వివిధ రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధుల లక్షణాలు మరియు చికిత్స వివరాలు
1.గౌట్ :
గౌట్ వ్యాధి రక్తంలో యూరిక్ యాసిడ్ అధికముగా పెరుగుట వలన వస్తుంది. ఈ వ్యాధి ముఖ్యంగా మగవారిలో మూత్రపిండాల (KIDNEY) సమస్యలు ఎక్కువగా ఉన్న వారిలో వస్తుంది.
వ్యాధి లక్షణాలు :
ఈ వ్యాధి లక్షణాలు ముఖ్యంగా కాలి బ్రొటన వేలుకు దగ్గరలో ఉన్న కీలుకు వస్తుంది. ఉన్నట్టుండి కీలులో తీవ్రమైన నొప్పి,వాపు,ఎరుపు వస్తాయి. క్రమంగా అన్నీ కీళ్ళకు వ్యాపిస్తుంది. ఇటువంటి లక్షణాలు వరం రోజులు ఉండి తగ్గిపోతాయి. మరలా కొన్ని నెలలకు అదేవిధమైన లక్షణాలు వస్తూ పోతూ ఉంటాయి. చికిత్స తీసుకోకపోతే అన్ని కీళ్ళకు వ్యాప్తి చెంది నొప్పులు ప్రతి రోజు వస్తాయి. ఈ అధిక మొత్తంలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ గడ్డలు గడ్డలుగా(Tophi) చర్మం కింద చేరిపోయి కీళ్లకే కాకుండా మూత్రపిండాలలో రాళ్లగా తయారై కిడ్నీ పనితీరును తగ్గిస్తుంది.
చికిత్స :
యూరిక్ యాసిడ్ తగ్గించే మందులు క్రమం తప్పకుండా వాడాలి. నొప్పి వచ్చినప్పుడు తీవ్రతను బట్టి నొప్పినివారణ మందులను డాక్టర్ సలహా మేరకు వాడాలి.
2. ఏకైలోజింగ్ స్పాండిలైటిస్:
ఏకైలోజింగ్ స్పాండిలైటిస్ దీర్ఘకాలం ఇబ్బంది పెట్టె కీళ్ళు , వెన్నుపూసలకు సంభందించిన ఆర్థరైటిస్ వ్యాధి. ముఖ్యంగా ఈ వ్యాధి యుక్త ,మధ్యవయస్సులో (45 ఏళ్ళు)ఉండే మగవాళ్ళతో ఎక్కువగా వస్తుంది. సాధారణంగా HLA B27 (హ్యూమన్ ల్యూకోసైట్ యాంటిజెన్ B27) అనే జన్యువు ఉండే వారిలో ఈ వ్యాధి ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది.
వ్యాధి లక్షణాలు:
నడుము నొప్పి మరియు మెడనొప్పి ముఖ్యంగా రాత్రి వేళల్లో మరియు తెల్లవారుజామున ఎక్కువగా ఉంటుంది. నిద్రలేచి ఒక గంట తరువాత కొంత ఉపశమనం ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకోని వారిలో క్రమంగా గూని ఏర్పడటం,నడుము కదలికలు తగ్గిపోవటం జరుగుతుంది. (కీళ్ళ నొప్పులు- ముఖ్యంగా కాలి వేళ్ళు,మోకాళ్ళు ,గిరకలు,భుజాలు నొప్పులు ఆప్పుడప్పుడు చేతి వేళ్ళలో నొప్పులు వాపులు వస్తాయి.
కొంతమందిలో నడుము నొప్పి , కీళ్ళ నొప్పులతో పాటుగా కంటికి కూడా వస్తుంది. కళ్ళు ఎర్రగా అవడం,నొప్పి,వెలుతురు చూడలేకపోవడం,నీరు కారుట,చూపు తగ్గిపోవుట వీటిలక్షణాలు.
చికిత్స :
వ్యాయామం,ఈత క్రమం తప్పకుండా చేయాలి. నొప్పినివారణ మందులను( DMARDS),బయోలాజిక్ (Anti TNF drugs)మందులను డాక్టర్ను సంప్రదించి వాడవలెను.
3. ఆస్టియో అర్థరైటిస్ :
కీళ్ళు అరిగిపోవుట వలన వచ్చే నొప్పులు ముఖ్యంగా యాభై సవత్సరాలు పైబడినవారిలో,ఎక్కువగా స్త్రీలలో వస్తాయి.
మోకాళ్ళ నొప్పులు,ముఖ్యంగా క్రింద కూర్చునేటప్పుడు,మెట్లు ఎక్కేటప్పుడు ఎక్కువగా వస్తాయి. కొంతమందిలో తుంటి ఎముకలో,భుజాలు,గిరకలు,చేతివేళ్ళ కీళ్ళలో కూడా నొప్పులు వస్తాయి.
చికిత్స :
- బరువు తగ్గుట,వ్యాయామాలు నొప్పినివారణ మందులు వాడుటద్వారా
- గుజ్జు అరుగుదలను నెమ్మదిగాచేసే మందులను వారుట,కొన్ని సార్లు గుజ్జు లాంటి పదార్ధం (హయాలురానిక్ యాసిడ్) ను సూది మందు రూపంలోకి ఇవ్వవచ్చు.
- తీవ్రంగా అరిగిపోయిన కీళ్ళకు కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అవసరం అవుతుంది.
4. సిస్టమిక్ ల్యూపస్ ఎరిథిమాటోసిస్ (SLE):
5. షోగ్రెన్స్ సిన్డ్రోమ్ (sjogren's syndrome):
- షోగ్రెన్స్ సిన్డ్రోమ్ నాళ గ్రంధులకు (Exocrine glands)వచ్చే ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఈ వ్యాధిలో ముఖ్యంగా నోటిలోని లాలాజల గ్రంధులు ప్రభావితం అవుతాయి.
వ్యాధి లక్షణాలు:
- నోరు,కళ్ళు,పొడిబారుట చర్మం పై ఎర్రటి మచ్చలు,దీర్ఘకాలం జ్వరము,విపరీతమైన అలసట,కాళ్ళు,చేతులు విపరీతమైన తిమ్మిర్లు,మంటలు ఈ వ్యాధి లక్షణాలు.
6. స్లేరోడెర్మా (సిస్టమిక్ స్క్లిరోసిస్ ):
- చర్మానికి కీళ్ళకు వచ్చే ఆటో ఇమ్యూన్ వ్యాధి. చర్మం నల్లగా మారుట. చర్మం బిగుతుగా మారుట. నోరు చిన్నదిగా మారుట. కీళ్ళ నొప్పులు పిడికిలి బిగించలేక పోవుట.
- చలి గాలికి చేతి వేళ్ళు నీలం రంగుకు మారుట,తిమ్మిర్లు కొన్ని సార్లు వేళ్ళ చివర పుండ్లు ఏర్పడుట. ఊపిరితిత్తులు ప్రభావితం అవడం వలన దీర్ఘకలం పొడిదగ్గు ఆయాసం (ILD),గుండెకు ప్రభావితం అవడం వలన ఆయాసం (pulmonary Arterial Hypertension) వస్తాయి.
7. ఫైబ్రోమైయాల్జియా :
ఫైబ్రోమైయాల్జియా అనేది దీర్ఘకాలికంగా విస్తృతమైన శరీర నొప్పులతో ఉండే పరిస్థితి.అలసటతో పాటు నొప్పి కూడా వస్తుంది. ఫైబ్రోమైయాల్జియా వ్యాధి నిద్ర, జ్ఞాపకశక్తి మరియు మానసిక స్థితిలో సమస్యలను లక్షణాలుగా చూపుతుంది.పురుషుల కంటే మహిళలకు ఫైబ్రోమైయాల్జియా వచ్చే అవకాశం ఉంది.
వ్యాధి లక్షణాలు:
- తలనొప్పి.
- టెంపోరోమాండిబ్యులర్ జాయింట్ (టిఎమ్జె) రుగ్మతల కారణంగా దవడ మరియు ముఖ నొప్పి.
- ఇర్రిటబల్ బౌల్స్ సిండ్రోమ్ (IBS)/ప్రకోప ప్రేగు సిండ్రోమ్.
- ఆందోళన.
- నిరాశ.
- దేహమంతా నొప్పులు, విపరీతమైన నీరసం, నిస్సత్తువ, నిద్రపట్టక పోవుట, కీళ్ళ నొప్పులు
చికిత్స :
- ఈ వ్యాధికి మందులతో పాటుగా వ్యాయామం అతి ముఖ్యం. జీవన శైలిలో మార్పులను తీసుకురావడం వలన చాలావరకు నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.(అంటే చిన్న చిన్న కదలికలతో కూడిన వ్యాయామమం చేయడం ఆహారంలో మార్పులు)
8. ఆస్టియో పోరాసిస్ :
9. పాలిమాయోసైటిస్,డెర్మటోమాయాసైటిస్ :
- కండరాలకు వచ్చే ఆటో ఇమ్యూన్ వ్యాధి.
- కండరాల నొప్పులు, బలహీనత, క్రింద కూర్చొని లేవలేకపోవుట,చేతులు పైకిలేపలేకపోవుట, పడుకొని సహాయం లేకుండా లేవలేక పోవుట.
- చర్మం పై ఎర్రటి మచ్చలు,కీళ్ళ నొప్పులు , ఊపిరితిత్తులు (ILD ) గుండె ప్రభావితం అవడం వలన దగ్గు, ఆయాసం.
10. వాస్కులైటిస్:
- రక్తనాళాలకు సంబంధించి ఆటో ఇమ్మ్యూన్ వ్యాధి.
వ్యాధి లక్షణాలు:
11. జువనైల్ అర్థరైటిస్:
- చిన్న పిల్లలలో వచ్చే కీళ్ళ వాతం.
- చాలా మంది చిన్నపిల్లలలో కీళ్ళ నొప్పులు రావు అనే అపోహలో ఉంటారు. పెద్ద వాళ్ళలో మాదిరిగా పిల్లలలో కూడా కీళ్ళ వాతం ఉంటుంది.
- వీరిలో కూడా కీళ్ళ నొప్పులు, వాపులు, ఉదయం వేళలో, రాత్రి వేళలో నడుము నొప్పి, మాడిమ నొప్పులు,దీర్ఘకాలం జ్వరము, చర్మం పై మచ్చలు ఉంటాయి.

0 Comments
మీరిచ్చే ప్రతి కమెంట్ ప్రోత్సాహమే మన సే లౌడ్ తెలుగు కు ఉత్సాహం ......అందుకే కమెంట్ చేయండి మరియు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.