😀😆 మొదటి తప్పు 😆😀😆
"నువ్వు గతంలో అనేక నేరాలు చేసావు. అయినా మొదటి తప్పుగా
క్షమించమని అడుగుతున్నావేం?తమాషాగా ఉందా?"
గర్జించాడు జడ్జి.
"కాదు యువరానర్... మా లాయర్ కొత్తగా ప్రాక్టీస్ పెట్టాడు.
నాదే మొదటి కేసు. వాదించలేకపోయాడు.
అందుకే మొదటితప్పుగా మన్నించమంటున్నాను."
చెప్పాడు ముద్దాయి.
😆😀😆 నిద్రపోయేముందు 😆😀😆
డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ మెడికల్ షాపు వాడికిచ్చి,
"ఇందులో రాసిన మందు సీసాలు రెండివ్వండి"
అని అడిగాడు వాసు.
"రెండెందుకండీ?"
అమాయకంగా ప్రశ్నించాడు షాపువాడు.
"ఈ సీసాలోని మందు నిద్రపోయేముందు తాగమన్నారు.
ఒకటి ఇంట్లోకి,రెండవది ఆఫీసులోకి"
😆😀😆 ఎవరు? 😆😀😆
నువ్విలా పీకల దాకా అప్పుల్లో కూరుకుపోవడానికి
కారణం ఎవర్రా? తాగుడా , పేకాటా,గుర్రప్పందాలా?
అడిగాడు రవి.
"ఏవి కావు. అప్పులిచ్చిన గాడిద కొడుకులే"
కోపంగా చెప్పాడు గిరి.
Sayloudtelugu మరిన్ని జోక్స్ చదువుటకు క్లిక్ హియర్
0 Comments
మీరిచ్చే ప్రతి కమెంట్ ప్రోత్సాహమే మన సే లౌడ్ తెలుగు కు ఉత్సాహం ......అందుకే కమెంట్ చేయండి మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.